DVT,Deep vein Thrombosis,సిరల్లో రక్తం గడ్డకట్టడము,డీప్ వెయిన్ థ్రాంబోసిస్(డీవీటీ)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
మన కాళ్ల నుంచి రక్తాన్ని తిరిగి గుండెకు తీసుకువెళ్లే సిరల్లో... ఆ రక్తం ఎక్కడన్నా గడ్డకడితే.. ముంచుకొచ్చే ముప్పే ఈ డీవీటీ! ఒకప్పుడీ బాధ మన భారతీయుల్లో తక్కువ అనుకునేవారు. కానీ శారీరక శ్రమ లేకుండా కాలం గడుపుతున్నవారు... గంటల తరబడి కూర్చుని ఉద్యోగాలు చేసే వారి సంఖ్య పెరుగుతున్న కొద్దీ... ఈ ప్రమాదకరమైన సమస్యా పెరుగుతోంది. దీన్ని విస్మరిస్తే విపత్తే!
నానాటికీ మన జీవనశైలి మారిపోతుండటం వల్ల... ఒకప్పుడు పాశ్చాత్య దేశాల్లో ఎక్కువనుకునే సమస్యలన్నీ ఇప్పుడు మన దగ్గరా బాగానే పెరుగుతున్నాయి. శరీరానికి వ్యాయామం లేకుండా.. కాలికి తగినంత పని చెప్పకుండా.. నడక అనేదే లేకుండా.. గంటల తరబడి కంప్యూటర్ల ముందర కూర్చుండిపోతున్న వారి సంఖ్య మనదేశంలో చాలా పెరుగుతోంది. ఇటువంటి వారిలో ఉన్నట్టుండి ఒక కాలుగానీ, తొడగానీ ఎర్రగా కందిపోయి.. బాగా వాచి.. నడవటం కష్టంగా తయారైతే... వెంటనే అది 'డీవీటీ' సమస్యేమో అని అనుమానించటం చాలా అవసరం. కానీ ఇటువంటి లక్షణాలు కనబడుతున్నప్పుడు చాలామంది దాన్ని 'కాలు బెణికిందనో'.. 'నరం బెసిగిందనో'.. తెలియని 'కముకు దెబ్బ ఏదో తగలిందనో'.. ఇలా రకరకాలుగా సర్దిచెప్పుకొంటూ ఏవేవో తమకు తోచిన చిట్కాలను ఆశ్రయిస్తుంటారు. ఐస్ పెట్టుకోవటం, కాపడం పెట్టటం, మసాజ్‌లు చేయించుకోవటం, ఆకు పసర్లను ఆశ్రయించటం వంటివి చేస్తుంటారు. కొన్నిసార్లు వైద్యులు కూడా దీన్ని బోదకాలు వ్యాధిగానో, సయాటిగా నొప్పిగానో, ఏదో తేలికపాటి చెడువాపుగానో పొరబడే అవకాశాలుంటాయి. దీనివల్ల విలువైన కాలమంతా వృథా అయిపోయి.. సమస్య మరింతగా ముదిరి.. అనూహ్యంగా ఎక్కడెక్కడికో విస్తరించి.. చివరికి ప్రాణాల మీదికి ముంచుకొచ్చే ప్రమాదమూ ఉంటుంది. అందుకే 'డీవీటీ' తలెత్తినప్పుడు.. దాన్ని సత్వరమే గుర్తించటం, చికిత్స తీసుకోవటం అత్యవసరం.
ఏమిటీ 'డీవీటీ'?
మన శరీరంలో తల నుంచి కాళ్ల వరకూ.. ప్రతి అవయవానికీ.. ప్రతి కణానికీ రక్త సరఫరా అవసరం. అందుకే మన ఒళ్లంతా రక్తనాళాలు ఉన్నాయి. వీటిలో ఆక్సిజన్ దండిగా ఉన్న మంచి రక్తాన్ని గుండె నుంచి శరీరమంతా సరఫరా చేసే ధమనులుంటాయి, ఆ పక్కనే మన శరీరం ఆక్సిజన్‌ను వినియోగించేసుకున్న తర్వాత తిరిగి ఆ రక్తాన్ని శుద్ధి చేయటానికి గుండెకు తీసుకువెళ్లే సిరలుంటాయి. గుండెకు చేరిన ఆ రక్తం అక్కడి నుంచి వూపిరితిత్తుల్లోకి వెళ్లి, అక్కడ శుద్ధి అయ్యి.. తిరిగి గుండెలోకి వచ్చి ధమనుల ద్వారా శరీరమంతా ప్రవహిస్తుంది. ఇలాకాళ్ల నుంచి రక్తాన్ని శుద్ధి కోసం వెనక్కి (అంటే పైకి) తీసువెళ్లే సిరల్లో రక్తం ఎక్కడన్నా 'గడ్డ' కట్టే అవకాశం ఉంటుంది. ఇలా రక్తం గడ్డ కట్టి, ప్రవాహానికి అవరోధంగా తయారైనప్పుడు.. ఇక ఆ రక్తనాళంలో రక్తప్రవాహం నిలిచిపోతుంది. కింది నుంచి ఇక రక్తం పైకి వెళ్లే పరిస్థితి ఉండదు. ఫలితంగా ఆ కింది భాగంలో చెడు రక్తం నిలిచిపోయి.. కాలు లేదా చెయ్యి వాచిపోతుంది. ఇదే 'డీప్ వెయిన్ థ్రాంబోసిస్- డీవీటీ' సమస్యకు ఆరంభం! దీన్ని ఈ దశలోనే గుర్తించి సరైన చికిత్స ఆరంభించకపోతే ఆ కాలిని, లేదా చెయ్యిని కోల్పోవాల్సిన తీవ్ర పరిస్థితి తలెత్తచ్చు.. కొన్నిసార్లు ప్రాణాల మీదికీ రావచ్చు. అందుకే ఒక కాలు ఎర్రబడి, వాచిపోయి, జ్వరం కూడా తోడై, నడక బాధాకరంగా తయారైనప్పుడు దాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ విస్మరించకూడదు. వెంటనే 'డీవీటీ'గా అనుమానించటం అన్ని విధాలా శ్రేయస్కరం!
ప్రమాదమేంటి?
డీవీటీతో తలెత్తే ప్రమాదాలను ప్రధానంగా రెండు రకాలుగా చెప్పుకోవచ్చు.
* ఒకటి- గడ్డ కారణంగా కాలిలో సిర మూసుకుపోయి.. చెడు రక్తం కిందే నిలిచిపోతుంది, దాంతో పాటే నీరు, ఖనిజాలు, లవణాల వంటివీ అక్కడే నిలిచిపోతాయి. దీనివల్ల మొత్తం శరీర వ్యవస్థే అస్తవ్యస్తమవుతుంది. దీని కారణంగా అత్యంత ప్రమాకరమైన 'పీసీడీ' (ఫ్లెగ్మేసియా సీరులా డోలెన్స్) అనే సమస్య తలెత్తుతుంది. ఇలా చెడు రక్తం, నీరు, ఖనిజ లవణాలవంటివన్నీ అక్కడ అనూహ్యంగా పేరుకుపోవటం వల్ల కణజాలంలో ఒత్తిడి పెరుగుతుంది, ఈ ఒత్తిడికి పక్కనే మంచి రక్తాన్ని తెస్తుండే ధమనులూ నొక్కుకుపోతాయి. దీంతో కాలికి మంచి రక్తం సరఫరా తగ్గిపోయి.. కాలు నల్లబడిపోయి.. కుళ్లిపోయే (గ్యాంగ్రీన్) ప్రమాదకర స్థితి తలెత్తుతుంది.
* రెండోది- అత్యంత ప్రమాదకరమైనది.. కాలిలోని సిరల్లో ఏర్పడిన ఆ గడ్డలను సకాలంలో చికిత్సతో కరిగించకపోతే అవి రక్తప్రసారంలో కలిసి.. మెల్లగా పైకి ప్రయాణించి.. గుండెలోకి చేరతాయి. అక్కడి నుంచి వూపిరితిత్తుల్లోకి వెళ్లి.. వూపిరితిత్తుల్లోని సన్నటి రక్తనాళాల్లో ఇరుక్కుపోతాయి. అది అత్యంత ప్రమాదకరమైన, ప్రాణాపాయ స్థితి. దీన్నే 'పల్మనరీ ఎంబాలిజం' అంటారు. ఈ స్థితిలో రోగి శ్వాస తీసుకోవటం కష్టంగా తయారవుతుంది, బీపీ బాగా పడిపోతుంది. ఇటువంటి స్థితిలో వారిని తక్షణం అత్యాధునిక సదుపాయాలున్న ఆసుపత్రిలో చేర్చి చికిత్స చెయ్యటం అత్యవసరం. లేదంటే ప్రాణాలకే ముప్పు ముంచుకొస్తుంది. అందుకే 'డీవీటీ'ని ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించటానికి లేదు.
చికిత్సలేమిటి?
డీవీటీని అనుమానించగానే అత్యాధునిక సదుపాయాలున్న ఆసుపత్రికి తీసుకువెళ్లటం ఉత్తమం. దీని నిర్ధారణ, చికిత్సల కోసం యాంజియోగ్రామ్, డాప్లర్, అవసరమైతే 'న్యూక్లియర్ మెడిసిన్' తదితర సదుపాయాలుండటం అవసరం. సాధారణంగా డీవీటీ బాధితులకు రక్తం పల్చగా ఉండేలా చూసే మందులను రక్తనాళాల గుండా ఇస్తారు. గడ్డలు వూపిరితిత్తుల్లోకి చేరాయని అనుమానిస్తే- గడ్డ కరిగించే మందులూ మొదలుపెడతారు. వీరికి కృత్రిమ శ్వాస కోసం వెంటిలేటర్ల వంటివీ అవసరమవ్వచ్చు. రోగి ప్రమాదకరమైన 'పీసీడీ' స్థితిలోకి వెళితే.. సర్జరీ చేసి పెద్ద సిరల్లోని గడ్డను తొలగించి, అవి మూసుకుపోకుండా, ప్రవాహం నిలిచిపోకుండా దగ్గర్లో ఉన్న ధమనులకు అనుసంధానించటం వంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
* కొన్ని ప్రత్యేక సందర్భాల్లో- రక్తనాళాల గుండా ఒక సూక్ష్మమైన జల్లెడ లాంటి పరికరాన్ని (ఐవీసీ ఫిల్టర్) పొత్తికడుపు దగ్గర ఉండే ప్రధాన సిరలో అమరుస్తారు. ఈ జల్లెడలు.. కాలి నుంచి లేదా తొడల నుంచి గడ్డలు పైకి ప్రయాణించకుండా, అవి గుండెలోకి, వూపిరితిత్తుల్లోకి చేరి సమస్యలు తెచ్చిపెట్టకుండా నిలువరిస్తాయి.
చాలామంది డీవీటీ బాధితుల్లో.. ప్రస్తుతానికి చికిత్సతో సమస్యను అధిగమించినా మున్ముందు కాళ్ల మీద సిరలు ఉబ్బిపోయే 'వెరికోస్ వెయిన్స్', కాళ్ల మీద మానని పుండ్లు పడటం (వీనస్ అల్సర్స్) వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. గడ్డల వల్ల సిరల్లో ఉండే కవాటాలు దెబ్బతింటాయి. దీనివల్ల కాలు-పాదాలు నల్లబారటం, ఎప్పుడూ కొద్దిగా వాచి ఉండటం, పుండ్లు పడటం వంటి సమస్యలు బాధిస్తుంటాయి. అందుకే ఒకసారి డీవీటీ బారినపడిన వారు.. వీటన్నింటినీ అధిగమించేందుకు నిత్యం కొన్ని ప్రత్యేక వ్యాయామాలు చెయ్యాల్సి ఉంటుంది.
నివారించుకునేదెలా?
కాళ్లలోని సిరల్లో ఈ రక్తపు గడ్డలు (డీవీటీ) రాకుండా ఉండేందుకు చక్కటి మార్గం... నిత్య వ్యాయామం! నడక చాలా ఉత్తమం. రోజూ 4-5 కిలోమీటర్లు నడిస్తే ఈ ముప్పు తగ్గుతుంది. గర్భిణులు, ఇటీవలే కాన్పు అయిన వారు, గర్భనిరోధక మాత్రలు తీసుకుంటున్న స్త్రీలు.. వీరంతా కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. ఒకసారి డీవీటీ బారినపడిన వారు కాళ్లు, పాదాలకు ప్రత్యేక వ్యాయామాలు కూడా చెయ్యాలి. దీర్ఘకాలంగా మంచం మీద ఉండిపోతున్న పక్షవాతం, క్యాన్సర్ బాధితులు కూడా డీవీటీ సమస్య తలెత్తకుండా జాగ్రత్తల గురించి వైద్యులతో చర్చించాలి.
* నడుస్తున్నప్పుడు కాళ్లలో నొప్పి, అసౌకర్యం వంటివి తలెత్తుతుంటే దాన్ని తేలికగా తీసుకోకుండా.. తప్పనిసరిగా వైద్యుల దృష్టికి తీసుకువెళ్లాలి.
పెరుగుతున్న ముప్పు
ఒకప్పటి కంటే ఇటీవలి కాలంలో మన దేశంలో డీవీటీ సమస్య బాగా పెరుగుతోంది. దీనికి మన జీవనశైలిలో వస్తున్న మార్పులనే ముఖ్యకారణంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ ముప్పు ఎవరికి ఎక్కువంటే-
* నడక కరవై.. కాళ్లకు, పాదాలకు తగినంత వ్యాయామం లేనివారికి
* సుదీర్ఘ విమాన ప్రయాణాల్లోగానీ, కంప్యూటర్ల ముందరగానీ గంటల తరబడి కాళ్లకు కదలికలు లేకుండా కూర్చుండిపోతున్న వారికి
* ఏదైనా జబ్బు వల్ల లేదా ఆపరేషన్ల వంటివి చేయించుకోవటం వల్ల పూర్తిగా మంచం మీదే ఉంటున్న వారికి
* గర్భనిరోధక మాత్రలుగానీ, హార్మోన్ మాత్రలుగానీ ఇష్టం వచ్చినట్టు దీర్ఘకాలంగా వాడుతున్న స్త్రీలకు
* వూపిరితిత్తులు లేదా క్లోమ గ్రంథి క్యాన్సర్లతో బాధపడుతున్న వారికి..
* ఒంట్లో రక్తం గడ్డకట్టే తత్వాన్ని పెంచే వ్యాధులతో బాధపడుతున్న వారికి..
-వీరందరికీ కాళ్లలోని సిరల్లో రక్తం గడ్డలు ఏర్పడే ముప్పు ఎక్కువగా ఉంటుంది. గర్భిణుల్లో కూడా 'డీవీటీ' వచ్చే అవకాశాలు ఎక్కువ. కాన్పు అయిన వెంటనే కూడా ఈ ముప్పు ఉంటుంది. పక్షవాతం బారినపడిన వారు చాలా సందర్భాల్లో అసలు కదలికలే లేకుండా పూర్తిగా మంచానికే అతుక్కుపోతుంటారు. అందుకే వీరిలో 'డీవీటీ' ఎక్కువగా కనబడుతుంటుంది.
* స్త్టెలు పేరుతో మడమలు చాలా ఎత్తుగా ఉండే చెప్పులు, బూట్ల వంటివి వేసుకుంటున్న వారికి కూడా, ముఖ్యంగా స్త్రీలకు ఈ డీవీటీ ముప్పు ఎక్కువగా ఉంటోంది.

0 Comments