ప్రస్తుతం ఉరుకులు,
పరుగులమయమైన జీవితానికి అలవాటు పడ్డవారిలో తప్పనిసరిగా అధిక రక్తపోటు,
మధుమేహం, గుండెకు సంబంధించిన పలు జబ్బులు, హైపర్ కొలస్ట్రోలేమియా, ఊబకాయం,
మోకాలినొప్పులు తదితర జబ్బులతో పలువురు సతమతమౌతుంటారు. వీటి నుంచి ఉపశమనం
పొందేందుకు వివిధ రకాల మందులు వాడుతుంటారు. ఉదాహరణకు అధిక రక్తపోటుతో
బాధపడుతుంటే ప్రతి రోజు మందులు వాడుతుంటారు. ఇలా వాడటం వలన ఆరోగ్యానికి
మరింత హానికరం. అసలు అధిక రక్తపోటు వ్యాధి రావడానికి ప్రధాన కారణమేంటి?
అధిక
రక్తపోటు వ్యాధి వచ్చేందుకు ప్రధాన కారణం నిద్రలేమి, ఊబకాయం, ధూమపానం,
మద్యపానం, వ్యాయామం చేయకపోవడం, మానసికపరమైన, శారీరక ఒత్తిడి, పౌష్టికాహార
లోపం తదితర అలవాట్ల కారణంగానే ఈ వ్యాధి బారిన మీరు పడివుండవచ్చు లేదా
వంశపారంపర్యంగా వచ్చిన వ్యాధి అయితే మందులతోపాటు తగిన జాగ్రత్తలు తీసుకుంటే
మంచిదంటున్నారు వైద్యులు. ఇతర కారణాలతో వచ్చిన అధిక రక్తపోటును సునాయాసంగా
నియంత్రించవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.
మనం
మన జీవనశైలిలో కాసింత మార్పులు చేసుకుంటే శరీరంలోని అన్ని రోగాలను
వీలైనంతమేరకు మటుమాయం చేసుకోవచ్చు. మందులు వేసుకోవడం చాలా తేలికైన పని,
కాని మందులు మనకు నష్టం కలిగిస్తాయనడంలో సందేహం లేదు. మన జీవనశైలిని
మార్చుకుంటే మందులు వేసుకోవాల్సిన అవసరం ఉండదు. దీంతో మీరు ఆరోగ్యంగా
ఉండొచ్చు. దీనికి కావలసిన కొన్ని నియమాలను మీరు పాటించాల్సిన అవసరం ఎంతైనా
ఉంది.
*నియమానుసారం
వ్యాయామం : ప్రతి రోజు 30-45 నిమిషాలపాటు ఏరోబిక్ యాక్టివిటీ చేయండి.
స్విమ్మింగ్, జాగింగ్, డాన్స్, వ్యాయామం, బ్రిస్క్ వాక్‌లలో ఏదైనా ఒక
వ్యాయామం చేయండి.
*
స్వచ్ఛమైన నీరు సేవించండి : మీరు ఎంత నీరు సేవిస్తే అంత ఆరోగ్యంగా
ఉంటారంటున్నారు ఆరోగ్య నిపుణులు. నీరు తీసుకోవడం వలన శరీరంలో పేరుకుపోయిన
విషపదార్థాలు బయటకు వెళ్ళిపోతాయి. అలాగే శరీర ఉష్ణోగ్రతను
నియంత్రిస్తుంటుంది. దాహం వేస్తేనే నీరు సేవించాలనుకోవడం పొరపాటు. ప్రతి
రోజు గంటకోసారైన నీటిని సేవిస్తుండండి.
0 Comments