అవయవాలు షాక్ కొట్టినట్లు అదురుతూ వుంటే వాము
,మిరియాలు , గసగసాలు ఈ మూడు సమబాగాలుగా తీసుకుని కొంచెం దోరగా వేయించి
దంచి జల్లెడ పట్టి వస్త్ర గాలితం చేసి , ఆ పొడికి తగినంత నువ్వుల నూనె
కలిపి మెత్తి పేస్టు లాగా రుబ్బి , ఆ పేస్టు ను వళ్ళంతా రుద్దుకుంటే
అవయవాలు అదిరే రోగము తగ్గుతుంది.
వళ్ళంతా తిమ్మిర్లా? వాము
100gm , తీసుకుని నీటితో మెత్తగా నూరి అందులో 50 gm , ఆవు నెయ్యి కలిపి
చిన్న మంట మీద నెయ్యి మాడి పోకుండా వండి దించి దానిని గోరువేచగా తిమ్మిర్ల
మీద వళ్ళంతా మర్దనా చేసుకుంటూ , అదే నేతి ని పూటకు ఉసిరికాయంత తింటూ
వుంటే తిమ్మిరి తగ్గి పోతుంది .
ముక్కు సమస్య వాము 10gm ,
పాత బెల్లం 40 gm , తీసుకుని 2 కలిపి దంచి ఆ ముద్దను అర లిటరే నీటిలో వేసి
, పొయ్యి మీద పెట్టి చిన్న మంట మీద నిదానంగా పావు లీటర్ కషాయం మిగిలే
వరకు మరిగించి దించి , వడపోసి ఉదయం పూట తాగాలి , అలాగే సాయంత్రం కూడా
తాగాలి.ఇలా 2 లేక 3 రోజులు తాగేటప్పటికి జలుబు , పడిశము , శ్వాససరిగా లేక
పోవటం , సైనసైటీస్ మొదలైన ముక్కుకు సంబంధించిన సమస్యలు తీరతమే కాక ఉదరం
లోని గ్యాస్ తోలిగిమ్పబడి , అగ్ని దీప్తి కలిగి , జీర్ణ శక్తి పెరిగి ,
తిన్న ఆహారం బాగా వంటబట్టి చక్కటి ఆరోగ్యం చేకూరుతుంది.
చెవుడు వాము
50 gm తీసుకుని శుబ్రం చేసి ఆ వామును పావు లీటర్ నీటితో కలిపి దంచి రసం
తీసి , ఆరసం లో నువ్వుల నూనె 100gm , కలిపి చిన్న మంట మీద నీరు ఇగిరి పోయి
, నూనె మాత్రమే మిగిలే వరకు మరిగించి దించి వడపోసి , ఆ నూనె నిలువ
ఉంచుకుని , రోజు 2 పూటల పూటకు 4,5 చుక్కలు చెవిలో వేస్తూ వుంటే క్రమంగా
చెవుడు తగ్గుతుంది.
కళ్ళు దురదలు వాము
చెట్టును సమోలంగా తేచి కడిగి ఎండ బెట్టి కాల్చి బూడిద చేయాలి . ఆ బూడిదను
నీటిలో కలిపి 3 రోజులు నిలువ ఉంచాలి . తరువాత పాత్రలో తేరుకున్న తేటను
వంచుకుని వడపోసి నిలువ వుంచుకోవాలి. దీనిని కళ్ళు దురధలుగా వున్నప్పుడు 2
చుక్కలు కంట్లో వేసుకుంటే దురదలు తగిపోతై.
కనురెప్పల వెంట్రుకలు ఊడుట వాము
3gm తీసుకుని ఇసుక లేకుండా శుబ్రంగా చెరిగి రోటిలో వేసి అందులో నాటు కోడి
గుడ్డు లోని తెల్ల సోన వేసి బాగా మెతగా కాటుగా లాగా మర్దించి నిలువ
ఉంచుకుని , కంటి రెప్పలకు పెడుతూ వుంటే క్రమంగా రెప్పల మీద వెంట్రుకలు ఊడటం
తగ్గటమే కాక , రెప్పల వాపు , రెప్పల లోపల పెరిగే దుర్మమ్సం కూడా హరించి
రెప్పల మీద ఊడిపోయిన వెంట్రుకలు మల్లి మోలుస్తై.
ఒళ్ళు దురద వాము
20gm , పసుపు 10gm , పొంగించిన వెలిగారము 10gm ఈ 3 కలిపి మంచి నీటితో
మెత్తగా దంచి దురధలున్న చోట మర్దన చేస్తూ వుంటే అయిదారు రోజుల్లో ఎంత
మొండి బండ దురధలైన హరించి పోతై. వంటికి లేపనం చేసిన చేసిన తరువాత 2 గంటలు
ఆగి వేడి నీటితో స్నానం చేయాలి. వేడి చేసే పదార్ధాలు , వంకాయ , గోంగూర ,
గుమ్మడి కాయ , గోంగూర ,ఆవకాయ , కోడి మాంసం కోడి గుడ్డు పనికి రావు.
చెవిలో చీము వాము
10gm , పసుపు 10gm , ముల్లంగి దుంపల రసము 75gm , నువ్వుల నూనె 250gm
.తీసుకుని వీటిని ఇనుప మూకుడు లేదా ఇనుప బాండి లో వేసి చిన్న మంట మీద నూనె
మిగిలే వరకు మరిగించి వడపోసి , నిలువ వుంచుకోవాలి .రోజు 2 పూటలా 2 లేక 3
చుక్కలు చెవుల్లో వేస్తూ వుంటే ఏ కారణం వల్ల కలిగిన చెవిలో చీము అయినా
తగ్గిపోయి చెవులు ఆరోగ్యవంతంగా మారతాయి.
కాళ్ళల్లో - చేతుల్లో చెమటా ? వామును
శుబ్రం చేసి ,కొంచెం దోరగా వేయించి దంచి ఆ పొడిని తగినంత మంచి నువ్వుల
నూనె లో వేసి నానబెట్టి రోజు పరగడపున 5gm మోతాదుగా తింటూ వుంటే
అరచేతుల్లోనూ ,అరికల్లోను వచ్చే చెమట తగ్గిపోతుంది.
0 Comments