తమ సంస్థలకు చెందిన ఎనర్జీ డ్రింక్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించేందుకు దేశంలోని ప్రముఖ ఆటగాళ్ళను ఎంపిక చేసుకుని ప్రకటనలు గుప్పిస్తుంటారు. సదరు సంస్థకు చెందిన ఎనర్జీ డ్రింక్ పేరుతోపాటు ప్రచార పటాటోపమే కాని ఇవి ఆటగాళ్ళకు ఆర్థికంగా లాభాలను తెచ్చిపెడతాయే కాని ఎనర్జీ డ్రింక్ సేవించే వారికి ఏమాత్రం ఉపయోగం ఉండదంటున్నారు ఫ్రోబేజే.
ఎనర్జీ డ్రింక్ వలన లాభమేమి లేదుః వీటిలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది శక్తిని పెంపొందిస్తుంది. ఇందులో కెఫిన్ ఉండటం వలన శరీరంలో ఉద్దీపనశక్తిని పెంపొందిస్తుంది. అలాగే టౌరీన్(ఒకలాంటి అమినోయాసిడ్) ఉండటంతో రక్తంలో నీరు, ఖనిజ లవణాల శాతాన్ని నియంత్రిస్తుంటుంది. దప్పిక తీర్చుకునేందుకు ఎనర్జీ డ్రింక్స్‌ను ఆటగాళ్ళకు ప్రతిసారి దాదాపు 125 కెలొరీలు కలిగిన పానీయాన్ని వేరుగా ఇస్తుంటారు.
సాధారణమైన నీటిని వాడండిః స్పోర్ట్స్, గేమ్స్ శిక్షణ లేదా పోటీల్లో పాల్గొనే సమయంలో గ్యాస్‌తో కూడుకున్న సాధారణమైన నీటిని సేవించడం ఉత్తమం లేదా పండ్ల రసాన్ని సేవించడం ఆరోగ్యానికి ఎంతో మంచిందని ప్రొఫెసర్ ఫ్రోబేజే సూచించారు. అలాగే అధిక రక్తపోటు లేదా గుండె సంబంధిత జబ్బులతో బాధపడే వారు ఇలాంటి ఎనర్జీ డ్రింక్స్ సేవించకుండా ఉండటమే ఉత్తమమని ఆయన తెలిపారు. ముఖ్యంగా పిల్లలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు కెఫిన్ కలిగినటువంటి ఎనర్జీ డ్రింక్స్ నుంచి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలంటున్నారు ఫ్రోబేజే.
0 Comments