Full Style

>

రంగులు...భావాలు- ప్రభావాలు,color-therapy

color therapy- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

ప్రత్యామ్నాయ వైద్య విధానంలో అత్యంత ప్రముఖమైందిగా కలర్‌ థెరపీని చెప్పుకోవ చ్చు. మనకు ఇంద్రధనస్సులో కనుపించే సహజ రంగులన్నిటికీ స్వస్థత చేకూర్చే గుణాలున్నాయంటే ఆశ్చర్యం అనుపించక మానదు. అంతెందుకు సూర్యుడికి, ఆరోగ్యానికీ ఎంతో సంబంధం ఉంది. అసలు సూర్యరశ్మి లేకుండా జీవరాశే లేదు కదా. వెలుతురు లేకపోతే మనకే ఎంతో ఆందోళనగా అనుపిస్తుంది. వెలుతురు లేకపోతే వ్యక్తులలో డిప్రెషన్‌ కూడా వస్తుందని అనేక అధ్యయనాల్లో రుజువైంది. అందుకే కలర్‌ థెరపీ ప్రాక్టీస్‌ చేసేవారు అటు రంగులను, ఇటు వెలుగునూ కూడా తమ పరికరాలుగా ఉపయోగించి స్వస్థత చేకూర్చే ప్రయత్నం చేస్తారు. కలర్‌ థెరపీ భౌతిక, మానసిక, ఉద్వేగపరమైన, ఆధ్యాత్మిక సమస్యలకు వేటికైనా ఉపయోగించవచ్చు.

ఈ కలర్‌ థెరపీ ప్రాచీన ఈజిప్టులో పుట్టిం దని తెస్తోంది. వివిధ ప్రాచీన నాగరికతలలో కూడా దీనిని ఉపయోగించినట్టు పరిశోధకులు చెబుతున్నారు. రంగులు, వెలుగుపై విస్తత్రంగా పరిశోధనలు చేసి న శాస్తవ్రేత్తలు రంగులు వ్యక్తులలో భావోద్వేగపరమైన ప్రతిస్పందనలు కలిగిస్తాయని చెబుతున్నా రు. అయితే ఒక రంగు పట్ల అందరూ ఒకేలా స్పందించకపోవడం విచిత్రం. మనం ఆకర్షితమయ్యే రంగులు మనలో అసమతుల్యత ఉన్నదో పట్టి చెప్తాయిట. కొన్ని రంగులు మనలో సానుకూల భావాలను, మరికొన్ని ప్రతికూల భావాలను రేకెత్తిస్తాయి. వీటిని అధ్యయనం చేసినవారే కలర్‌ థెరపీ చేస్తారు.

కలర్‌ థెరపీలో ఉపయోగించే పరికరాలు: రత్నాలు, కొవ్వొత్తులు, దీపాలు, క్రిస్టల్‌ దండం, క్రిస్టల్‌ లేక గాజు పట్టకం, రంగు బట్టలు, రంగునీటితో స్నానపు చికిత్స, రంగు కళ్ళ జోళ్ళు, లేజర్లు. ప్రధానంగా ఈ పరికరాలను ఉపయోగించి థెరపిస్ట్‌ చికిత్స చేస్తారు. ముందుగా మనం వేసుకునేందుకు ఎంచుకునే దుస్తుల రంగులు వాటి ప్రభావాల గురించి తెలుసుకుందాం.

- సంబందించి దుస్తులను గమనిస్తే అన్నీ లేతరంగుల్లోనే ఉంటాయి. వారికి ఆహ్లాదాన్ని, విశ్రాంతిని ఇవ్వడానికే ఆ రంగులను ఎంచుకుంటారు. అలాగే మనం ఎంచుకునే రంగులు కూడా మన వ్యక్తిత్వాన్ని ఎంతో కొంత వ్యక్త పరుస్తాయి. ఫ్యాషన్‌ పేరుతో వెర్రిగా మనకి సరిపడని రంగులు ధరించడం వల్ల దుష్పరిణామాలు కూడా సంభవిస్తాయట. కొన్ని రకాల రంగుల దుస్తులు ధరిస్తే అవి మన మూడ్స్‌ను కూడా ప్రభావితం చేస్తాయి. ఏ రంగు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూద్దాం.

1.ఎరుపు:ఇది ఉత్తేజకరమైన రంగు. అది మనలోని కొన్ని లక్షణాలకు సంకేతంగా ఉం టుంది. ధైర్యం, బలం, ఉత్తేజం, ఉల్లాసం, లక్ష్యం, అప్రమత్తత, లైంగిక, సృజనాత్మకత, సంకల్ప బలం, తీవ్రత వంటి లక్షణాలకు ఎరుపు సంకేతం. అయితే ఈ రంగు వల్ల కలిగే లాభాలూ అనేకం. ఈ రంగును ఉపయోగించడం ద్వారా నకారాత్మక ఆలోచనలను అధిగమించవచ్చు. ఆత్మవిశ్వా సం, స్థిరత్వం, భద్రత, ఆధిపత్య భావన వంటివి పొందవచ్చు. అంతేకాదు ఈ రంగు మనకు ఆకలిని పెంచుతుంది కూడా. అయితే ఈ రంగును మరీ ఎక్కువ ఉపయోగిస్తే అసహనం, శత్రుత్వ భావన, చిరాకు, ఆగ్రహం వంటివి పెరుగుతాయి.

2.ఆరెంజ్‌:ఈ రంగు సంతోషానికి, ఉల్లాసానికి సంకేతం. ఇది మన మానసిక ఉద్వేగాలను ప్రభావి తం చేయగలదు. ఈ రంగు కలుపుగోలు తనం, నలుగు రి విశ్వాసంగా ఉండడం, విజయం, సంతోషం, ఉపజ్ఞత ఉంటాయి. ఈ రంగును వాడడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. సానుకూల దృక్పథం ఏర్పడడం, ఉల్లాసంగా ఉండగలగడం వంటివి జరుగుతాయి. ఈ రంగు ఎంతో స్ఫూరి ్తని కలిగించడమే కాకుండా, యాంటీ డిప్రెసెంట్‌గా కూడా పని చేస్తుందని థెరపిస్టులు అంటున్నారు. అంతేకాదు ఇది మన ఆసక్తులను పెంచి, మన కార్యకలాపాలు విస్తృతమయ్యేలా చేస్తుంది. అలాగే వ్యక్తిగత సంబంధాలలో సంతోషానికి, మనలోని సంకోచాలను తొలగించడానికి ఇది ఉపయోగపడుతుందిట. అయితే ఈ రంగును అతిగా వాడితే మాత్రం అసహనం, చిరాకు, ఆకలి పెరగడం జరుగుతాయని హెచ్చరిస్తున్నారు.

3.పసుపుపచ్చ:ఇది ఉత్తేజాన్ని ఎక్కువ స్థాయిలో కలిగించగల రంగు. ఇది కూడా మన మానసిక ఉద్వేగాలను ప్రభావితం చేయగలదు. ఈ రంగు మానసిక స్పష్టత, సంతోషం, సానుకూల వైఖరి, ఆత్మ గౌరవం, వివేకం, స్ఫూర్తికి సంకేతం. ఈ రంగు వాడడం వల్ల జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరగడం, ఆసక్తి పెరగడం, డిప్రెషన్‌ తగ్గడం, సాధికారత, ఆత్మవిశ్వాసం, ధైర్యం, ఆందోళన నుంచి బయట పడడం, శక్తి పెరగడం వంటివి జరుగుతాయి. అంతేకాదు, సరైన నిర్ణయాలు తీసుకునేందు కు కూడా తోడ్పడుతుంది. అయితే ఈ రంగు ను అతిగా వాడడం వల్ల సారహీన ప్రవర్తనను, అతిక్రియాశీలత వంటి దుష్పరిణామాలు కలుగుతాయి.

4.ఆకుపచ్చ:ఇది నూతనోత్సాహాన్ని, శాంతిని ఇచ్చే రంగు. ఇది నిర్నిబంధమైన ప్రేమకు సం కేతం. ఈ రంగు శాంతి, నవీకరణ, ప్రేమ, ఆ శ, సమతుల్యత, సామరస్యం, స్వీయ నియం త్రణ, వృద్ధి, జీవితం వంటి వాటికి సంకేతం గా ఉంటుంది. ఈ రంగును వాడడం వల్ల ఒత్తిడి తగ్గడం, విశ్రాంతి, స్థిరత్వం, శాంతి, సమతులంగా, సహజంగా ఉన్నామనే భావన కలుగుతాయని థెరపిస్టులు చెప్తారు. అయితే ఆకుపచ్చని అతిగా వాడడం వల్ల వచ్చేది మాత్రం బద్ధకమేనట. కనుక దీని ఉపయోగంలో జాగ్రత్తగా ఉండాలి.

5.లేత నీలం: ఇది ఎంతో ప్రశాంతమైన రంగు. ఇది మన భావ వ్యక్తీకరణకు సంకేతంగా ఉంటుంది. అంతేకాదు, స్వచ్ఛత, ఓదార్పు, శాంత, ఆత్మవిశ్వాసం, అనర్గళంగా మాట్లాడగలగడం, మనసులో ఒకటి పైకి ఒకటి లేని స్థితికి సంకేతాలు. ఈ రంగును ఉపయోగించడం వల్ల విశ్రాంతి, ప్రేమపూర్వ అభివ్యక్తి, స్వేచ్ఛగా భావ వ్యక్తీకరణ, సుఖనిద్ర, సున్నితత్వం వంటి వాటిని సాధించవచ్చు. అయితే ఈ రంగును ఎక్కువగా ఉపయోగించడం వల్ల పెద్దగా దుష్ఫలితాలు ఉండకపోవడం విశేషం.

6.నీలం:ఇది సంపూర్ణ ఆలోచనలతో అనుసంధానం అయి ఉండే రంగు. అంతేకాదు, సమాచార మార్పిడి, సృజనాత్మకత, వ్యక్తీకరణ, ఉత్తేజం, నిర్ణయాత్మకం, విజ్ఞానం, ఆరోగ్యానికి సంకేతాలు. ఈ రంగును ఎక్కువగా ఉపయోగించడం వల్ల మానసిక విశ్రాంతి, నిశ్చలత, నిద్రపట్టేందుకు సాయపడడం, మాట్లాడేటప్పుడు ఆత్మవిశ్వాసం, స్పష్టమైన సమాచారం, పిల్లల్లో హైపర్‌ యాక్టివిటీ తగ్గేందుకు సహాయపడుతుంది. అందుకే కాబోలు అనేక పాఠశాలల్లో నీలం రంగు యూనిఫాంను ఉపయోగిస్తారు. కానీ నీలం అతిగా వాడడం వల్ల అభద్ర, నిరాశాభావాలు, అలసట, డిప్రెషన్‌, ఉదాసీనత ఏర్పడవచ్చని థెరపిస్టులు హెచ్చరిస్తున్నారు.

7.నెమలికంఠం రంగు: ఇది మన నరాల వ్యవస్థ విశ్రాంతి పొందేందుకు సాయపడుతుంది. పైగా మన అచేతన వ్యక్తిత్వంతో అనుసంధానమయ్యే రంగు ఇది. ఈ ప్రశాంతత, సృజన, అవగాహనకు సంకేతం. ఈ రంగు వాడడం వల్ల సృజనాత్మకత, మెరుగుపడిన సహజ జ్ఞానం, చైతన్యం, స్పష్టమైన దృక్పథం, గాఢ నిద్ర వంటి ఫలితాలు కలుగుతాయి. అయితే ఈ రంగును అధికంగా వాడడం వల్ల డిప్రెషన్‌, ఇతరుల నుంచి వేరుపడిన భావన కలుగుతాయిట.

8.వైలెట్‌:ఇది మన ఆధ్యాత్మిక వ్యక్తిత్వానికి అనుసంధానం అయి ఉండే రంగు. ఇది స్ఫూర్తి, సృనాత్మకత, అందం వంటి వాటికి సంధానమై ఉంటుంది. ఈ రంగు వాడడం వల్ల ఉదారత, నిస్వార్ధత, పెరిగిన సృజనాత్మక సామర్ధ్యం, గాఢ నిద్ర, నరాలను నెమ్మదింప చేయడం, పరిమిత ఉద్వేగం, చిరాకు, అతి ఆకలి తగ్గడం వంటి మంచి ఫలితాలు వస్తాయి. అయితే ఈ రంగును అతిగా వాడితే మాత్రం డిప్రెషన్‌, అభ్రదతా భావం, ఆగ్రహం వంటి ఉద్వేగాలను అణచిపెట్టుకోవడం వంటివి జరుగుతాయిట.

9.మెజెంటా: ఇది సమతుల్యతను సాధిస్తుంది. మనలోని భక్తి ప్రేమకు అనుసంధానం అవుతుంది. మెజెంటా విశ్రాంత స్థితి, ఓదార్పు, సున్నితత్వం వంటి భావాలతో సంధానమై ఉంటుంది. ఈ రంగును వాడడం వల్ల అంతర్గత, బహిర్గత ఉద్వేగాలు సమతులం అవుతాయి. శాంతి లభిస్తుంది. అయితే ఈ రంగును అతిగా వాడడం వల్ల అధిక విశ్రాంత భావన కలుగుతుంది. ఇది డిప్రెషన్‌తో బాధపడేవారికి, నలుగురితో కలవలేని వారికి మంచిది కాదు.

Post a Comment

0 Comments