Full Style

>

Computer pains,కంప్యూటర్‌ నొప్పులు

-Computer pains,కంప్యూటర్‌ నొప్పులు- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


రోజురోజుకీ కంప్యూటర్ల వాడకం ఎక్కువవుతోంది. దీంతో కొత్త జబ్బులూ పుట్టుకొస్తున్నాయి. ఆఫీసుల్లో గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూచొని పనిచేసే ఉద్యోగుల్లో చాలామంది కీళ్ల నొప్పులతో బాధపడుతున్నట్టు బ్రిటన్‌ అధ్యయనంలో వెల్లడైంది. పరిశోధకులు ఈ సమస్యను 'ఆఫీస్‌ నీ' అని వర్ణిస్తున్నారు కూడా. ఊబకాయం, కదలకుండా కూచొని పనిచేయటం దీనికి దోహదం చేస్తున్నాయని వివరిస్తున్నారు. ఇది అన్ని వయసుల వారిలో కనిపిస్తున్నప్పటికీ.. 55 ఏళ్లు పైబడినవారు మరింత ఎక్కువగా బాధపడుతున్నట్టు బయటపడింది. ఊబకాయుల సంఖ్య ఇలాగే పెరుగుతూ పోతే మున్ముందు మోకాళ్ల మార్పిడి అవసరమూ గణనీయంగా ఎక్కువవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ కంప్యూటర్‌ కీళ్లనొప్పుల ముప్పు తగ్గించుకోవటానికి గంటకు ఒకసారైనా కంప్యూటర్‌ ముందు నుంచి లేచి, కాసేపు అటూఇటూ తిరగటం మంచిదని సూచిస్తున్నారు. అలాగే వ్యాయామం చేసే ముందు, తర్వాత వామప్‌ చేయాలని.. మోకాళ్లకు పట్టీల వంటివి ధరించాలని చెబుతున్నారు.

Post a Comment

0 Comments