Full Style

>

చుండ్రు (Dandruff) , Dandruff

శిరోజాల పరిరక్షణలో తరచూ చిరాకు పెట్టి , ఇబ్బంది కలిగించే సమస్య చుండ్రు . ఈ చుండ్రు (Dandruff) ఒకరకమైన చర్మవ్యాధి. కొన్ని సమయాల్లో ఫంగస్ ఇన్ఫెక్షన్ తోడుఅవుతుంది . ప్రతిరోజూ కొన్ని లక్షల చర్మం కణాలు పుడుతూ ఉంటాయి , కొన్ని లక్షల కణాలు చనిపోతూ ఉంటాయి. ఇలా తల పైన కొత్త కణాలు కంటే మృతకనాలు ఎక్కువయితే అవి పెచ్చులుగా తలపై కనిపిస్తాయి ... అదే చుండ్రు . వీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోతే ఇన్ఫెక్షన్ చేరి చుండ్రు వలన పూర్తిగా జుట్టు రాలిపోయే ప్రమాదం రావచ్చును .
వైద్య భాషలో దీన్ని "సేబోరిక్ డెర్మటైటిస్ " అంటారు . చుండ్రు తల కపాలానికి వచ్చే సాదహరణ , దీర్ఘకాలిక ఇన్ఫ్లమేటరీ చర్మ పరిస్థితి .
రకాలు : చుండ్రు ప్రధానము గా రెండు రకాలు .
పొడి చుండ్రు -తెల్లగా చిన్న చిన్న పొలుసులు పొట్టు రూపం లో రాలుతుంది . చల్లని వాతావరణం లో కనిపిస్తుంది .
జిడ్డు చుండ్రు - గ్రీజీ రకము లేత పచ్చ రంగులో ఉండి ఒక్కో సారి చెడువాసన తో కూడి ఉంటుంది . వేడి వాతావరణం లో కనిపిస్తుంది .

ఏ కాలంలోనైనా.... ఎల్లప్పుడూ... అందరినీ వేధించే ప్రధాన సమస్య తలలో చుండ్రు. వయసుతో సంబంధం లేకుండా పెద్దవారికి, చిన్నవారికి అనే తేడా లేకుండా... అందరికీ తలలో చుండ్రు రావడం సాధారణం.

చుండ్రు రావడానికి కారణాలు ఏమిటి ? చుండ్రు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. నిజానికి చుండ్రుకు ఇదీ కారణము అని ఖచ్చితం గా చెప్పలేము .

చుండ్రు వంశపారంపర్యంగా కూడా వస్తుంటుంది.
ఎక్కువ ఒత్తిడికి లోనైనా తలలో చుండ్రు వస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏదో ఒక విషయానికి సంబంధించి వత్తిడికి గురికావడం జరుగుతోంది.
ఎక్కువ సమయం ఎసి గదుల్లో గడపడం వల్ల, కూలర్ కింద కూర్చున్నా , తల మీది చర్మం పొడి బారిపోయి పొట్టులాలేస్తుంది.
షాంపూ లతో తలస్నానం చేసినప్పుడు చర్మానికి అంటిన షాంపూ పూర్తిగా వదలపోయినా... చుండ్రు వచ్చే అవకాశం వుంది .
తలకు రాసుకునే షాంపూలో మినరల్స్, ఐరన్ ఎక్కువైనా చుండ్రు పెరగడానికి అవకాశం ఎక్కువ.
కలుషిత వాతావరణం కూడా చుండ్రును పెంచుతుంది.
ఏ వాతావరణంలో నివసించే వారికైనా చుండ్రు వస్తుంది. సముద్ర తీరప్రాంతాల్లో నివసించినా పర్వత ప్రాంతాల్లోనివసించినా దీని నుంచి తప్పించుకోలేకపోతున్నారు.
ఋతువులు మారినప్పుడల్లా వాతావరణంలో వచ్చే మార్పులు కూడా తలలో చుండ్రు రావడానికి కారణమవుతాయి.
మన శరీరానికి కావలసినంత పౌష్ఠికాహారం తీసుకోపోయినా,
శరీరంలోని హార్మోన్లు సక్రమంగా లేకపోయినా కూడ చుండ్రు వచ్చేస్తుంది.

దీనివల్ల వచ్చే మానసిక అందోళన నుంచి బయటపడలన్నా, చుండ్రు పోవలన్నా ఎప్పుడూ మందులపై అధారపడకూడదు. ఇంట్లోనే తయారుచేసుకునే కొన్ని పదార్థాలను ఉపయోగించడం, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.

ట్రీట్మెంట్ : పరిరక్షణ (Prevention)
ఉసిరి , అలోవేరా అరటి , నిమ్మ లాంటివి మూల పదార్ధాలుగా ఉండే హెర్బల్ షాంపూ లు మాడును (Scalp) రక్షిస్తాయి.
కీటోకెనజోల్ , సెలీనియం సల్ఫిడ్ ఉన్న యాంటి డేండ్రఫ్ షాంపూ లు పనిచేస్తాయి . ఉదా: Candid TV, Keto-B shampoo, Selsun shampoo .. etc.

తెలుసుకోవలసిన విషయాలు :
చుండ్రు ఒకరినుంచి ఒకరికి అంటుకుంటుంది అనడం లో వాస్తవం లేదు .
ఇతరుల దువ్వెనలు , బ్రష్ లు వాడినట మాత్రాన చుండ్రు వస్తుందనుకోవడం సరికాదు . సమస్య శారీక వ్యవస్థలో దాగిఉంటుంది .
షాంపూ లు తరచూ వాడడం వల్ల తల చర్మం లో పొలుసులు లేస్తాయనడము వాస్తవం కాదు . షాంపూ పూర్తీ గా వదిలేలా స్నానం చేయక పోవడం మాడు (scalp) సమస్యలకు దారి తీస్తుంది . కాబట్టి షాంపూ లను శుబ్రం గా స్నానము చేసి వదిలించుకోవాలి .
ఇంటి వైద్యము (చిట్కాలు):

* ఆరు చెంచాల నీళ్ళల్లో రెండు చెంచాలు వెనిగర్ కలపాలి. షాంపూతో తలస్నానం చేశాక వెనిగర్ నీళ్ళను తలకు బాగా పట్టించాలి. ఇవిధంగా వారానికి ఒకసారి చొప్పున కనీసం మూడు నెలలపాటు చేస్తే చుండ్రు తగ్గుతుంది.

* వారానికి రెండుసార్లు గోరువెచ్చటి కొబ్బరినూనెలో నిమ్మరసం కలిపి తలకు మర్దన చేయాలి. చేతి వేళ్ళతో అరగంట సున్నితంగా రాయాలి. వేడినీటిలో ముంచిన తువ్వాలు తలకు చుట్టి అరగంట వుంచాలి. ఆ తర్వాత తలస్నానం చేస్తే జుట్టుకు మంచి పోషణ చేకూరుతుంది.

* చుండ్రు ఎక్కువుగా వున్నప్పుడు మెంతులు నానబెట్టి ఫేస్ట్ చేసి దాన్ని తలకు రాయాలి. అరగంట తర్వాత తలస్నానం చెయాలి

* ఎక్కువ ఆకుకూరలు, పీచుపదార్థం, విటమిన్ ఎ అధికంగా ఉండే పండ్లు తినాలి. కాయగూరలు, చేపలను సమతూలంగా ఆహారంలో తీసుకోవాలి. వేపుడు పదార్థాలను తినకపోవడం మంచిది. ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని భుజించాలి.

* తలను ఎప్పుడు కప్పి వుంచకూడదు. తలలో తేమ లేకుండా చూసుకోవాలి. తరుచుగా తలకు షాంపూ పెట్టి, సరైనా కండిషనర్ జాగ్రత్తగా వాడాలి. వాటిని వాడినప్పుడు తలను శ్రద్ధగా శుభ్రపరచాలి. మాయిశ్చరైజింగ్ షాంపూ, హెర్బల్ కండిషనర్ను వాడితే చర్మం పొడిగా అవదు.

* తలస్నానం చేయడానికి అరగంట ముందుగానే... పుల్లగా వుండే పెరుగు, నిమ్మరసం కలిపి తలకు రాయాలి. వారానికి ఒకసారి ఈవిధంగా చేయడం వల్ల తలలో పొట్టు రాదు.

* ఉసిరికాయ జుట్టుకు ఐరన్‌ను అందించి ఆరోగ్యంగా వుంచుతుంది. నిమ్మరసంలో ఉసిరికాయ రసంకానీ, ఉసిరి పొడి కానీ కలిసి తలకు మర్ధన చేయాలి. ఒక గంట తర్వాత స్నానం చేయాలి.

చుండ్రును అరికట్టేందుకు ఫ్రూట్ థెరపీ లేదా వెజిటెబుల్ థెరపీని ఉపయోగిస్తే సమస్యను అధిగమించవచ్చంటున్నారు సౌందర్య నిపుణులు.

టమోటా థెరపీ : టమోటా గుజ్జును ఓ ప్లాస్టిక్‌ బౌల్‌లో వేసుకోండి. ఇందులో కొంత నిమ్మకాయ రసాన్ని కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని తలపై పూయండి. నలభై నిమిషాల తర్వాత తలస్నానం చేయండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తుంటే చుండ్రు మటుమాయం అవుతుంది అంటునారు సౌందర్యనిపుణులు .

యాపిల్ థెరపీ : రెండు యాపిల్ పండ్లను గుజ్జుగా చేసుకోండి. ఈ గుజ్జును వెంట్రుకలకు దట్టించండి. ఇలా దట్టించిన ఈ యాపిల్ గుజ్జును 45 నిమిషాల వరకు ఉంచండి. ఆ తర్వాత చల్లటి నీటితో తల స్నానం చేయండి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తుంటే చుండ్రు మటుమాయం అంటునారు సౌందర్యనిపుణులు .

Post a Comment

0 Comments