Drugs induced Gingivitis,మందులతో చిగుళ్ల సమస్యలు- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
చాలామంది శ్రద్ధ పెట్టటం లేదుగానీ అధిక రక్తపోటు(హైబీపీ)కు, గుండె జబ్బులకు, మూత్రపిండాల వ్యాధులకు వాడే మందులతో, అలాగే ముట్లుడిగిపోయే దశలో స్త్రీలకు వాడే ఈస్ట్రోజెన్ మాత్రలతో, అలర్జీ బాధితులు వాడే స్టిరాయిడ్లు, ఫిట్స్‌కు వాడే ఫెనటాయిన్ వంటి మందులతో... చిగుళ్ల సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి.
ముఖ్యంగా- బీపీకి చాలా సర్వసాధారణంగా వాడుతుండే 'నిఫిడపిన్' వల్లకొన్నిసార్లు చిగుళ్లన్నీ కూడా చాలా పెద్దగా వాచిపోయి, నోరు తెరవటం, మూయటం కష్టంగా తయారవుతుంది. ఈ మందు వల్ల ఇలా జరగొచ్చని తెలియక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అలాగే మూత్రపిండాల మార్పిడి చేయించుకున్న వారికి 'సైక్లోస్పోరిన్' అనే మందు నిరంతరాయంగా వాడుతుంటారు. దీనివల్ల చిగుళ్లు వాపు రావచ్చు. ఇక ఫిట్స్ వ్యాధిలో ఇచ్చే 'ఫినటాయిన్', 'సోడియం వాల్‌ప్రొయేట్' వంటి మందులతోనూ చిగుళ్లవాపు రావొచ్చు. ఇలా మందుల మూలంగా చిగుళ్లవాపు అందరికీ రావాలనేమీ లేదు. దీనికి జన్యుపరమైన అంశాలు దోహదం చేయొచ్చు. కొందరిలో మందు ఆరంభించిన పది రోజుల్లోనే చిగుళ్ల వాపు వస్తే మరికొందరిలో సంవత్సరమైనా రాకపోవచ్చు. మొత్తానికి బీపీ, మధుమేహం, కిడ్నీ జబ్బులు, ఫిట్స్ మందుల మూలంగా చిగుళ్ల వాపు వచ్చే అవకాశముందని గుర్తించాలి. వాపు మూలంగా సరిగా బ్రషింగ్ చేసుకోలేరు. దీంతో ఇన్‌ఫెక్షన్, చిగుళ్ల నుంచి రక్తం, చీము, నోటి దుర్వాసన, పళ్లు కదలటం.. ఇలా సమస్యలు వరుసపెడతాయి. కాబట్టి ఈ మందులు వాడేవారు తమ చిగుళ్లు ఎలా ఉన్నాయో తరచుగా గమనిస్తూ ఉండాలి. వాపు వస్తుంటే వెంటనే వైద్యుల దృష్టికి తీసకువెళితే మందులను మార్చి, వేరేవి ఇచ్చే అవకాశం ఉంటుంది. సైక్లోస్పోరిన్, నిఫిడపిన్ వంటి మందులను ఆపేసిన తర్వాత 6-8 నెలల్లోపు నెమ్మదిగా చిగుళ్ల వాపూ తగ్గుతుంది. మూర్ఛకు వాడే ఫినటాయిన్ మూలంగా వచ్చే వాపు ఆ మందులను ఆపేసినా తగ్గదు. వీరికి తప్పకుండా సర్జరీ చేయాల్సి వస్తుంది. కాబట్టి వైద్యులు కూడా సాధారణంగా దీనికి బదులు ప్రత్యామ్నాయ మందులను సూచిస్తుంటారు. మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలకు మందులు వాడేవారు కనీసం రెండు మూడు నెలలకు ఒకసారైనా తమ చిగళ్ళు ఎలా ఉన్నాయో క్షుణ్నంగా పరీక్షించుకోవాలి. ఏమాత్రం వాపు కనిపించినా డాక్టరును సంప్రదిస్తే ప్రత్యామ్నాయ మందులను సూచిస్తారు.
మరో సమస్య: మధుమేహం, హైబీపీ బాధితులు తీసుకునే మందుల వల్ల నోటిలో నీరు వూరటం తగ్గి తరచుగా పొడిబారుతుంటుంది. నిజానికి మన లాలాజలంలో చాలా రకాల రోగ నిరోధక కణాలుంటాయి. అటువంటి లాలాజలం తగ్గగానే నోటిలో నిరోధక శక్తి తగ్గుతుంది. రెండోది లాలాజలం దంతాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుంటుంది కూడా. ఇది తగ్గగానే ఆహార పదార్థాలు దంతాలకు అతుక్కుపోవటం ఎక్కువ అవుతుంది. దీంతో చిగుళ్ల వ్యాధి ఆరంభమవుతుంది. కాబట్టి మధుమేహం, హైబీపీలకు సంబంధించిన మందులు వేసుకుంటున్నప్పుడు ఇటువంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని గుర్తించి ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. వీళ్లు- నీరు కాస్త ఎక్కువగా తాగటంతో పాటు ఉసిరికాయ ముక్కనుగానీ, నిమ్మ తొనను గానీ అప్పుడప్పుడు బుగ్గన పెట్టుకుంటే లాలాజల గ్రంథులు ఉత్తేజితమై లాలాజలం మరింత ఎక్కువగా ఊరే అవకాశం ఉంటుంది.
చికిత్స
చిగుళ్ల వ్యాధికి కారణమేమిటన్నది చూడటం ప్రధానం. ఏ చిగుళ్ల వ్యాధిని తీసుకున్నా కూడా అది ఆరంభమయ్యేది పంటి మీద పేరుకునే పాచి.. గారతోనే! కాబట్టి రక్తం వస్తున్న ఆ తొలి దశలో క్లీనింగ్/స్కేలింగ్ చేయించుకుంటే సరిపోతుంది. వైద్యులు ప్రత్యేక పరికరాలతో చేస్తేనే ఈ గార తొలగిపోతుందిగానీ ఎవరికి వారు తొలగించుకోవటం కష్టం. ఒకసారి గార శుభ్రం చేసేస్తే ఇక అక్కడి నుంచీ నిత్యం శుభ్రంగా బ్రషింగ్ చేసుకోవటం, జాగ్రత్తలు తీసుకుంటే సమస్య ఉండదు. ముఖ్యంగా హైబీపీ, మధుమేహం మందులు వాడేవారు దీనిపై అవగాహన పెంచుకోవాలి. పైగా ఈ మందులు వాడే వారిలో చిగుళ్లు వాచే ప్రక్రియ చాలా వేగంగా ఉంటుంది. కాబట్టి వీరు తమ చిగుళ్లు సరిగ్గానే ఉన్నాయా? లేదా? అన్నది తరచుగా చూసుకుంటూ ఉండాలి. ఏ మాత్రం రక్తం వస్తున్నా వెంటనే వైద్యులకు చూపించుకోవాలి. ఈ దశలో నిర్లక్ష్యం చేస్తే ఇన్ఫెక్షన్ లోపలికి వెళుతుంది. ఈ దశలో కేవలం క్లీనింగ్, యాంటీబయాటిక్స్‌తో సరిపోతుందా? లేక సర్జరీ కూడా అవసరమవుతుందా? అన్నది వైద్యులు నిర్ధారిస్తారు.

0 Comments