గురక...
ఇది ఈ సమస్య ఉండే వ్యక్తులకు మాత్రమే కాకుండా ఇతరులకు కూడా ఇబ్బందిగా
ఉంటుంది. అతిగా తినిడం వల్ల లేదా ఇతర వ్యాధుల వల్ల ఇది సంక్రమిస్తుంది.
ముఖ్యంగా స్థూలకాయం, టాన్సిలైటిన్, ఫారింజైటిన్ వంటి వ్యాధులతో
బాధపడేవారిలో గురక వస్తుంది. ఏ వ్యాధి లేనివారు కూడా గాఢనిద్రలో ఉన్నపుడు
ఒక్కొక్కసారి గురకపెడుతారు.
అతి సామాన్యంగా కనిపించే గురక మనిషి లావు పెరగడానికే కాకుండా గుండెపోటు ఇతర గుండె జబ్బులకు కూడా దారితీస్తుందని పరిశోధకులు అంటున్నారు. సాధారణంగా గురక పెట్టేవారు వెల్లకిలా పడుకుని సగం నోరు తెరుచుకుని ఉంటారు. శ్వాస కూడా సగం ముక్కు, సగం నోటి ద్వారా తీసుకుంటారు. గురక పెట్టడానికి లింగభేదం, వయేభేదం లేక పోయినప్పటికీ.. ఎక్కువగా పురుషులు, వృద్ధుల్లో ఇది కనిపిస్తుంది.
ఏ కారణం చేతనైనా నాసికా రంధ్రాలు మూసుకుని పోయినపుడు పెద్దగా శ్వాస తీసుకుంటాయి. అపుడు గొంతులో ఉండే ఫారింక్స్ లేదా సాఫ్ట్ పాలెట్ కణజాలం కదలికల వల్ల పలు రకాల స్థాయిలో గురక వస్తుంది. సిగరెట్లు, మద్యం అలవాట్లు ఉన్న వారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.
వీటితో పాటు.. వాతావరణ మార్పుల వల్ల తరచూ వచ్చే దగ్గు, జలుబు సైనుసైటిస్ మొదలైన వాటి వలన కూడా నాసికా రంధ్రాలలో అవరోధం ఏర్పడి గురక వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ గురక వల్ల కొన్ని సమయాల్లో గుండెకు హాని కలుగుతుంది. అందువల్ల కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే మాత్రం కొంతమేరకు గురక నుంచి విముక్తి పొందవచ్చు.
గురక పెట్టే వారిలో గొంతునొప్పి, దురద, శ్వాస సంబంధిత వ్యాధులు ఉన్నట్టయితే వెంటనే వైద్యుల సాయం తీసుకోవాలి. వీటితో పాటు.. సిగరెట్లు, మద్యం సేవించడం మానివేయాలి.

0 Comments