Full Style

>

ఫిట్‌నెస్‌గా ఉండేందుకు యువతకు కిక్ ఇచ్చే ఫార్ములా


నేటి యువతకు అన్ని రంగాలలోను త్వరత్వరగా పనులు పూర్తయిపోవాలి. అలాగే ఆరోగ్యం పాడైనా కూడా త్వరగా నయమయ్యేందుకు మందులు, మాత్రలు వాడేస్తుంటారు. దీంతోపాటు స్మార్ట్‌గా కనపడేందుకు తహతహలాడుతుంటారు. నేటి పరుగుల ప్రపంచంలో అతనే ముందుండేందుకు ప్రయత్నిస్తుంటాడు. దీంతో అతని ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరచడం లేదంటే అతిశయోక్తి కాదు. దీనికిగాను యువతలో ఫిట్‌నెస్ మరింత పెరగాలంటే కిక్ ఇచ్చే ఫార్ములాను ప్రయోగించాలంటున్నారు నిపుణులు.

* చిటికెడు పచ్చి బియ్యం నోట్లో వేసుకుని నీళ్ళతో మింగేయండి. దీంతో మీ కాలేయం పుష్టిగా తయారవుతుంది.

* రాత్రి పడుకునే ముందు రాగిపాత్రలో నీటిని నింపు ఉంచండి. ఉదయం నిద్ర లేవగానే రాగిపాత్రలోని నీటిని కడుపారా సేవించండి. దీంతో ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఈ నీరు కనీసం ఒక లీటరుపైనే ఉండాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.

* ప్రతి రోజు తాడాసనం చేయాలి. అంటే రెండు కాళ్ళ బలంపై నిలబడి రెండు చేతులను పైకి లేపాల్సివుంటుంది. మీరు ఎంత వీలైతే అంతగా పైకి ఎగబాకేందుకు ప్రయత్నించండి.

* రాత్రి పూట పడుకునే ముందు త్రిఫల చూర్ణాన్ని చల్లటి నీటిలో నానబెట్టాలి. ఉదయం నిద్రలేవగానే దానిని వడకట్టి ఆ నీటితో ముఖాన్ని కడగండి. మిగిలిన నీటిని సేవించండి.

* ఉప్పులో ఆవాల నూనెను కలుపుకుని దంతావధానం చేయండి. దీంతో మీ చిగుళ్ళకు బలంచేకూరి దంతాలు శుభ్రంగా, పటిష్టంగా తయారవుతాయి.

* ప్రతి రోజు 15 నుంచి 20 నిమిషాలపాటు మీ శక్తి మేరకు ప్రాణాయామం చేయండి.

* ప్రాణాయామం తర్వాత మీకు వీలైనంత మేరకు వ్యాయామం చేయండి. జిమ్‌కు వెళ్ళలేని వారు ఇంట్లోనే యోగా, వ్యాయామం చేయండి.

* అలసట కారణంగా యోగాసనాలు చేయలేకపోయేవారు ఉదయం, సాయంత్రం కనీసం రెండు మైళ్ళు నడవండి.

* ప్రతి రోజు చల్లటి నీటితో స్నానం చేయండి. ఆ తర్వాత వెచ్చటి తువ్వాలుతో శరీరాన్ని శుభ్రంగా తుడవండి.

* మీకు వీలైతే ప్రతి రోజదు సూర్యస్నానం చేయండి. దీంతో శరీరానికి కావలసిన విటమిన్ డి లభిస్తుంది. అంటే సాయంత్రం పూట ఎండలో తిరిగేందుకు ప్రయత్నించండి.

* వీలైతే వారానికి ఓ సారి లేదా ప్రతి రోజు మీ శరీరాన్ని నూనెతో మాలిష్ చేయండి.

* భోజనానికి ముందు చేతులు, ముఖం, కాళ్ళు శుభ్రం చేసుకోవాలన్న విషయాన్ని మాత్రం మరువకండి. వీలైతే కింద కూర్చుని భోజనం చేసేందుకు ప్రయత్నించండి లేదా కుర్చీలోనైనా కూర్చుని భుజించండి. ఎట్టి పరిస్థితుల్లోను నిలబడి తినకండి. నిలబడి తింటే ఆరోగ్యానికి ప్రమాదకరం.

* ఆకలి ఉన్నంత మేరకు భోజనం చేయకుండా కాస్త తక్కువగానే భుజించండి.

* కూరగాయలు, ఆకుకూరలతోపాటు పండ్లను సేవించండి.

Post a Comment

0 Comments