* క్యారెట్, ముల్లంగి, చెరకు, దుంపలు.. తదితరాలను ఆహారంలో భాగంగా తీసుకోవటం వల్ల దంతాల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. పండ్లు, కూరగాయలను క్రమం తప్పకుండా తినటంవల్ల దంతాలు శుభ్రంగా ఉండటమేగాకుండా, వాటికి మంచి వ్యాయామం లభిస్తుంది. అయితే చలికాలంలోగానీ, ఎండాకాలంలోగానీ మరీ వేడిగా లేదా చల్లగా ఉండే నీటిని మాత్రం తాగకుండా జాగ్రత్తపడాలి.
* సీమరేగుపండ్లు, నిమ్మ, ఉసిరి, అనాస, బత్తాయి వంటి పళ్లను తినడం ద్వారా పళ్లకు ఆరోగ్యం చేకూరుతుంది. దానిమ్మ గింజలలో పళ్లను ఆరోగ్యంగా ఉంచే లక్షణాలున్నాయి. ఎండిన దానిమ్మ తొక్కలకు ఉప్పు కలిపి, మెత్తగా దంచాలి. ఆ పొడితో పళ్లు తోముకోవాలి. దీనితో పళ్లు శుభ్రపడతాయి. చిగుళ్ల నుంచి రక్తం కారటం తగ్గుతుంది. దానిమ్మ గింజలు, డెంటల్ ప్లేక్స్ నుంచి రక్షిస్తాయి.
* ఎండిన దానిమ్మ తొక్కలు, పటిక, గులాబీ రేకులు, కొద్దిగా సైంధవ లవణం తీసుకుని పొడి చేయ్యాలి. ఆ పొడితో పళ్లు తోముకుంటే చిగుళ్ల వాపు తగ్గుతుంది. పంటి నొప్పులు, పళ్ల నుంచి రక్తం కారటం వంటి సమస్యలు తగ్గిపోతాయి. మిరియాలు, దానిమ్మ తొక్క పొడుము, ఉప్పు తీసుకుని అన్నిటినీ కలిపి మెత్తగా దంచాలి. ఈ పొడితో పళ్లను తోముకుంటే చిగుళ్లు, పంటి నొప్పులు తగ్గి దంతాలు పటిష్టంగా ఉంటాయి.
* సాధారణంగా కూల్‌డ్రింకుల మూతలను చాలంమంది పళ్లతో తీయటం చూస్తుంటాం. కానీ అలా చేయటంవల్ల దంతాలు విరిగిపోయే ప్రమాదం పొంచి ఉంది కాబట్టి అలా చేయకపోవటం ఉత్తమం. అలాగే అక్రోట్ లాంటి డ్రైఫ్రూట్స్‌ను కూడా దంతాలను కొరకడం లాంటివి చేయకూడదు.
* దంతాలను పదికాలాలపాటు ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఫాస్ట్‌ఫుడ్, ఐస్‌క్రీములు, బిస్కెట్లు, చాక్లెట్లు, కేకులు లాంటి పదార్థాలను తినటం తగ్గించాలి. ఒకవేళ ఎప్పుడైనా తిన్నా, వెంటనే నీటితో నోటిని శుభ్రం చేసుకోవాలి. నోటినిండా నీటిని పట్టుకుని బాగా పుక్కిలించి దంతాలను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే పళ్ల సందుల్లో ఆహార పదార్థాలు ఇరుక్కోకుండా ఉంటాయి.
0 Comments