మన మధ్యన ఉండే వారిలో అనేక
మంది మలబద్ధకం సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఈ సమస్య వయస్సుతో సంబంధం లేకుండా
వస్తుంది. అసలు మలబద్ధకం ఎందుకు వస్తుందనే ప్రశ్నలకు వైద్యులు పలు రకాలుగా
సమాధానాలు ఇస్తుంటారు.
సాధారణంగా
అనేక మంది నీరు తాగేందుకు కూడా బద్దకిస్తుంటారు. ఇలాంటి వారిలో ఎక్కువగా
మలబద్ధకం సమస్య ఉంటుందుని వైద్యులు అంటున్నారు. అంతేకాకుండా, జీర్ణ సంబంధ,
గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువగా ఉండటం, సమయానికి మల విసర్జన చేయక పోవడం వల్ల
ఇది తలెత్తుతుందని అంటారు.
వీటితో
పాటు మానసిక ఒత్తిడి, మద్యపానం, ధూమపానం అలవాటు, యాంటీబయోటిక్ ఔషధాలు
ఎక్కువగా ఉపయోగించడం వల్ల కొందరిలో ఈ సమస్య ఉత్పన్నమవుతుందని వారు
అంటున్నారు. ప్రధానంగా, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ ఉన్న వారిలోనూ మలబద్ధకం
సమస్య ఎక్కువగా కనిపిస్తుందంటారు.
0 Comments