నిమ్మకాయలో
ఉన్న విటమిన్ సి పొటాషియం, ఫాస్పారిక్ యాసిడ్ మనం తీసుకున్న
ఆహారపదార్ధంలోని ఐరన్ అనే ఖనిజం వంటపట్టేట్టు చేసి రక్తహీనత నుండి
కాపాడుతుంది. నిమ్మపండుతోని క్షారాలు యూరికామ్లం ప్రభావం నశింపజేస్తుంది
కాబట్టి నిమ్మరసం అధికంగా తీసుకుంటే మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడే ప్రమాదం
ఉంది. అతిగా ఏ పదార్ధాన్ని తీసుకున్నా ఏదో ఒక అనర్ధం వెన్నంటే ఉంటుంది. అదే
తక్కువ మోతాదులో తీసుకుంటే మూత్రపిండాలలో వేరే కారణాలతో ఏర్పడిన రాళ్లను
కరిగిస్తాయి.
కాబట్టి నిమ్మకాయను అనుదినం ఆహారంలో సేవించే వారికి
జీర్ణాశయంలోని హానిచేయు క్రిములు నశిస్తాయి. నిమ్మరసం రక్తకణాలలోని
కొవ్వును కరిగించి రక్తప్రసరణ సక్రమంగా జరగడంలో ఎంతో ఉపకరిస్తుంది. వేసవిలో
కలిగే తాపానికి చల్లని నీటిలో పంచదార, నిమ్మరసం కలిపి ఇస్తే తాపం
హరిస్తుంది. ఇంకా వాంతులు అయ్యే వారికి ఇస్తే వాంతులు ఆపి, ఆకలిని
పెంచుతుంది. జ్వరం ఉన్నవారికి ఇస్తే అతిదాహం, తాపం కూడా నివారిస్తుంది.
రక్తం కారడం, విరేచనాలు కూడా తగ్గిస్తుంది.
0 Comments