Full Style

>

ఎందుకలా జుట్టు పీక్కుంటారూ...?


కొందరు ఏమాత్రం ఆందోళనకు గురైనా గబగబా జుట్టు పీక్కోవడం మొదలుపెడతారు. మరికొందరు ఏదో దీర్ఘాలోచనలో మునిగిపోయి ఉన్నప్పుడు జుట్టును అదేపనిగా పీక్కుంటూ ఉంటారు. ఇది మంచిది కాదని తెలిసినా చేతులు ఊరుకోవు మరి.

ట్రైకోటిలోమేనియాగా పిలిచే ఈ అలవాటు వద్దనుకున్నా మానలేకపోతారు. చిత్రంగా... చాలామంది తాము జుట్టు పీక్కుంటున్నామనే విషయాన్ని కూడా తెలియనంతగా అలా చేసేస్తుంటారు. దీనిని ఆహారపదార్థాల్లో లభించే ఎన్-అసిటీల్ సిస్టీన్ అనే అమినో ఆమ్లం ద్వారా తగ్గించవచ్చని మిన్నెసోటా విశ్వవిద్యాలయం పరిశోధకులు రుజువు చేశారు.

50మందిని ఎంపిక చేసి, కళ్లకు గంతలు కట్టి సగంమందికి ఈ ఆమ్లం ఇచ్చారు. 12 వారాల తర్వాత వీరిలో 56 శాతం మంది జుట్టు పీక్కోవడం మానేయాడాన్ని గమనించినట్లు తెలిపారు. డమ్మీ మందు ఇచ్చిన మిగిలిన సగం మందిలో 16 శాతం మంది మాత్రమే ఆ అలవాటు కొద్దిగా తగ్గిందని చెప్పారు.

Post a Comment

0 Comments