Full Style

>

ఇయర్ ఫోన్‌తో సంగీతం వింటున్నారా...అయితే!!


ప్రస్తుతం యువతతోపాటు పెద్దలు కూడా తమ తలలకు ఇయర్‌ ఫోన్ పెట్టుకుని పాటలు వినడం, మొబైల్ ఫోన్లలో మాట్లాడటం ఓ ఫ్యాషనైపోయింది. ఇలా వినడంలో ఉన్న ఆనందం మరెందులోను రాదు. నిజమే... కాని ఇలా సంగీతం వినడం...అందునా ఎక్కువ వాల్యూమ్ పెట్టి వింటుంటే కర్ణేంద్రియాలు దెబ్బతిని చెవుడు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తమ పరిశోధనల్లో తేలిందని యేలే యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన ప్రొఫెసర్ పీటర్ రాబినోవిట్జ్ తెలిపారు.

చెవులకు సరిపడా శబ్దాన్ని మాత్రమే మనం చెవులకు వినిపించాలి. ఇందులో మరీ ఎక్కువ శబ్దం కలిగిన సంగీతం వింటుంటే అతి చిన్న వయసులోనే తప్పనిసరిగా చెవుడు వస్తుందని ఆయన తెలిపారు. ప్రధానంగా వయసుపైబడిన కొద్దీ చెవుడు(వినికిడి లోపం) అనేది వస్తుంటుంది. లేదా ఎక్కువ శబ్ద కాలుష్యంలో నివసించే వారికి, విపరీతమైన శబ్దాలు కలిగేచోట పనిచేసే వారికి వినికిడి లోపం కలుగుతుంది.

కాని ప్రస్తుతం పిల్లలు, యువత, పెద్దలు తమ వినికిడి సామర్థ్యాన్ని కోల్పోతున్నారని, దీంతో వారిలో చెవుడు వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా యాంప్లీఫైడ్ సంగీతం వినడం, ఎంపీ3లాంటి పర్సనల్ మ్యూజిక్ డివైసెస్ వాడటంతో వినికిడి లోపం తలెత్తుతోందని ఆయన తెలిపారు. కాబట్టి మీరు వాడే ఇయర్ ఫోన్లను పక్కనపెట్టి సాధారణమైన రీతిలో సంగీతం వింటే మీ చెవులు మరికొన్ని రోజుల వరకు వినికిడి శక్తి కలిగివుంటుంది. మీలో ఏర్పడే వినికిడి లోపానికి మీరే కారకులు కాకూడదంటున్నారు నిపుణులు.

Post a Comment

0 Comments