తరచూ మెట్లెక్కుతుంటే శరీరం
ఆరోగ్యంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడ్డారు. మెట్లెక్కడం వలన
ఆరోగ్యంగా ఉంటారని, దీంతో ఎలాంటి జబ్బులు రావని తమ పరిశోధనల్లో తేలినట్లు
డబ్లిన్ ఇన్స్‌టిట్యూట్ ఫర్ స్పోర్ట్ అండ్ హెల్త్ ప్రొఫెసర్ కోలిన్ బోరెహమ్
తెలిపారు.
ప్రతి
రోజు రెండు సార్లు దాదాపు 90 మెట్లున్న మిద్దెను ఎక్కి దిగుతుంటే
ఆరోగ్యంగా ఉంటారని తమ పరిశోదల్లో తేలిందని ఆయన పేర్కొన్నారు. ఇలా వారానికి
ఐదు సార్లు ఎక్కి దిగేలా తాము ఎనిమిది మంది యువతులకు పరీక్షించామని, దీనిని
ఎనిమిది వారాలపాటు కొనసాగించినట్లు ఆయన పేర్కొన్నారు.
ఇలా
రెండు విభాగాలలో మెట్లెక్కే వారిని, మెట్లు ఎక్కని వారిని వేరువేరుగా
పరీక్షించామన్నారు. మెట్లెక్కే వారిలో శరీరానికి హాని చేసే ఎనిమిది
శాతం(ఎల్‌డీఎల్) కొవ్వు కరిగిందని ఆయన అన్నారు. దీంతోపాటు 17 శాతం ఏరోబిక్
ఫిట్‌నెస్ కనపడిందని ఆయన తెలిపారు. ప్రతి రోజు సరాసరి ఐదుసార్లు
మెట్లెక్కెలా వ్యాయామం చేయించామని ఆయన తెలిపారు. ఇది పది నిమిషాలపాటు చేసే
వ్యాయామంతో సమానమని ఆయన అన్నారు. ఇదో సరళమైన, తేలికపాటి వ్యాయామమని ఆయన
అన్నారు.
0 Comments