Full Style

>

తెల్ల వెంట్రుకలకు తల్లిదండ్రులే కారణం



మీ వెంట్రుకలు తరచూ తెల్లబడుతుంటే చాలామంది ఆలోచనలో మునిగిపోతుంటారు. అలాగే ఆ తెలుపును కప్పి పుచ్చుకునేందుకు రకరకాల రంగులు పూస్తుంటారు. మానసిక, శారీరక ఒత్తిడి కారణంగానే వెంట్రుకలు తెల్లబడతాయని చాలామంది అపోహ పడుతుంటారు. ఇది ఎంతమాత్రం నిజం కాదంటున్నారు పరిశోధకులు. తెల్ల వెంట్రుకలు రావడానికి తల్లిదండ్రులే కారణమంటున్నారు పరిశోధకులు.

తెల్లవెంట్రుకలు ఎందుకు వస్తాయనే దానిపై నిర్వహించిన పరిశోధనల్లో తేలిన విషయం ఏంటంటే అది వారి పూర్వీకుల శరీర తత్వాన్ని బట్టి, వారసత్వపు లక్షణాల కారణంగానే తెల్లవెంట్రుకలు వస్తాయన్నారు.

ప్రజలలో వచ్చే తెల్ల వెంట్రుకలకు కారణం కేవలం మానసికపరమైన ఒత్తిడే కాకుండా వారి తల్లిదండ్రుల, వంశపారంపర్యంగా వచ్చే జీన్స్ బట్టి ఉంటుందని పరిశోధకులు తెలిపారు.

అలాగే మరికొందరు వాతావరణ కాలుష్యం కారణంగాను వెంట్రుకలు పాడైపోతున్నాయని తెగ బాధపడిపోతుంటారు. వెంట్రుకలు తెల్లబడటానికి వాతావరణ కాలుష్య సమస్య అసలు సమస్యే కాదంటున్నారు పరిశోధకులు.

Post a Comment

0 Comments