-దీర్ఘకాలిక అనారోగ్యం.ముందుజాగ్రత్త-అవగాహన(Chronic illness prevention-awareness)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
దీర్ఘకాలిక అనారోగ్యం...అది జబ్బు కాకపోవచ్చు! మనసు, శరీరం... ఈ రెండూ బాగున్నప్పుడే సంపూర్ణ ఆరోగ్యం. మనిషిలో అనేక శారీరక సమస్యలు కనిపిస్తున్నప్పుడు కేవలం వాటిపైనే దృష్టిపెడతారు. చాలాకాలంగా మందులు వాడుతున్నా లక్షణాలు తగ్గకపోతే మానసికంగా ఏదైనా సమస్య ఉందేమో ఆలోచించాలి. ఎందుకంటే ఒక్కోసారి కొన్ని మానసిక సమస్యలు శారీరక సమస్యల రూపంలో వ్యక్తం కావచ్చు. మనసు, శరీరం... ఈ రెండింటికీ పరస్పరం ఉన్నసంబంధాలు, ఒకదానిపై మరొకటి చూపించే ప్రభావాలపై అవగాహన .
ఒక మధ్యవయస్కురాలికి తీవ్రమైన వెన్నునొప్పి వచ్చింది. తీవ్రంగా బాధపడుతూ ఆమె ఆసుపత్రికి వచ్చింది. ఆమె చెబుతున్న లక్షణాలను బట్టి ముందుగా ఆమెను ఎముకల వైద్య నిపుణుడు పరీక్షించారు. ఆ నొప్పి వల్ల క్రితం రాత్రంతా ఎంతగా బాధ అనుభవించిందో చెప్పిందామె. నిజానికి ఆమె వర్ణించినంత నొప్పి తీవ్రత ఉంటే అలా నడవడం సాధ్యం కాదు. మరికొంత సంభాషణ, కొంత కౌన్సెలింగ్ తర్వాత భర్త కోపం, తమ ఆర్థిక స్థితిగతుల వంటి అంశాలను వివరించింది. ఆత్మహత్య చేసుకోవాలన్నంత తీవ్రమైన మానసిక వ్యాకులత ఉందని ఆమె మాటలను బట్టి అర్థమైంది. దాంతో ఆమెలోని డిప్రెషన్ ఒక శారీరక లక్షణం ద్వారా వ్యక్తమవుతోందని వైద్యుడు గ్రహించి ఒకసారి మానసిక నిపుణుడిని కలవాల్సిందిగా సూచించారు. ఇలా అనేక మానసిక సమస్యలు... శారీరక లక్షణాల రూపంలో వ్యక్తమవుతాయి. మానసిక సమస్యలతో కనిపించే వారిలో దీర్ఘకాలిక నొప్పులు, జీర్ణకోశ సమస్యలు, ఎండోక్రైన్ సమస్యలు, చర్మవ్యాధులు వంటివి చాలా కనిపిస్తాయి.
గుండె... రక్తప్రసరణ వ్యవస్థ
ఒక సంఘటనతో పడ్డ మానసిక ప్రభావం అనేక మందిలో శారీరకంగా ఎలాంటి ప్రభావం చూపిందనడానికే ఈ ఉదాహరణలు. కాలిఫోర్నియాలోని నార్త్‌రిడ్జ్‌లో 1994లో తీవ్ర భూకంపం వచ్చింది. ఆ తర్వాత రెండు రోజుల అనంతరం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్న ఆరోగ్యవంతులైన అనేకమందిలో గుండెపోటు కనిపించింది. అలాగే 2001లో న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూలినప్పుడు కూడా ఇదే జరిగింది. తీవ్రమైన ఒత్తిడి గుండె సమస్యలకు దారితీస్తుందనడానికి ఈ ఉదాహరణకు నిదర్శనాలు. వ్యాకులత, ఆందోళన ఉన్నవారిలో అధిక రక్తపోటు, గుండెజబ్బులు కలిగే అవకాశాలు ఎక్కువ. కోపం తీవ్రంగా పెరిగినప్పుడు గుండె నుంచి అవయవాలకు జరగాల్సిన రక్తసరఫరా 7 శాతం తగ్గిపోతుందని అధ్యయనాల వల్ల తేలింది. డిప్రెషన్‌తో బాధపడే వ్యక్తుల్లో రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలు పెరుగుతాయి. సెరటోనిన్ స్థాయుల్లో మార్పు కారణంగా ప్లేట్‌లెట్స్‌లో అతుక్కునే గుణం పెరుగుతుంది. దాంతో ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి కొందరిలో హృద్రోగం లేదా గుండెనొప్పి కనిపించవచ్చు. దీని లక్షణాలు అచ్చం గుండెజబ్బులాగే ఉంటాయి.
నాడీమండల వ్యవస్థలో...
మూర్ఛ (ఎపిలెప్సీ), పక్షవాతం, (స్ట్రోక్), తలకు గాయాలు, మెదడులో కణుతులు, మతిమరపు (డిమెన్షియా) వంటి లక్షణాలు ఇతరుల కంటే... మానసిక సమస్యలు ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తాయి. మానసిక సమస్యలు ఉన్నవారిలో జ్ఞాపకశక్తి తగ్గడం, తిమ్మిర్లు వంటి అనేక నరాల సంబంధ వ్యాధుల్లో ఉండే లక్షణాలు కనిపిస్తాయి. పై సమస్యలేగాక... స్థూలకాయం, డయాబెటిస్, హైపర్‌టెన్షన్ వంటి వ్యాధులు కూడా మానసిక సమస్యలతో ఎక్కువవుతాయి.
ఒత్తిడితో అనర్థాలు...
స్థూలకాయం, డయాబెటిస్, హైపర్‌టెన్షన్ వంటివి పెరగడానికి మానసికంగా పడే ఒత్తిడే కారణం. ఒత్తిడి పెరగగానే శరీరంలోని కొవ్వులు, రక్తంలోకి గ్లూకోజ్ విడుదల చేయమనే సంకేతం మెదడు నుంచి వస్తుంది. శారీరకంగా శ్రమించడానికి అవకాశం ఉన్న రోజుల్లో శ్రమ చేయడానికి అవి ఉపయోగపడేవి. అయితే ప్రస్తుతం శారీరక శ్రమ చేయడానికి అవకాశం లేకపోవడంతో అలా విడుదలైన గ్లూకోజ్‌ను, కొవ్వులను శరీరం వాడుకోకపోవడంతో రక్తంలో వాటి స్థాయులు పెరిగి అది డయాబెటిస్, హైపర్‌లిపిడేమియా (రక్తంలో కొవ్వులు పెరగడం) వంటి సమస్యలకు దారి తీస్తోంది. ఒత్తిడి వల్ల రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది. అది కూడా అనేక సమస్యలకు దారితీస్తుంది. ఆ టైమ్‌లో జ్వరాలు ఎందుకంటే... పిల్లలకు పరీక్షల సమయంలో జ్వరం, విరేచనాలు, కడుపునొప్పి వంటి అనేక సమస్యలు కనిపిస్తాయి. నిజానికి శారీరకంగా కనిపించే ఆ లక్షణాలకు కారణం ఒత్తిడే.
అనేక వ్యాధుల వల్ల శరీరంపై పడే దుష్ర్పభావాలు ఎంత సహజమో, శరీరంలో వ్యాధులు ఉన్నవారిలో మానసిక సమస్యలు కనిపించడం అంతే సాధారణం. ఒకదానికి మరొకటి ఆధారంగా మారేందుకు అవకాశం ఉండటం వల్ల అనేక వ్యాధులను నివారించడానికి పాటించి సమతుల ఆహారం, మంచి అలవాట్లు, తగినంత శారీరక శ్రమ, ఆరోగ్యకరమైన జీవనశైలి వంటి అంశాలతో చాలా రకాల మానసిక/శారీరక అనారోగ్యాలను నివారించుకోవచ్చు.
కొన్ని మందులతోనూ ముప్పే....
కొన్ని రకాల శారీరక సమస్యలకు వాడే మందుల వల్ల మానసిక సమస్యలు రావచ్చు. ఉదాహరణకు శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గించడానికి వాడే కొన్ని మందులు, బీపీని నియంత్రించడానికి ఉపయోగించే ఔషధాల వల్ల డిప్రెషన్ కలగవచ్చు. అలాంటి సమయంలో వైద్యులకు లక్షణాలను చెప్పడం వల్ల వారు మందులను
మారుస్తారు.
శారీరక వ్యాధులతో మానసిక సమస్యలు...
హెచ్‌ఐవీ,
క్యాన్సర్,
హైబీపీ,
గుండెజబ్బులు,
డయాబెటిస్,
స్ట్రోక్ వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారిలో డిప్రెషన్, యాంగ్జైటీ వంటి మానసిక సమస్యలు ఎక్కువ. శారీరకంగా వచ్చే వ్యాధికి అవసరమైన మందులతో పాటు డిప్రెషన్‌కు తగిన మందులు వాడినప్పుడు ఆ రోగుల్లో మంచి ఫలితం కనిపిస్తుంది.
దీర్ఘకాలికమైన నొప్పులు, ఆందోళన, వ్యాకులత, నిద్రలేమి, మాదక ద్రవ్యాలు తీసుకోవడం, హైపోకాండ్రియాసిస్ సైకోసిస్ వంటి అనేక మానసిక సమస్యలు ఉన్న వారికి దీర్ఘకాలిక నొప్పులు కనిపించవచ్చు. ఈ మానసిక సమస్య ఉన్నప్పుడు మెదడులో ఉండే సెరటోనిన్, డోపమైన్ వంటి రసాయనాలు తక్కువగా ఉంటాయి. ఇవి శరీరం నుంచి మెదడుకు నొప్పిని చేరేవేసే ప్రక్రియలో ఆ రసాయనాలు ప్రభావం ఉంటుంది. వాటి స్థాయి తక్కువ కావడంతో నొప్పి ఏదైనా ఉన్నప్పుడు అది మరింత ఎక్కువగా అనిపిస్తుంది. మనసుపై ఒత్తిడి ఎక్కువైనప్పుడు శరీరంలో కార్టిజోల్ అనే రసాయనం శాతం పెరుగుతుంది. ఇది ఎముకల అరుగుదలను పెంచుతుంది. ఫలితంగా ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులు పెరుగుతాయి.
చర్మవ్యాధులు...
మానసిక సమస్యలు ఉన్నవారిలో దురదలు, సోరియాసిస్, అటోపిక్ డర్మటైటిస్ వంటి చర్మవ్యాధులు కనిపిస్తాయి. ఒత్తిడి పెరిగినప్పుడు ఈ చర్మవ్యాధుల తీవ్రత కూడా ఎక్కువవుతుంది. వ్యాకులతకు (డిప్రెషన్), ఆందోళన (యాంగ్జైటీ)కి తగిన చికిత్స చేయిస్తే అవి కూడా తగ్గిపోతాయి.
ఎండోక్రైన్ సమస్యలు...
ఎండోక్రైస్ సమస్యలు చాలా అరుదుగా ఉంటాయి. అయితే ఇందులో థైరాయిడ్ సంబంధమైన సమస్యలు మానసిక వ్యాధులు ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తాయి.
జీర్ణకోశ సమస్యలు....
మానసిక సమస్యలు ఉన్నప్పుడు కొన్ని జీర్ణకోశ సంబంధమైన లక్షణాలు కనిపించవచ్చు. అవి...గొంతులో ఏదైనా కణితి/గడ్డ ఉన్న భావన. (నిజానికి అలాంటిదేదీ ఉండదు). గుండెపోటులా అనిపించే ఛాతీ నొప్పి (ఒత్తిడి వల్ల ఆహారనాళం కండరాలు బిగుసుకుపోవడంతో ఇలాంటి సమస్య కనిపిస్తుంది).
గుండెమంట : శారీరకంగా ఎలాంటి లోపాలు లేకపోయినా కడుపులో వెలువడే ఆమ్లాలు (యాసిడ్స్) ఎక్కువగా స్రవించి అవి పైకి ఎగదన్నడం వల్ల గుండె మంటగా అనిపిస్తుంది. ఆహారం మింగడం కష్టంగా మారడం. కడుపులో మంట, వికారం, వాంతులు, నొప్పి, కడుపు ఉబ్బరించినట్లుగా ఉండటం, త్వరగా కడుపు నిండిపోయిన భావన, ఆకలి లేకపోవడం తేన్పులు అధికంగా రావడం.
ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్‌లో ఉండే లక్షణాలు అంటే కింది నుంచి గ్యాస్ పోవడం, మలబద్దకం, మాటిమాటికీ విరేచనాలు కావడం లేదా విరేచనం కాబోతున్న ఫీలింగ్. ఒకచోటికే పరిమితం కాని కడుపునొప్పి ,ఎలాంటి లోపం లేకపోయినా మలద్వారం వద్ద తీవ్రమైన నొప్పి... ఇది నోటి నుంచి మలద్వారం వరకు ఎక్కడైనా కనిపించవచ్చు.

0 Comments