Full Style

>

వాతాన్ని వదిలేసి, వెన్నునొప్పికి సర్జరీలా?

వెన్నుసమస్యలన్నిటికీ అసలు కారణం శరీరంలో వాతం పెరిగిపోవడమే. ఆ వాతం వాయు రూపంలో ఉండడం వల్ల ఏ స్కానింగ్‌లోనూ కనిపించదు. ఏమీ కనిపించలేదని నార్మల్ అని వదిలేస్తే, కొద్ది రోజుల్లో సమస్య విషమించిపోతుంది. కనిపించలేదని వాతాన్ని వదిలేసి సర్జరీకి సిద్దమైతే, వెన్నునొప్పి తగ్గక పోగా మరికొన్ని కొత్త సమస్యలు మొదలవుతాయి అంటున్నారు ఆయుర్వేద నిపుణులు డాక్టర్ వర్థన్, డాక్టర్ మాధురీ వర్థన్....
నడుము నొప్పి సమస్యకు చాలా కాలం దాకా సరియైన వైద్య చికిత్సలు అందకపోతే ఏమవుతుంది? ఎన్నోరకాల దుష్ప్రభావాలు తలెత్తి సమస్య క్రమంగా, మరింత సంక్లిష్టమైపోతుంది.
ఈ రోజుల్లో ఈ నడుము నొప్పి సమస్య అతి చిన్న వయసులో అంటే 22 నుంచి 25 ఏళ్ల లోపే మొదలవుతోంది. వీరిలో సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్ సంఖ్య మరీ ఎక్కువ. నడుము నొప్పి సమస్య తొలిదశలో పరుచుకపోయినట్లు, ఏదో అసౌకర్యంగా అనిపించడమే తప్ప, ఆ నొప్పి ఎక్కడినుంచి వస్తోందో సరిగ్గా తెలియకపోవచ్చు. అయితే కొద్దిపాటి విశ్రాంతితో సమస్యనుంచి ఉపవమనం లభించవచ్చు. ఇంకేముంది నొప్పి తగ్గిపోయిందిలే అనుకుని, యథావిధిగా క్రికెట్‌లాంటి ఆటలేవో ఆడటం, మార్కెట్ వెళ్లి బరువైన సరుకుల సంచి మోసుకురావడం వంటివేవో చేస్తారు. అంతటితో మళ్లీ నొప్పి మొదలవుతుంది. ఈ సారి నొప్పి మునుపటి కన్నా చాలా తీవ్రంగానే ఉంటుంది. వెంటనే మళ్లీ డాక్టర్ వద్దకు వెళితే, ఎక్స్‌రే-టెస్ట్ రాస్తారు.
ఎక్స్‌రే-ఎంఆర్ఐ పరీక్షలు
ఎముకల్లో వచ్చిన మార్పులు, ప్రమాదంలో ఏర్పడిన పగుళ్లు, క్యాల్షియం అదనంగా పెరిగిపోయిన లక్షణాలు ఇవి మాత్రమే ఎక్స్‌రేలో కనిపిస్తాయి. ఇటీవలే మొదలైన సమస్య ఎంత తీవ్రంగా ఉన్నా అది ఎక్స్‌రేలో కనిపించదు. కనిపించడం లేదన్న కారణంగా డాక్టర్ ్స అంతా నార్మల్ గానే ఉందని పంపించివేస్తారు. ఇది చాలా ప్రమాదం. మూడు నాలుగు మాసాల క్రితమే మొదలైన సమస్యతో ఎవరైనా బాధపడుతున్నప్పుడు వారి ఎక్స్‌రే రిపోర్టులో ఏమీ కనిపించదు కాబట్టి, ఎలాగూ నొప్పి ఉందని చెబుతున్నాడు కాబట్టి, పెయిన్ కిల్లర్స్ రాసేస్తారు. పెయిన్ కిల్లర్స్ వల్ల కూడా ఉపశమనం రాకపోవచ్చు.
ఇలాంటి స్థితిలో డాక్టర్స్ ఎంఆర్ఐ పరీక్ష చేయిస్తారు. అయితే, కొందరి ఎంఆర్ఐ రిపోర్టులో కొన్ని మార్పులు కనిపించవచ్చు. కానీ, రోగికి ఆ వ్యాధి తాలూకు లక్షణాలేమీ కనిపించకపోవచ్చు. కొందరి ఎంఆర్ఐ రిపోర్టుల్లో మార్పులేమీ కనిపించకపోవచ్చు కానీ, రోగిలో విపరీతంగా ఆ వ్యాధి లక్షణాలు కనిపించవచ్చు. ఎంఆర్ఐలో కేవలం డిస్కులో వాపు ఏర్పడిన డిస్కు బల్జు సమస్యే కనిపించవచ్చు. కానీ, ఆ వ్యక్తికి డిస్కు ప్రొట్రూజన్, డిస్క్ ఎక్స్‌ట్రూజన్ బయటికి వచ్చి వెన్నుపామును నొక్కుతున్న తాలూకు లక్షణాలన్నీ వేధించవచ్చు.
అత్యవసరం అయితేనే...
ఎంఆర్ఐ అసవరమే. కానీ, ఎప్పుడు? ఏ ప్రమాదంలోనో ప్రాక్చర్స్ అయినప్పుడు, డిస్కు బల్జ్ వంటి సమస్యలు ఉన్నప్పుడు వెన్ను భాగంలో కణుతులు ఏమైనా ఏర్పడ్డాయేయో చూడాలనుకున్నప్పుడు ఎంఆర్ఐ అసవరమే. సమస్య తీవ్రత కారణంగా, మలమూత్రాల మీద అదుపు లేకుండాపోయిన స్థితిలో కూడా ఎంఆర్ఐ తప్పనిసరి.
అసలు సమస్య వాత ప్రకోపం
నడుము నొప్పిగానీ, వె న్నునొప్పి గానీ, మెడనొప్పిగానీ రావడానికి అసలు కారణం శరీరంలో వాతం పెరిగిపోవడమే. అసలు కారణమైన వాతం, నాడి పరీక్షతో గుర్తించాలే గానీ, అది ఎక్స్‌రేలో గానీ, ఎంఆర్ఐ లో గానీ, కనిపించదు. వాతప్రకృతి ఉన్నవారికి ఎంఆర్ఐలో పెద్ద మార్పేమీ కనిపించకపోయినా, అతడు విపరీతమైన వ్యా«ధి లక్షణాలతో బాధపడతాడు. అదే కఫ ప్రకృతి వ్యక్తుల ఎంఆర్ఐ రిపోర్టుల్లో ఎన్నో మార్పులు కనిపించినా అతనికి పెద్దగా నొప్పి ఏమీ ఉండదు. అందువల్ల శరీర ప్రకృతిని అనుసరించి వ్యాధి తీవ్రతను అంచనా వేయాల్పిందే. మౌలికంగా వాతాన్ని గుర్తించి, పెరిగిన వాతాన్ని హరించే వైద్య చికిత్సలు తీసుకోవడం ఒక్కటే ఈ సమస్యలన్నిటికీ ఏకైక పరిష్కారం.
మేరు చికిత్సలే మహా మంత్రం
నిజానికి, ఆదిలోనే వాతాన్ని గుర్తించ గలిగితే, చాలా వరకు పెయిన్ కిల్లర్స్, ఎక్స్‌రే, ఎంఆర్ఐ పరీక్షల అసవరమే ఉండదు. పదే పదే ఈ పరీక్షలతో కాల యాపన చేస్తే పరిస్థితి విషమించి ఒక దశలో డిస్కెక్టమీ, ల్యామినెక్టమీ వంటి సర్జరీల దాకా వెళుతుంది. ఒకవేళ సమస్య ఇంకా ముదిరి, రెండేసి, మూడేసి డిస్కులు దెబ్బ తిన్నప్పుడు వాటిని కలిపి ఒక ప్లేట్‌కు బిగించే ఫ్యూజన్ చికిత్స చేస్తారు. దీనివల్ల నడుము బిగుసుకుపోయి సహజమైన కదలికలకు అంతరాయం ఏర్పడుతుంది.
పైగా,ఆ పక్కనున్న డిస్కులు కూడా దెబ్బ తినిపోతాయి. అందుకే మలమూత్రాలు ఆగిపోయిన ఒక విషమస్థితిలో తప్ప సర్జరీకి వెళ్లకపోవడమే అన్నివిధాలా శ్రేయస్కరం. వాతం పెరగడం వల్లే ఎముకలకు సంబంధించిన అస్థిధాతువు క్షీణించి ఇన్ని దురవస్థలు మొదలవుతున్నాయి. అందుకే వాత హర చికిత్సలు తీసుకోవడానికి మించిన మరే ఇతర వైద్య చికిత్సలూ లేవు. వాస్తవనానికి ఆయుర్వేదంలోని మర్మ చికిత్సలు, మేరు చికిత్సలు, బృహ్మణ చికిత్సలు గొప్ప వరం లాంటివి. అందుకే సర్జరీల జోలికి వెళ్లకుండా, సర్వ సమగ్రమైన ఆయుర్వేద చికిత్సల ద్వారా వెన్నెముక సంబంధించిన సమస్త సమస్యలనుంచి సంపూర్ణంగా విముక్తి పొందవచ్చు.

Post a Comment

0 Comments