సాధారణంగా అన్నం తింటే బరువెక్కుతారని అందరూ భావిస్తారు. అందుకనే చాలామంది డైటర్లు అన్నం తినటం మానేస్తారు. కాని అన్నాన్ని కూడా ఒక ప్రణాళిక మేరకు, బ్రౌన్ రైస్ లేదా పాలిష్ పట్టని ముడిబియ్యంతో తింటే అది మీ బరువు తగ్గించటానికి కూడా తోడ్పడుతుంది. ముడి బియ్యం అన్నం ఆహారంలో కొవ్వు, సోడియం, షుగర్, ఉప్పు అన్నీ తక్కువగా వుంటాయి. కనుక అన్న ఆహారం ఎలా తినాలో చూడండి. అన్నంలో కార్బోహైడ్రేట్లు అధికం. కనుక అతిగా తినరాదు. తెల్లటి బియ్యం బదులు బ్రౌన్ రైస్ తినండి. అవి బరువు బాగా తగ్గిస్తాయి. అన్న ఆహారం అంటే అది మాత్రమే పూర్తిగా తినరాదు.
కూరగాయలు - అన్నంతోబాటు పచ్చని ఆకు కూరలు, బచ్చలి, బ్రక్కోలి లేదా బీన్స్, ములక్కాడ వంటివి తీసుకోవాలి. ఉడికించిన పచ్చని కూరలు ఆరోగ్యం పెంచుతాయి. త్వరగా బరువు తగ్గిస్తాయి. కూరలలో మిరియంపొడి వేస్తే రుచిగాను, ఆరోగ్యంగాను వుంచుతుంది. అన్నం ఆహారంలో టమాటాలు, కేరట్లు, మొదలైనవి చురుకుగా వుంచి తగిన పోషకాహారాలను అందిస్తాయి.
పండ్లు - కొవ్వు, అధిక కేలరీల స్నాక్స్ నియంత్రించండి. పండ్లు....నిమ్మ, బత్తాయి, ద్రాక్ష, పైన్ ఆపిల్, ఆపిల్, ఆరెంజి వంటి పండ్లు తినండి. ఆకలిని నియంత్రించేందుకు పచ్చి కూరలు కూడా తినవచ్చు. లేదా వాటి రసం తాగవచ్చు. తాజాయైన ఆర్గానికి పండ్ల రసం ఆరోగ్యం, పోషకత చేకూరుస్తుంది.
ఎండు ఫలాలు - బాదం పప్పు, జీడిపప్పు, మొదలైన ఎండుఫలాలు ఆకలిని నియంత్రిస్తాయి. స్వీట్లు, చాక్లెట్లు, కేకులు, ఐస్ క్రీములు, కేండీలు వంటివి మానండి.
ఉప్పు - ఆరోగ్యవంతమైన శరీరం కొరకు ఉప్పు బాగా తగ్గించండి. మీరు తినే అన్నంలో సహజంగా బియ్యం ఉప్పును కలిగి వుంటాయి. అధికంగా మరోమారు ఉప్పు మీరు కలిపితే, గుండెకు, ఎముకలకు హాని కలిగిస్తుంది.
పాల ఉత్పత్తులు - తక్కువ కొవ్వు కల పెరుగు, పాలు తేలికగా బరువు తగ్గించేందుకు మీ ఆహారంలో చేర్చండి. ఉడికించిన గుడ్లు డైటింగ్ చేసే వారికి చాలా మంచిది.
మాంసం, పందిమాంసం, బీఫ్ వంటి ఇతర మాంసాహార పదార్ధాలు అన్నంతో పాటు తినకండి. అన్న ఆహారం అంటే అది పూర్తిగా శాకాహారంగా వుండాలి.
ఈ రకమైన అన్న ఆహారం తిని ఆరోగ్యవంతంగా బరువు తగ్గించుకోవచ్చు. తగినంత నీరు బాగా తాగండి. శరీరంలో ఎపుడూ తేమ వుండేలా చూడండి.
0 Comments