ఆహారం పోషక పదార్థాలను
అందిస్తుంది. ఈ పోషక పదార్థాలు అందించే శక్తి అనేక రోగాలను నిరోధిస్తాయి.
అయితే నేడు చాలామంది ఇటువంటి పోషక పదార్థాలను వదిలి జంక్‌ఫుడ్‌పై మోజు
పెంచుకుంటున్నారు. ఒకప్పుడు రుతువులకు తగినట్లు ఆహారాన్ని తీసుకునే పద్ధతి
ఉండేది.
కానీ
నేడు రుతువులతో సంబంధం లేకుండా రసాయానాలతో తయారు కాబడి పదార్థాలను
తీసుకోవడం ఎక్కువైంది. దీనివల్ల ఆరోగ్యంగా ఉండే జీవన ప్రక్రియ అనారోగ్యంగా
మారిపోతోంది. కనుక ఆయా రుతువుల్లో ప్రకృతి సహజంగా దొరికే పదార్థాలను
తీసుకోవడం ఎంతైనా మంచిది.
ఉదాహరణకు
పండ్లు తినేవారి ఆరోగ్యం ఎంతో మెరుగ్గా ఉంటుంది. పండును పంచుకోకూడదు
అన్నది మన పెద్దల మాట. ఆ విధంగానైనా ఒక పండును ఒకరు సంపూర్ణంగా తిని తగినంత
ఆరోగ్యం తెచ్చుకుంటారని పెద్దలు భావించారు. ఎలాంటి ఆహారంతోనైనా
తీసుకోతగినవి పండ్లు. అల్పాహారంతో, మధ్యాహ్నం, రాత్రి భోజనాల తర్వాత పండ్లు
తినవచ్చు.
పండ్లకు
బదులు పండ్ల రసాలను తీసుకునేవారు గుర్తుంచుకోవలసిన అంశం అవి ప్రత్యామ్నాయం
కాదని. పోషక పదార్థాలపరంగా చూస్తే పండును పండుగా తీసుకోవడమే ఎంతో మంచిది.
0 Comments