Full Style

>

మధుమేహం... అంగస్తంభన,Diabetes and erectile dysfunction

మధుమేహం... అంగస్తంభన- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



-మధుమేహం, అంగస్తంభన చదివి కొత్తవిషయాలు తెలసుకోండి. ఒక గంటసేపు సమయాన్ని విజ్ఞానదాయకంగా గడపండి. అంగస్తంభన వచ్చి నిలబెట్టుకోవడంలో అసమర్థతనే ఎరెక్టైల్‌ డిస్‌ఫంక్షన్‌ అంటారు. మధుమేహం ఉన్నవారిలో నపుంసకత్వం సర్వసాధారణం. గుండె జబ్బులను, డిప్రెషన్‌ను సూచిస్తుంది. కామపరమైన అసమర్థత జీవన నాణ్యతను దెబ్బతీస్తుంది. భాగస్వామితో సంబంధాలను ప్రభావితం చేస్తుంది. జబ్బు, మందులు, మద్యం ఇ.డి.కి దారితీయవచ్చు. రక్తంలో గ్లూకోజ్‌ పరిమాణాన్ని సరిగా అదుపుచేయనందువల్ల మధుమేహం వస్తుంది. దాంతో పురుషుల్లో ఇ.డి. సమస్య తలెత్తుతుంది. రక్తనాళాలు కూరుకుపోవడం కూడా నపుంసకత్వానికి దారితీస్తుంది.

రక్తనాళాలు గట్టిపడిపోయినపుడు రక్తం, ప్రాణవాయువు శరీరంలోని కొన్ని భాగాలకు ప్రసరించలేవు. పురుషాంగానికి వెళ్ళే రక్తనాళాల్లో కొవ్వు పదార్థాలు పేరుకుపోయినట్లయితే అది పెద్దగా, గట్టిగా అవడానికి మెత్తటి కండరాల కణాలు విశ్రాంతి పొందలేవు. ఇ.డి.కి మదుమేహం ఒక కారణం మాత్రమే. వయసు, గుండెకు సంబంధించిన జబ్బులు ఇతర కారణాలు. ఉత్తేజపరిచే సంకేతం మెదడుకు చేరదు. పురుష హార్మోన్లు తక్కువ స్థాయిలో ఉండడం, మందులు వాడడం, రక్తంలో కొలెస్టరాల్‌ ఎక్కువ పరిమాణంలో ఉండడం కూడా అంగస్తంభన సమస్యకు దారితీస్తాయి. మధుమేహం ఉండే పురుషులు రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిని అదుపులో ఉంచుకున్నట్లయితే ఇ.డి. సమస్యను అరికట్టవచ్చు లేక మరికొంత కాలం రాకుండా చూసుకోవచ్చు. అంగస్తంభన సమస్యను నియంత్రించవచ్చు, నివారించవచ్చు.

సిగరెట్లు కాల్చడం మానేయండి, బరువు తగ్గండి, రోజూ వ్యాయామం చెయ్యండి, మీ రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిని (బ్లడ్‌ షుగర్‌ లెవెల్‌) ను అదుపులో వుంచుకోండి. రోజూ వ్యాయామం చేస్తూ బరువుతగ్గిన వారి అంగస్తంభన మెరుగైనట్లు ఇటీవల వెలువడ్డ పరిశోధనలు తెలుపుతున్నాయి. మధుమేహం ఉన్నవారు వాడే మందులు ఇ.డి. కి దారితీయవచ్చు. సాధారణంగా మధుమేహం వున్న పురుషులకు ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా మందులు వాడుతారు. డాక్టరు చెప్పే మందుల పట్టికను జాగ్రత్తగా పరిశీలించి మందుల వాడకంలో మార్పులు చేస్తే అంగస్తంభన సమస్యను నివారించడానికి దోహదపడుతుంది. నపుంసకత్వం మూలంగా రతిలో సరిగా పాల్గొనలేని పురుషులకు తోడ్పడే కొన్ని పద్ధతులున్నాయి. రతిలో సమర్థవంతంగా పాల్గొనడానికి వయాగ్రా, లెవిట్రా, సియాలిస్‌ మందులను వాడుతారు.

కానీ మధుమేహం ఉన్న పురుషుల్లో ఇవి అంతగా ఉపయోగపడవని తెలుస్తోంది. అంగస్తంభనను నిలబెట్టే పరికరాలు (వ్యాక్యూమ్‌ కన్‌స్ట్రిక్షన్‌ డివైస్‌) సత్ఫలితాలిస్తున్నాయని తెలుస్తోంది. మధుమేహంలో 75 శాతం దాకా ఈ పరికరం విజయం సాధించింది. ఇ.డి. కారణాలేవైనా ఈ పరికరాలు పనిచేస్తాయి. దంపతులు రతికిముందు కామోత్ప్రేరకంగా కూడా వినియోగించవచ్చు. సరాసరి పరుషాంగానికి ఇంట్రాకావెర్నెసాల్‌ ఇంజెక్షన్లు ఇవ్వడం నపుంసకత్వానికి మరో తరుణోపాయం. ఆపరేషన్‌, ఇంప్లాంన్టేషన్‌ చాలా వరకు విజయం సాధించాయి. పెనైల్‌ ప్రోస్థెసిస్‌ కానీ మధుమేహం ఉండే పురుషుల్లో ఇన్‌ఫెక్షన్లు సోకే అవకాశం ఉంది. టెస్టోస్టిరాన్‌ ఉత్పత్తి అవుతున్న వారికి ఈ చికిత్స సిఫార్సు చేయరు.

నపుంసకత్వం ఆరోగ్యకరమైన లైంగిక బాంధవ్యానికి పుల్‌స్టాప్‌ కాదు. ఇ.డి. పురుషుల్లో విరక్తికి దారితీయవచ్చు కానీ కామవాంఛను తీర్చుకునే ఇతర మార్గాలున్నాయన్న విషయం తెలుకుంటే మంచిది. అందులో రతి ఒక పద్ధతి మాత్రమే. కలిసి స్నానం చెయ్యడం, ఊహల్ని పంచుకోవడం, ఒకరికొకరు వ్యాయామం చేసుకోవడం ఇలా ప్రేమను అనుభవించే మార్గాలు చాలా వున్నాయి. మధుమేహం అంగస్తంభన గురించి తెలుసుకోవలసింది ఇంకా చాలానే ఉంది. ఈ రచన మీ ఇతర ప్రశ్నలకు సమాధానం అన్వేషించడానికి మంచి పునాది వేస్తుంది. ఇప్పుడు మీకు ప్రాథమిక సూత్రాలు తెలుసు. ఖచ్చితమైన వాస్తవాలు తెలుసు. మీరు ఉత్సాహంతో ముందుకు సాగవచ్చు. మీ విజ్ఞాన తృష్ణ తీర్చుకోవచ్చు.

Treatment :

గుండె జబ్బులు లేనివారు .. వయగ్రా మందును వాడవచ్చును . వారానికి 2 లేదా 3 రోజులు ... Tab. penegra 25 mg or 50 mg per day 2-3 hours before the act.

సుగరు వ్యాది ఉన్నవారు ... వాటికి సంబంధిత మందులు క్రమము తప్పకుండా వాడాలి .

రోజూ ఒక బి.కాంప్లెక్ష్ మాత్ర వాడితే చాలా మంచిది .

Post a Comment

0 Comments