Full Style

>

జుట్టు రాలుట తగ్గేది ఎలా..?

ప్రతి మనిషికి అందం నిగనిగలాడే నల్లటి, చిక్కని, పొడువాటి కురులు. ముఖానికి ఇంత అందాన్నిచ్చే కురులు రాలిపోరుు జుత్తు తగ్గిపోవడంతో నేడు చాలా మంది మధన పడుతున్నారు. జుట్టు రాలుట సమస్య ఉండటం మూలాన తమ ‘ేకశసంపద’ను కోల్పోరుు తాము ఉండాలనుకున్న విధంగా ఉండలేక పోతున్నామని భావించి ఈ రోజుల్లో చాలా మంది తీవ్ర మానసిక ఒత్తిడికి గురికావటం చూస్తున్నాం. సాధారణంగా రోజుకు కొంత జుట్టు రాలడం సహజం.
మరల వీటి స్థానంలో కొత్త జుట్టు వస్తుంటుంది. రోజుకు సుమారుగా 40 నుండి 60 వెంట్రుకలు రాలుతుంటారుు. ఇంత కంటే ఎక్కువగా రాలిపోతుంటే ేకశ సంరక్షణకు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
జుట్టు రాలుట సమస్యను కొంతమంది బయటకు చెప్పుకోలేక దాని నుండి త్వరగా విముక్తి పొందాలని మార్కెట్‌లో లభించే రకరకాల నూనెలు, షాంపులు, సబ్బులు, క్రీములు, లోషన్‌లపై దృష్టిసారిస్తారు. వీ టిపై సరైన అవగాహన లేక ఆశతో వాటిని ఎక్కువగా మార్చి మార్చి వాడటం వలన జుట్టు రాలుట తగ్గకపోగా సమస్య ఇంకా తీవ్రమై ఇతర ఇన్‌ఫెక్షన్లకు దారి తీస్తుంది.
జుట్టు రాలుటకు కారణాలు:
పోషక పదార్థాలున్న ఆహారం తీసుకోకపోవడం. కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులు, థైరాయిడ్‌ లోపాలుం డటం, మానసిక ఒత్తిళ్లు ఎక్కువగా ఉండటం. నిద్రలేమితో బాధపడటం. హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడం వలన చర్మం ప్రభావితమై జుట్టు రాలుతుంది. వెంట్రుకల కుదుళ్ళలో ఏర్పడే ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్‌ వలన, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వలన వెంట్రుకలను శుభ్రంగా ఉంచుకోకపోవడం వలన, కొందరిలో శరీరతత్వం బట్టి కూడా జుట్టు రాళడం జరుగుతుంది.
నివారణకు జాగ్రత్తలు:
జుట్టు నిర్మాణానికి, అది ఎదగడానికి 97 శాతం ప్రోటీన్ల పాత్రే అధికంగా ఉంటుంది. కావున ప్రోటీన్ల లోపం రాకుండా జాగ్రత్త పడటం ముఖ్యం. హార్మోన్లు సమతుల్యంగా ఉండటానికి పౌష్టిక ఆహారం తీసుకోవాలి. సబ్బులను డాక్టర్‌ సలహామేరకే వాడాలి. షాంపూ లేదా ఆయిల్‌ను వెంట్రు కల కుదుళ్ళలో, వేళ్లతో నెమ్మదిగా ఎక్కువసేపు మర్దన చేయటం వలన ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు. బయటకు వెళ్ళేటప్పుడు తలకు ‘టోపీ’ ధరించడం మంచిది. కొవ్వు, నూనె సంబంధిత పదార్థాలు ఎక్కువగా తీసు కోకూడదు. మానసిక ఒత్తిడి కూడా ‘జుట్టు రాలుట’పై ప్రభావం చూపు తుంది. కాబట్టి మానసిక ప్రశాంతత కోసం ప్రతి రోజు యోగా, వ్యాయా మం విధిగా చేయాలి.
మందులు:
జుట్టు రాలుట నివారణకు హోమియోలో మంచి మందులున్నాయి. కొన్ని ముఖ్యమైన మందులను ఈ దిగువ ఇవ్వడమైనది.
ఆర్సినిక్‌ ఆల్బ్‌:
తలపొడి పొడిగా వుండి పొట్టు రాలుతూ ఉంటుంది, ‘మధ్యరాత్రి’ దురద, తీవ్రమైన మంట ఉండటం గమనించదగిన లక్షణం.
ఆర్నికా మరియు బబోరాంది ఆయిల్స్‌:
జుట్టు సంరక్షణకు, జుట్టు పెరుగుదలకు, డాండ్రఫ్‌ నివారణకు హోమియో వైద్యంలో ఎక్కువగా ఈ ఆయిల్స్‌ వాడుతున్నారు. ఆర్నికా లేదా జబోరాంది ఆయిల్స్‌ను వారానికి మూడుసార్లు జుట్టు కుదుళ్ళకు చేతి వేళ్లతో మర్దనా చేయటం వలన చాలా ప్రయోజనం పొందవచ్చు.
తూజా:
వెంట్రుకల కొనలు చిట్లి ఉండి, బిరుసుగా మారతాయి. తలనుండి తెల్లటి పొట్టు రాలుతూ ఉంటుంది. దురద ఎక్కువగా ఉంటుంది. శరీరంపై ‘వార్ట్‌‌స’ (పులిపిరికాయలు) ఉండి జుట్టు రాలుట సమస్యతో బాధపడే వారికి ఈ మందు తప్పక ఆలోచించదగినది. తలలో దురద, మంట ‘ఎండ వేడికి’ ఎక్కువ అగును. తలనొప్పి కూడా తీవ్రంగా ఉండటం గమనించదగిన లక్షణం.
సెపియా:
తల మీద ఎప్పటికీ తేమగా ఉండి జుట్టు అధికంగా రాలిపోతుంది. పొట్టు దువ్వినప్పుడు రాలుతుంది. ఈ మందు ఎక్కువగా స్ర్తీలలో వచ్చే జుట్టు రాలుట నివారణకు బాగా పనిచేస్తుంది.
ఫాస్పరస్‌:
జుట్టు రాలుట సమస్య అధికంగా ఉండి దువ్వినప్పుడు రాలుతుంది. వెంట్రుకలు గుత్తులు, గుత్తులుగా రాలటం జరుగుతుంది. ఈ మందులోని ముఖ్య లక్షణం. తలలో ‘పేను కొరుకుడు’కు సైతం ఈ మందు ఉపయోగంగా పనిచేస్తుంది.
కాల్కేరియాకార్బ్‌:
జుట్టు రాలటం సమస్య ఉండి దువ్వినప్పుడు ‘పసుపురంగు’లో ఉండి పొడి పొడిగా రాలును. తలకు రెండు వైపులా జుల్లు రాలును, తలకు చెమటలు ఎక్కువగా పట్టును. ఈ మందు ‘ఊబ శరీరతత్వం’ గల వారికి తప్పక ఆలోచించదగినది.ఇవే కాకుండా సల్ఫర్‌, సోరీసం, లైకోపోడియం, కాంథారిస్‌, కాలీమోర్‌, కాలీసల్ఫ్‌, కాల్కేరియా ఫాస్‌ మందులను లక్షణ సముదాయంను అనుసరించి వాడితే సత్ఫలితాలు ఉంటాయి. జుట్టు రాలుట సమస్య తీవ్రత అధికంగా ఉన్నప్పుడు వైద్యుని సలహా మేరకే మందులు వాడాలి.
పోషక పదార్థాలున్న ఆహారం తీసుకోకపోవడం. కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులు, థైరాయిడ్‌ లోపాలుండటం, మానసిక ఒత్తిళ్లు ఎక్కువగా ఉండటం. నిద్రలేమితో బాధపడటం. హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడం వలన చర్మం ప్రభావితమై జుట్టు రాలుతుంది.జుట్టు నిర్మాణానికి మరియు ఎదగడానికి 97 శాతం ప్రోటీన్ల పాత్రే అధికంగా ఉంటుంది. కావున ప్రోటీన్ల లోపం రాకుండా జాగ్రత్త పడటం ముఖ్యం. హార్మోన్లు సమతుల్యంగా ఉండటానికి పౌష్టిక ఆహారం తీసుకోవాలి. ఎక్కువగా సబ్బులను డాక్టర్‌ సలహామేరకే వాడాలి. షాంపూ లేదా ఆయిల్‌ను వెంట్రుకల కుదుళ్ళలో, వేళ్లతో నెమ్మదిగా మర్దన చేయటం వలన ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు.

Post a Comment

0 Comments