వాంతులు-విరేచనాలు- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
కలుషితమైన ఆహార పదార్థాలు భుజించడం వల్ల గానీ, ఆహార పదార్థాల అలర్జీ వల్లగానీ, అతిసార, కలరా, షీగెల్లోసిస్, యెల్లో ఫీవర్ లాంటి జబ్బుల్లోను వాంతులు, విరేచనాలు వస్తుం టాయి. వాంతులు విరేచ నాలతో శరీరంలోని నీరు, లవణాలు నష్టపో వడంతో డీహై డ్రే షన్ ఏర్పడుతుంది.
కలుషిత ఆహారం వల్ల కలిగే దుష్పరిణామాలతో వాంతులు, విరేచనాలు లేదా ఈ రెండూ సంభవించవచ్చు. కడుపునొప్పి కూడా రావచ్చు. వాంతులు, విరేచనాలు అవుతుంటే శరీరంలోని ఖనిజలవణాలు కోల్పోకుండా జాగ్రత్త పడాలి .
కారణాలు :
విరేచనాలు ఎంత సర్వసాధారణంగా ఎదురయ్యే సమస్యో కొన్నిసార్లు అంత క్లిష్టంగా కూడా పరిణమిస్తుంది. ముఖ్యంగా దీర్ఘకాలికంగా విరేచనాలు వేధిస్తున్నప్పుడు శాశ్వత పరిష్కారం మీద దృష్టిపెట్టాలి.
మలవిసర్జన ఎక్కువసార్లు అవుతున్నా, మలం పలచబడినా (అవి పెద్ద విరేచనాలు కావచ్చు, చిన్నవీ కావచ్చు) విరేచనాలు అవుతున్నాయని వ్యవహరిస్తాం. కొన్ని సందర్భాల్లో విరేచనాలు, వాంతులు కలిసి కూడా అవుతుంటాయి.
పేగుల్లో పోషకపదార్ధాలు, లవణాలు జీర్ణం కాకపోయినా లేక లవణాలు, నీరు పేగులలోకి అధికంగా వచ్చి చేరినా విరేచనాలు అవుతుంటాయి. సాధారణంగా విరేచనాలను- పెద్ద విరేచనాలు, చిన్న విరేచనాలని రెండు తరగతులుగా వర్గీకరించవచ్చు. పెద్దపెద్ద విరేచనాలు చాలావరకూ నీళ్ల విరేచనాల రూపంలోనే ఉంటాయి. ఇవి పెద్ద పేగులోకి ద్రవ పదార్ధాలు ఎక్కువగా వచ్చి చేరిపోవటం మూలంగా సంభవిస్తుంటాయి. ఇక చిన్న విరేచనాలు పేగుల గోడల మీద పుండ్ల వంటివి పడటం మూలంగా అవుతుంటాయి. వీటిలో చీము, రక్తం లాంటివీ కనిపిస్తుంటాయి.
పెద్ద విరేచనాలను 'ఆస్మాటిక్ డయేరియా' అని వ్యవహరిస్తుంటారు. ఇవి చాలా వరకూ తరుణ (అక్యూట్) వ్యాధులై ఉంటాయి. వీటికి ప్రధానంగా కలుషిత ఆహారం, కలుషిత నీరు వంటి బాహ్య అంశాలే కారణమవుతుంటాయి.
చిన్న విరేచనాలు చాలా వరకూ పేగుల్లో వ్యాధుల మూలంగా సంప్రాప్తిస్తుంటాయి. క్రోన్స్ వ్యాధి, అల్సరేటివ్ కోలైటిస్, అమీబియాసిస్... వంటివి ఈ కోవకు చెందినవే. ఈ రోగులకు ఆసనంలో నొప్పి, బట్టలకు మలం మరకలు అంటటం, రాత్రిళ్లు మలవిసర్జన కోసం లేవాల్సి వస్తుండటం కూడా జరగొచ్చు. ఈ తరహా వ్యాధులను దీర్ఘ వ్యాధులుగా పరిగణిస్తారు. ఇలా అంతర్గత కారణాల మూలంగా సంభవించే వ్యాధులను దీర్ఘవ్యాధులుగా గుర్తిస్తుంది వైద్య విధానం. ఈ రోగులలో రోగ లక్షణాలేకాక రోగి లక్షణాలకు కూడా ప్రాధాన్యం ఉంటుంది. రోగి లక్షణాలను కూడా పరిగణనలోకి తీసుకుంటేనే ఈ వ్యాధులను పూర్తిగా నయం చేయటం సాధ్యపడుతుంది.
డీ హైడ్రేషన్ లక్షణాలు
విపరీతమైన దాహం, నోరు ఎండిపోవడం, చర్మం పొడి బారడం, కళ్లు గుంతలు పడడం, మూత్ర విసర్జన తక్కువ కావడం, అలసట, తలనొప్పి, తలతిరగడం, కంటిచూపు మందగించడం, గుండె వేగంగా కొట్టుకోవడం, ఊపిరి వేగంగా తీసుకోవడం, కండరాలు పట్టేయడం కనిపిస్తాయి. కొన్ని సార్లు మృత్యువాత పడే అవకాశాలున్నాయి.
చికిత్స
వాంతులు విరోచనాలు అవుతున్నప్పుడు మన జీర్ణమండలము సరియైన రీతిలో పనిచేసే పరిస్థితిలో ఉండదు . కావున దానికి విశ్రాంతి అవసరము . విరోవనాలు + వాంతులు అవుతున్న రోగికి .... డీ హైడ్రేషన్ తీవ్రతను బట్టి మూడు రకాలు గా విభజించారు . 1.తక్కువ తీవ్రత(mild),2.ఒక మోస్తరు తీవ్రత (moderate) , ఎక్కువ తీవ్రత (severe) గలవి గా చెప్పబడినవి .
సివియర్ టైప్ లో 24 గంటలు నోటిద్వారా ఏమీ ఇవ్వకూడదు. I.V salines , I.V antibiotics, I.V vitamins ఇవ్వాలి . ఈవిషయము లో డాక్టర్ తప్పనిసరి .
మోడరేట్ టైప్ లో కొంతవరకూ ఐ.వి.ఫ్లూయిడ్స్ ఇస్తూ నోటిద్వారా అవసరమైన ద్రవపదార్ధాలు ఇవ్వవచ్చును.
మైల్డ్ టైప్ లో అన్నీ నోటిద్వారానే ఇవ్వవచ్చును . ఈ క్రింది విధము గా నోటిద్వారా ఇవ్వాలి ....
* రోగికి దాహం తగ్గేంతవరకు 'అరలీటరు నీళ్లలో పిడికెడు చక్కెర, మూడు చిటికెల ఉప్పు కలిపి' లేదా 'ఓఆర్‌ఎస్' పొడిని ప్యాకెట్‌పై సూచించిన విధంగా నీళ్లలో కలిపి తాగించాలి.
* కొబ్బరి నీళ్లు, ఉప్పు కలిపిన మజ్జిగ తాగించొచ్చు.
* వాంతులు విరేచనాలతో కలుషితమైన దుస్తులను మార్చి, శరీరాన్ని నీళ్లతో శుభ్రపరచాలి.
జాగ్రత్తలు--
తొలుత మెత్తగా ఉండే ఘనాహారాన్ని మొదలుపెట్టి క్రమంగా రెగ్యులర్ ఫుడ్ తీసుకోవాలి.
ఫుడ్ పాయిజనింగ్ జరగకుండా నీళ్లు కాచి తాగడం మంచిది.
ఆహారంపై మూతలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.
తినడానికి ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
కాచి చల్లార్చిన నీటిని తాగాలి.
వాంతులు, విరేచనాలు అవుతున్న సమయంలో కాఫీ, ఆల్కహాలిక్ డ్రింక్స్, కూల్‌డ్రింక్స్ వంటివి తీసుకోకూడదు. పాలు కూడా తాగకూడదు.
వాంతులు, విరేచనాలు ఆగకుండా అవుతున్నప్పుడు తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించాలి.
1 Comments
మంచి సమాచారం
ReplyDelete