ప్రతి ఏడు నిమిషాలకు ఒకరు... ఏటా డెబ్భై ఐదు వేల మంది మహిళలు... మనదేశంలో సర్వైకల్ క్యాన్సర్‌తో మరణిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మిగిలిన దేశాలతో పోలిస్తే..దీని బారిన పడుతున్న వారిలో భారతీయులే అత్యధికం అంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. స్త్రీలను ఇంతలా మరణానికి చేరువ చేసే ఈ క్యాన్సర్ కబళించకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఎందుకువస్తుంది..
ఒక్కమాటలో చెప్పాలంటే.. హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ) ఇన్‌ఫెక్షన్ ఈ వ్యాధికి అసలు కారణం. ఈ వైరస్ దాదాపు వందరకాలున్నా 15-20 రకాలు మాత్రమే క్యాన్సర్‌కు దారితీస్తాయి. వీటిలో ఎక్కువగా 16, 18 రకాల వల్ల 70 శాతం క్యాన్సర్లు, 45, 31, 33, 52, 58, 35, రకాల కారణంగా మిగిలిన 30 శాతం క్యాన్సర్లు వస్తాయి. ఈ హెచ్‌పీవీ ఇన్‌ఫెక్షన్ ఒకరి నుంచి మరొకరికి నేరుగా.. చర్మం ద్వారా గానీ మ్యూకస్ పొరల వల్ల గానీ వ్యాపిస్తుంది.
ఈ హెచ్‌పీవీ ఇన్‌ఫెక్షన్ లైంగిక సంపర్కంతో వస్తుంది. చాలా అరుదుగా మాత్రమే ఇతరత్రా కారణాల వల్ల వ్యాపించవచ్చు. అయితే 90 శాతం మందికి మాత్రం ఎలాంటి ప్రమాదం ఉండదు. వారిలోని వ్యాధినిరోధక శక్తి సమర్థంగా పనిచేసి ఈ వైరస్‌ను నిర్మూలిస్తుంది. అదీ ఏడాది లోపలే. 5-10 శాతం స్త్రీలల్లో మాత్రం ఈ వైరస్ సర్విక్స్‌లోని కణజాలంలో చొచ్చుకుపోయి క్యాన్సర్‌కు దారితీస్తుంది. అదీ మూడేళ్ల వ్యవధిలో. ఈ ఇన్‌ఫెక్షన్ 25 ఏళ్లలోపు వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. అధ్యయనాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 630 మిలియన్ల మంది హెచ్‌పీవీ ఇన్‌ఫెక్షన్ కలిగి ఉన్నారు. అదీ లైంగిక సంపర్కంలో పాల్గొనడం మొదలుపెట్టాక నాలుగింట మూడొంతుల మంది స్త్రీ పురుషులకు కనీసం ఒకరకం హెచ్‌పీవీ ఇన్‌ఫెక్షన్ వస్తుంది.
హెచ్‌పీవీ కారణంగా క్యాన్సర్‌తోపాటు వచ్చే ఇతర వ్యాధులు
* జననేంద్రియాలపై పులిపిరులు (వార్ట్స్), పాపిలోమాలు
* ఇతర క్యాన్సర్లు.. అంటే.. టాన్సిల్స్, లారింక్స్, మూత్రనాళాల క్యాన్సర్లు..
* అరుదుగా వచ్చే చర్మం, కంటి క్యాన్సర్లు.. ఎక్కువమందితో విశృంఖలమైన లైంగిక సంబంధాలు (హైరిస్క్ సెక్సువల్ బిహేవియర్) కలిగినవారిలో ఇవి రావచ్చు.
* లైంగికంగా సంక్రమించే ఇతర ఇన్‌ఫెక్షన్లు ఉన్నవారు, పొగతాగేవారికి హెచ్‌పీవీ ఇన్‌ఫెక్షన్ వచ్చే ఆస్కారమెక్కువ.
* చిత్రమేంటంటే, ఇతరత్రా ఇన్‌ఫెక్షన్లను సమర్థంగా నిరోధించే కండోమ్ ఈ హెచ్‌పీవీని మాత్రం ఆపలేదు.
హెచ్పీవీ వ్యాక్సిన్లు
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను నివారించేందుకు ప్రపంచవ్యాప్తంగా రెండు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని మూడు విడతలుగా ఇవ్వాలి.
12-16 ఏళ్లలోపు అమ్మాయిలకు (సెక్సులో పాల్గొనడం మొదలుపెట్టని) ఇవ్వడం మంచిది. ఈ వ్యాక్సిన్లలో ఒకటి (బైవాలెండ్) 10-45 ఏళ్లలోపువారికి, రెండోది (క్వాడ్రివాలెండ్) 9-26 సంవత్సరాలలోపు యువతలకూ ఇవ్వొచ్చు. వ్యాక్సిన్ తీసుకునేముందు హెచ్‌పీవీ పరీక్ష అవసరంలేదు. లైంగిక జీవితం ఆరంభించిన స్త్రీలకు ఈ వ్యాక్సిన్ ఇస్తే ఒకరకం హెచ్‌పీవీ ఇన్‌ఫెక్షన్ ఇప్పటికే ఉన్నా మిగిలినవి రాకుండా చూడవచ్చు. ఇవి ఇన్‌ఫెక్షన్ రాకుండా కాపాడేందుకు ఇచ్చేవి మాత్రమే. అప్పటికే ఉన్న వాటిని నయం చేయడానికి పనికి రావు. వ్యాక్సిన్ తీసుకున్నాం కదాని.. పాప్ స్మియర్ పరీక్షలను నిర్లక్ష్యం చేయకూడదు. ఎప్పటికప్పుడు చేయించుకుంటూనే ఉండాలి.

మరిన్ని జాగ్రత్తలు...
* వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. నెలసరి సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.
* శరీరంలో ఏ చిన్న ఇన్‌ఫెక్షన్ ఉన్నా.. తేలిగ్గా తీసుకోకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి.
* ముప్ఫై ఏళ్లు దాటినప్పటి నుంచీ.. క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు చేయించుకోవడం మంచిది.
* వ్యాక్సిన్ తీసుకునే విషయంలో సందేహాలుంటే.. నిరభ్యంతరంగా వెల్లడించాలి.
మరికొంత సమాచారము :
సెర్విక్స్‌కి వచ్చే క్యాన్సర్‌నే గర్భాశయపు ముఖద్వార క్యాన్సర్ అంటారు. మహిళ ల్లో ప్రధానంగా వచ్చే క్యాన్సర్‌లలో ఇది ఒకటి. 25 నుంచి 65 ఏళ్ల వయసు వరకు ఎప్పుడైనా రావచ్చు. భారత్‌లో 1లక్ష 35 వేల మంది ప్రతి ఏటా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ప్రతి సం వత్సరం 74 వేల మంది చనిపోతున్నారని వైద్యరీత్యా నిర్ధారణ అయింది. సెరె్వైకల్ క్యాన్సర్ బాగా ముదిరిపోయేంతవరకు ఎలాం టి లక్షణాలు కనబడదు. దీంతో ఎక్కువ మంది ఈ క్యాన్సర్ బారి న పడుతున్నారు. ఈ క్యాన్సర్ వంశపారంపర్యంగా రాదు. పట్ట ణాల్లోని వారికంటే, గ్రామీణ ప్రాంతంలోని వారికి ఎక్కువగా వస్తుంది. దేశం మొత్తం మీద 2-3 శాతం మందికి సరె్వైకల్ క్యాన్సర్ బారిన పడుతున్నారు.
కారణాలు: ఈ క్యాన్సర్ రావడానికి ప్రత్యేకమైన కారణాలు తెలియవు. కొంతమంది పేద మహిళల్లో శరీరం పట్ల శుభ్రత తక్కువగా ఉంటుంది. అటువంటి వారిలో ఈ క్యాన్సర్ రావడా నికి అవకాశాలు ఎక్కువ. ఇంకా... చిన్న మయసులోనే రసజ్వల కావడం, 20 సంవత్సరాల కంటే తక్కువ వయసులో పెళ్లి చేయ డం, లేత వయసులోనే పిల్లలు పుట్టడం.
ఎక్కువ మంది పిల్లలు పుట్టడం, ఎక్కువమందితో సెక్స్‌లో పాల్గొనడం వంటి వాటిని ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. సుఖవ్యాధులు ఉన్నవారిలో అధికంగా వచ్చేందుకు ఆస్కారం ఉంది. హ్యూమన్ పాపిలోమా వైరస్(హెచ్‌వీపీ)ద్వారా ఎక్కువమందిలో ఈ క్యాన్సర్ వస్తుంది. ఈ వైరస్‌లో ముఖ్యంగా 16,18, 31, 35 రకాలలో ఇది వస్తుం ది. హెర్పిస్ టైప్ వైరస్ వల్ల వచ్చేందుకు కూడా ఆస్కారం ఉంది. డీబీస్ వంటి కొన్ని ఔషధాలను గర్భం దాల్చినప్పుడు స్ర్తీలు తీసు కుంటే, వారికి పుట్టబోయే అమ్మాయిలకు ఈ క్యాన్సర్ రావచ్చు. పొగతాగే వారిలో వచ్చే అవకాశం ఉంది.
హెచ్‌పీవీ లాంటి వైరస్ వల్ల సెర్విక్స్‌లో దీర్ఘకాలంలో మార్పులు వచ్చి క్యాన్సర్‌కు దారితీస్తాయన్న విషయం ఆందోళన కలిగిం చవచ్చు. అయితే సెర్విక్స్ క్యాన్సర్ ముందుగా వచ్చే ప్రీ- క్యాన్సర్ దశ చాలా కాలం (దాదాపు ఎనిమిది నుంచి పదేళ్లు) కొనసాగు తుంది. అంటే అది పూర్తి క్యాన్సర్‌గా రూపొందడానికి సాగే ముం దస్తు దశ ఇంత సుదీర్ఘకాలం కొనసాగుతుంది. కాబట్టి అక్కడ వచ్చే మార్పులను ముందుగానే పసిగడితే అది క్యాన్సర్ కాకముందే లేజర్, ఎల్.ఎల్.ఈ.టీ.జడ్ వంటి విధానాలతో చికిత్స చేయడం సాధ్యపడుతుంది. తొందరగా తెలుసుకుంటే చికిత్స సులభంగా ఉంటుంది.
వ్యాధి నిర్ధారణ ఎలా చేయాలి?
గర్భాశయపు ముఖద్వార క్యాన్సర్‌ను గుర్తించేందుకు ప్రధానంగా మూడు పరీక్షలున్నాయి.
1. పాప్ స్మియర్ స్క్రీనింగ్ టెస్ట్ : ఎంతో సులువుగా, తక్కువ ఖర్చుతో చేయగల పరీక్ష ఇది. దీంతో సెర్వి క్స్ క్యాన్సర్‌ను ప్రీ క్యాన్సర్ దశలోనే గమనించి సమ ర్థంగా చికిత్స చేయడం సాధ్యపడుతుంది. ఇందులో గర్భాశయ ముఖద్వారం వద్ద వైట్ డిశ్చార్జ్ కణాలను స్లైడ్ మీద వేసి హిస్టో పెథాలజీకి పంపిస్తారు. ఈ పరీక్ష చేయించుకున్న వెంటనే ఇంటికి వెళ్లవచ్చు. 20 సంవత్సరాలకు పైబడిన వారు రెండు సంవత్సరాలకు ఒకసారి చేయించుకుంటే మంచిది. కనీసం ఐదు సంవత్సరాలకు చేయించుకోవడం అవసరం.
ఇంట్లోనే హెచ్‌పీవీ పరీక్ష!
గర్భాశయ ముఖద్వార (సర్వైకల్) క్యాన్సర్‌ను పాప్‌స్మియర్ పరీక్ష ద్వారా గుర్తిస్తుండటం తెలిసిందే. అయితే ఈ పరీక్షను ల్యాబ్‌లో మాత్రమే చేయాల్సి ఉంటుంది. అందువల్ల ఎంతోమంది.. ముఖ్యంగా పేద దేశాల మహళలు ఈ పరీక్షను చేయించుకోవటంపై అంతగా ఆసక్తి చూపటం లేదు. దీంతో చాలామందిలో సర్వైకల్ క్యాన్సర్ ముదిరిన తర్వాతే బయటపడుతోంది. ఇలాంటి బెడద నుంచి తప్పించుకోవటానికి ఇంట్లోనే ఎవరికివారు యోని స్రావాలను తీసి పరీక్షించుకునే విధానం (వజైనల్ హెచ్‌పీవీ టెస్ట్).. పాప్‌స్మియర్‌కు ప్రత్యామ్నాయం చూపగలదని పరిశోధకులు భావిస్తున్నారు. హెచ్‌పీవీ పరీక్ష ఫలితాలపై అమెరికాలో ఇటీవల ఒక అధ్యయనం నిర్వహించారు. ఇందులో 20 వేల మంది పేద మహిళలు పాల్గొన్నారు. వీరికి పాప్‌స్మియర్ పరీక్ష చేయించుకోవటం గానీ వజైనల్ హెచ్‌పీవీ పరీక్ష గానీ చేసుకోవాలని సూచించారు. పాప్‌స్మియర్ కన్నా హెచ్‌పీవీ పరీక్ష నాలుగు రెట్లు ఎక్కువగా క్యాన్సర్ కేసులను గుర్తించింది. అంటే ప్రతి 10వేల మందిలో ఏడుగురికి వ్యాధి ఉన్నట్టు పాప్‌స్మియర్ తేల్చగా.. హెచ్‌పీవీ పరీక్ష 30 మందిని గుర్తించింది. ఈ పరీక్షలో ఫాల్స్ పాజిటివ్ రేటు (వ్యాధి లేకపోయినా ఉన్నట్టు గుర్తించటం) ఎక్కువగా ఉంటోందని ప్రయోగశాలల నిర్వాహకులు చెబుతున్నప్పటికీ.. పేద దేశాల్లో ఇదెంతగానో ఉపయోగపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. తప్పుగా వచ్చిన ఫలితాలు కూడా క్యాన్సర్ లక్షణాలకు దగ్గరగానే ఉంటున్నాయని వివరిస్తున్నారు. పాప్‌స్మియర్ చేయించుకోవటానికి వెనకాడే ప్రాంతాల్లో ఇంట్లో చేసుకునే హెచ్‌పీవీ పరీక్షతో మంచి ఫలితం ఉంటుందని భావిస్తున్నారు.
2. కాల్పోస్కోపీ : ప్రత్యేక పరికరం ద్వారా సెర్వెక్ ప్రాం తాన్ని పరీక్షిస్తారు.వాపు, పుండు, ఒరుపు వంటి వాటిని గమనిస్తారు. అసాధారణంగా ఉన్న ప్రదేశాన్ని పరిశీలి స్తారు. అవసరమైతే ముఖ పరీక్ష చేస్తారు.
3. సెర్వికల్ బయాప్సీ : క్యాన్సర్ అని అనుమానం వచ్చినప్పుడు సర్విక్స్‌లోని కొంత భాగాన్ని తీసి పరీక్షిస్తా రు. ఈ పరీక్షల ద్వారా ఏ రకం క్యాన్సరో, ఏ దశలో ఉందో గుర్తించవచ్చు.ఈ క్యాన్సర్ ముదిరిపోతే రక్తపరీక్ష, హిమోగ్లోబిన్ టోటల్ కౌంట్, బ్లడ్ సుగర్, బ్లడ్ గ్రూప్, బ్లడ్ యూరి యా, యూరిన్ ఎగ్జామినేషన్‌లు చేయించాలి. కొంత మందిలో అవసరమైతే సీటీ, ఎంఆర్‌ఐ స్కాన్ చేసి వ్యాధి తీవ్రతను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
లక్షణాలు: ప్రారంభ దశలో ఏ లక్షణాలు ఉండవు. పరీక్షల ద్వారా కనుక్కోవచ్చు.
తొలి దశ క్యాన్సర్ : ఈ సమయంలో పాప్ స్పియర్, కాల్పోస్కోపీ ద్వారా గుర్తించవచ్చు. ఇందులో మెల్ట్, మోడరేట్, సివియర్ అని మూడు రకాలుంటాయి. ఈ దశలో చిన్న పద్ధతుల్లో ఈ వ్యాధిని నయం చేయవచ్చు. క్రయో, లేజర్, లూప్ ఎక్సేషన్, కొనైజేషన్ ద్వారా నయం చేయవచ్చు. భవిష్యత్తులో పాప్ స్మియర్ ద్వారా పరీక్ష చేయించుకుంటూ ఉండాలి.
లక్షణాలు: క్యాన్సర్‌గా మారిన తర్వాత ఈ కింది లక్షణాలుంటాయి.అధిక రక్తస్రావం, నెల మధ్యలో రక్తస్రావం కాకుండా లేదా అప్పుడప్పుడు రక్తస్రావం అవుతుంది. దంపతుల కలయిక తరువాత రక్తస్రావం జరుగుతుంది. నెలలు ఆగిన తరువాత (మెనోపాజ్) రక్తస్రావం రావడం. వైట్ డిశ్చార్జ్ కావడం. రక్తంతో కలిసి వైట్ డిశ్చార్జ్, వాసనతో కూడిని వైట్ డిశ్చార్జి కావచ్చు.
ముదిరిన తరువాత : బరువు తగ్గిపోవడం, ఆకలి మంద గించడం, రక్తహీనత, బలహీనత, తలనొప్పి. కడుపునొప్పి. యూరిన్ పోసేటప్పుడు నొప్పి, మోషన్‌కు వెళ్లినప్పుడు నొప్పి వంటి సమస్యలుంటాయి. కొందరిలో కిడ్నీ సమస్యలు రావచ్చు. దీంతో కిడ్నీ పూర్తిగా దెబ్బతిని చనిపోయేందుకు ఆస్కారం ఉంది.
రెండు రకాలుగా: క్యాన్సర్‌లో గ్రోత్, అల్సర్‌గా రెండు రకా లుంటాయి. ఇది వైద్యుల పరీక్షలో తెలుస్తుంది.
గ్రోత్ : ఈ రకమైన క్యాన్సర్‌లో బ్లీడింగ్ ఎక్కువగా ఉంటుంది. రక్తంలో ముక్కలు, ముక్కలుగా వస్తుంటుంది. గర్భాశయం చుట్టు ప్రదేశాల్లోని అవయవాలు, కండరాల కదలిక తగ్గిపోతుం టుంది. అల్సర్ రకంగా పుండు మాదిరిగా ఉంటుంది.
నాలుగు దశల్లో ఉంటుంది : మొదటి దశలో క్యాన్సర్ గర్భాశయ ముఖద్వారం వద్దే ఉంటుంది. రెండవ దశలో గర్భాశయానికి పాకుతుంది. మూడో దశ గర్భాశయం చుట్టు పక్కల ప్రాం తాలకు చేరుతుంది.
నాల్గో దశలో శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తుంది.
చికిత్స మూడు రకాలు : 1. ఆపరేషన్, 2. రేడియో థెరఫీ 3. కీమోథెరపీ 4. కంబైడ్‌గా చేస్తారు.ఈ క్యాన్సర్‌ను మొగ్గ దశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చు.
వ్యాక్సిన్: వ్యాక్సిన్ ద్వారా ముందుగానే హ్యుమన్ పాపిలోమా వైరస్ వల్ల వచ్చే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను అడ్డుకోవచ్చు. పది సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వరకు ఎవరైనా తీసుకోవచ్చు. దీనిని మూడు డోస్‌లలో ఇస్తారు. ఒకటో నెల, తరువాత రెండవ నెల, ఆ తరువాత ఆరవ మాసంలో టీకాలు తీసుకోవాలి. చిన్నపిల్లలకు అయితే పాప్ స్మియర్ పరీక్ష చేయకుండా వ్యాక్సిన్‌ను తీసుకోవచ్చు. పెద్దవారైతే పాప్ స్మియర్ పరీక్ష చేసుకుని టీకాలు తీసుకోవడం మంచిది. ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను ముందుగా గుర్తించడం చాలా సులభం. కనుక పరీక్షలు చేయించు కుంటూ ఉండాలి. తొలి దశలో గుర్తిస్తే వెంటనే చికిత్స తీసు కుని అందరిలా జీవితాన్ని కొనసాగించవచ్చు.
జాగ్రత్తలు
* పాప్ ిస్మియర్ పరీక్షలు 2,3 ఏళ్లకు ఒకసారి చేయించుకోవాలి.
* 20 సంవత్సరాలు నిండిన తరువాత పెళ్లి చేసుకోవాలి. ముందుగా పెళ్లి చేసుకున్నా 20 ఏళ్ల వయసు వచ్చిన తరువాతనే పిల్లల్ని కనాలి.
* శరీర పరిశుభ్రతపై దృష్టి సారించాలి
* సుఖ వ్యాధులు రాకుండా జాగ్రత్త పడాలి.
* నెలసరి ఆగిన వారిలో బ్లీడింగ్ అయితే వెంటనే చెకప్ చేసుకోవాలి.
* గర్భ సంచి తొలిగించినప్పుడు ఆ సమ యంలో కొన్ని కారణాల వల్ల ముఖద్వారాన్ని తీయలేక పోవచ్చు. వారిలో కూడా క్యాన్సర్ రావచ్చు. అశ్రద్ధ చేయకుండా చెకప్ చేయించు కోవాలి.
0 Comments