ప్రకృతిపరంగా లభించే పండ్లు,
కూరగాయలను తీసుకోవడంతో మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. శరీరానికి కావలసిన
పోషకపదార్థాలు పండ్లు, కూరగాయల్లో ఉంటాయనడంలో సందేహం లేదు. అనారోగ్యంగా
ఉండేవారికి, ఆరోగ్యంగా ఉండే వారికి పండ్లు టానిక్‌లా ఉపయోగపడతాయి.
ప్రపంచంలోని అన్ని జబ్బులకు ప్రకృతి ఇచ్చే ప్రతి పండు, కాయ, కూరగాయ ఔషధంలా
పనిచేస్తుందని ఆయుర్వేదంలో చెప్పబడివుంది. ఆయుర్వేదం చెప్పిన కొన్ని
విషయాలను తెలుసుకుందాం.
శరీర బరువు పెంచుకునేందుకుః కొందరు బలహీనంగా ఉంటారు. అలాంటి వారు శరీర బరువు పెంచుకునేందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే బరువు పెరగడంతోపాటు ఆరోగ్యంగాను తయారవుతారంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. డ్రైఫ్రూట్స్, గోధుమలు, సజ్జలద్వారా తయారు చేసిన రసం, అన్ని రకాల పండ్ల రసాలను ఆహారంగా తీసుకుంటే శరీర బరువు పెరిగి ఆరోగ్యంగా తయారవుతారు.

ND
ఎసిడిటీ నుంచి దూరమయ్యేందుకుః క్యారెట్, క్యాబేజీ, దోసకాయ, కలకండ, యాపిల్, పైనాపిల్ పండ్ల నుంచి తీసిన రసాలను సేవిస్తుంటే ఎసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుంది. ఎసిడిటీతో బాధపడేవారు ప్రతి రోజు మధ్యాహ్నం భోజనానికి అరగంట ముందు ఒక గ్లాసు నీళ్ళల్లో నిమ్మకాయ రసం, అరచెంచా కలకండ కలుపుకుని సేవించాలి. ఉసిరికాయ చూర్ణం ఉదయం, సాయంత్రం తప్పనిసరిగా సేవించాలి. రెండుపూటలా మీరు తీసుకునే ఆహరం వేళల్లో ఖచ్చితమైన సమయాన్ని పాటించాలి. శారీరక ఒత్తిడిని దూరం చేసేందుకు ప్రాణాయామం, ధ్యానం చేస్తుంటే ఎసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుంది.
జలుబుతో బాధపడుతుంటేః గోరువెచ్చటి నీటిలో నిమ్మకాయరసం కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని నోట్లోవేసుకుని గరగరలాడించాలి. తులసి ఆకులు, పుదీనా ఆకులు, అరచెంచా అల్లం, బెల్లంకలుపుకుని రెండు కప్పుల నీటిలో మరిగించండి. ఈ మిశ్రమాన్ని వడగట్టిన తర్వాత అందులో నిమ్మకాయ రసాన్ని కలుపుకుని సేవించండి. దీంతో జలుబు మటుమాయమంటున్నారు ఆయుర్వేద వైద్యులు.
0 Comments