Cirrhosis of Liver primary awareness ,సిర్రోసిస్ ఆఫ్ లివర్ ప్రాధమిక అవగాహన - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
కాలేయం విధులు :
అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం ఒకటి. ఆహారం జీర్ణం కావడంతో పాటు రక్తశుద్ధిలో తోడ్పడుతుంది. శక్తిని దాచి ఉంచి శరీరానికి అవసరమైనప్పుడు అందించడం -- దీని విధుల్లో ప్రధానమైనది. కాలేయ విధులను పరిశీలిస్తే... ఇది అనేక జీవరసాయనిక కర్మాగారంలా తోస్తుంది. మనం తీసుకునే ఆహారాలను పేగులే జీర్ణం చేస్తాయి. కానీ దాన్ని యథాతథంగా శరీర కణాలు స్వీకరించలేవు , ఉపయోగించుకోలేవు . ప్రతి ఆహారము కాలేయములో కొన్నిమార్పులు జరిగి మన శరీరము ఉపయోగించుకునే విధముగా తయారవుతుంది. అలా జీర్ణమైన ఆహారాన్ని శరీర కణాలు తీసుకోగలగడానికి అనువుగా మార్చే ప్రక్రియలో కాలేయం ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాలేయ కణాలను హెపటోసైట్స్ అంటారు. ఇవి శక్తి సమతౌల్యాన్ని క్రమబద్దీకరించడంతో పాటు... రోగకారక క్రిములతో పోట్లాడటం హానికర విష పదార్థాలను వేరుపరచడం జీర్ణప్రక్రియకు తోడ్పడే బైల్ (పైత్యరసాన్ని)ను ఉత్పత్తి చేయడం రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడే (క్లాటింగ్ ఫ్యాక్టర్స్) పదార్థాలను తయారు చేయడం పోషకపదార్థాలను, విటమిన్లను నిల్వ చేయడం ప్రోటీన్లు, కొవ్వు పదార్థాలు, క్లిష్టమైన కార్బోహైడ్రేట్ల తయారీ గ్లూకోజ్, కొలెస్ట్రాల్ వినియోగం అన్య పదార్థాల విసర్జన వంటి కార్యకలాపాల్లో ప్రధానపాత్ర వహిస్తుంది. అందువల్లనే కాలేయం పనితీరు / కాలేయ వ్యాధులను గుర్తించడానికి ఒక్క పరీక్ష సరిపోదు. ఇందుకు చేసే వేర్వేరు పరీక్షల సముదాయాన్ని ‘లివర్ ప్రొఫైల్’ అంటారు.
సిర్రోసిస్ ఆఫ్ లివర్
నిర్వచనము--- కాలేయానికి (లివర్ కు) దీర్ఝకాలిక వ్యాధులు సోకిన తరువాత కాలేయ కణాలు పనిచేయకపోవడం - తద్వారా కాలేయంలో కలుగు పరిణామాలను సిర్రోసిస్ ఆఫ్ లివర్ అని అంటారు.
కారణాలు
దీర్ఝకాలిక లివర్ వ్యాధులు
దీర్ఝకాలిక మధ్యం వాడకం
హిపటైటిస్ - బి - ఇన్ ఫెక్షన్
కొన్ని రకాల మందులు వాడకం
వ్యాధి నిరోధక శక్తి లోపించుట
పైత్యరస ప్రసరణలో అడ్డంకులు - వ్యాధులు
లక్షణాలు
కడుపులో నీరు చేరుట,
కాళ్లు చేతులు వాపు,
వాంతిలో రక్తం పడుట,
పచ్చ కామెర్లు,
రక్త నాళాలు ఉబ్బడం,వంకర్లు తిరిగి ఉండటం,
బరువు తగ్గడం,
వాంతి అవుతున్నట్లు ఉండటం,
ఆలోచనలలో తికమక,
అలసి పోవడం,
కొన్ని సందర్బాలలో మొలలు నుండి రక్తం కారుట,
సంభోగంలో ఉత్సుకత లేకపోవుడం,
పురుషత్వం కోల్పోవడం,
మూత్ర విసర్జన తగ్గిపోవడం,
మలము తెల్లగా రావడం,
చిగుళ్ళలో , ముక్కులో రక్తం కారుట,
సాధారణ జ్వరం,
పురుషులలో స్ధనములు పెద్దగా వుండడం,
పైన ఇవ్వబడిన లక్షణాలు వ్యాధి తీవ్రతకు అనుగుణంగా వస్తుంటాయి.
పరీక్షలు
కడుపును చేతులతో పరీక్ష చేసినపుడు కాలేయము (లివర్) పెద్దదిగా గుర్తించడం,
కడుపులో నీరు నిండి ఉండి ఉబ్బరంగా వుండడం,
కడుపు పై రక్త నాళాలు స్పష్టంగా కనపడటం,
వృషణాలు చిన్నవిగా వుండడం,
లాబ్ పరీక్షలు
రక్త పరీక్ష - రక్త హీనతకొరకు, రక్తం గడ్డకట్టు కాలం కనుగొనుటకు,
లివర్ ఎంజైములు పనితీరు కనుగొనుట,
రక్తంలో బిలిరుబిన్ స్ధాయి కనుగొనుట,
‘x’రే పరీక్షలు,
అల్ట్రాసౌండ్ స్కానింగ్
ప్రత్యేకమైన సూది సహాయం తో లివర్ కణాలు తీసి పరీక్ష చేసిన వ్యాధి నిర్ధారించబడును.
నివారణ - తీసుకోవలసిన జాగ్రత్తలు
అధికంగా మద్యం సేవించరాదు,
రక్త నాళాల ద్వారా మందులు వాడకం తగ్గించాలి. హిపటైటిస్ బి మరియు హిపటైటిస్ సి నుండి రక్షణ పొందవచ్చు.
వ్యాధి నిరోధక టీకా ద్వారా హిపటైటిస్ బి వ్యాధి నుండి రక్షణ పొందవచ్చు.
కొవ్వు-ప్రోటీన్లు తక్కువగా ఉండే ఆహారాన్నే తీసుకోవాలి
సమతుల పౌష్టికాహారాన్ని తీసుకోవాలి
సాధారణ రుగ్మతలకు కూడా శక్తిమంతమైన యాంటీబయాటిక్స్, ఇతర మందులు వాడకూడదు.
రోగనిరోధక వ్యవస్థకు బలం చేకూరే విధంగా జీవనశైలిని మార్చుకోవాలి.
లివర్ వ్యాధులతో దాని కణాలకు జరిగే నష్టం ఎలా ఉంటుంది?
సిర్రోసిస్ : రోగ కారణంగా నష్టపడిన కాలేయ కణాల స్థానంలో కొత్త కణాలు ఏర్పడతాయి. అయితే ఈ కణాలు సహజ ఆరోగ్య కాలేయ కణాలలా శక్తిమంతంగా పనిచేయవు.
అంతేకాదు... కాలేయంలోకి వచ్చే రక్తప్రసరణకు కూడా ఆటంకం కలిగిస్తాయి. కొత్త కాలేయ కణజాలం (స్కార్ టిష్యూ) పెరిగిన కొద్దీ కాలేయం సమర్థంగా తన విధులను నిర్వహించలేదు. ఈ స్థితినే సిర్రోసిస్ అంటారు. సిర్రోసిస్ లక్షణాలు : ప్రాథమిక స్థితిలో ఎలాంటి లక్షణాలూ ఉండకపోవచ్చు. నీరసం, నిస్త్రాణ, ఆకలి తగ్గడం, జీర్ణశక్తి మందగించడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటాయి.
సిర్రోసిస్ పెరిగినకొద్దీ : తేలికగా రక్తస్రావం కావడం లేదా ముక్కు నుంచి రక్తం కారడం కాళ్లవాపు మందులకు తీవ్రంగా ప్రతిస్పందించడం సిరలలోనికి అదిక రక్తప్రసరణ జరిగి,
తద్వారా కాలేయంలోకి అధికంగా రక్తం ప్రవేశించడం ఈసోఫేగస్, జీర్ణాశయాలలోని సిరలు వ్యాకోచించడం సాధారణ లివర్ ద్వారా తొలగిపోవాల్సిన వ్యర్థ, హానికర పదార్థాలు
రక్తం ద్వారా మిగతా అవయవాలకు చేరి, వాటి పనికి ఆటంకం కలిగించడం. అరుదుగా ఈ సమస్యతో రోగి అపస్మారక స్థితి (హెపాటిక్ కోమా)లోకి కూడా వెళ్లిపోవచ్చు. సిర్రోసిస్‌తో బాధపడే రోగుల్లోని ఐదు శాతం మందికి కాలేయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి.
సిర్రోసిస్ ప్రాణాంతకమా? : సిర్రోసిస్ తీవ్రమైన కొద్దీ అది ప్రాణాంతకమే. ప్రారంభంలోనే గుర్తించి సాధారణ స్థితికి పునరుద్ధరించుకోకపోతే ఆధునిక వైద్య శాస్త్రప్రకారం కాలేయ
మార్పిడి శస్త్రచికిత్సే ఒక్కటే పరిష్కారం. అయితే కాలేయ మార్పిడి బాగా ఖర్చుతో కూడుకున్నది. దాత దొరకడం కూడా కష్టమే. అయితే అన్ని వేళలా ఇది సత్ఫలితాలను
ఇస్తుందని కూడా చెప్పలేం.
నివారణ :
సిర్రోసిస్ ని నివారించలేమా?...చాలా రకాల కాలేయ సంబంధిత వ్యాధులను చాలా తేలికగా నయం చేసుకోవచ్చు. ప్రాథమిక స్థితిలోనే రోగ కారణం, రోగ స్థితిని గుర్తించి, అశ్రద్ధ చేయకుండా సకాలంలో చికిత్స తీసుకుంటే సిర్రోసిస్‌ను నివారించవచ్చు.
ఈ క్రింది వాటిని పాటించడము వలన సిర్రోసిస్ ని నివారింగలము - రక్తంలోని ఎంజైముల పరీక్ష, అల్ట్రాసౌండ్ స్కానింగ్ వంటి పరీక్షలతో కాలేయంలో వచ్చిన మార్పులను ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చు. అప్పుడు... మద్యాన్ని పూర్తిగా మానేయాలి, కొవ్వు-ప్రోటీన్లు తక్కువగా ఉండే ఆహారాన్నే తీసుకోవాలి సమతుల పౌష్టికాహారాన్ని తీసుకోవాలి సాధారణ రుగ్మతలకు కూడా శక్తిమంతమైన యాంటీబయాటిక్స్, ఇతర మందులు వాడకూడదు. రోగనిరోధక వ్యవస్థకు బలం చేకూరే విధంగా జీవనశైలిని మార్చుకోవాలి.

0 Comments