Dyslexia , డిస్లెక్షియా-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
డిస్‌లెక్సియాతో బాధపడే అలాంటివారికి అక్షరాలను చదవటం, రాయటంలో ఇబ్బంది పడటం ,అక్షరాలు ఒక వరుసలో కాకుండా గజిబిజిగా కనిపిస్తుంటాయి. అందువల్ల పదాల్లోని అక్షరాలు అటూఇటూ మారిపోయి.. వాటిని సరిగా చదవలేక, రాయలేక ఇబ్బందులు పడుతుంటారు. అయితే డిస్‌లెక్సియా బాధితుల్లో ఇదొక్కటే కాదు. శబ్దాలను.. ముఖ్యంగా మాటలను విని అర్థం చేసుకోవటంలోనూ మెదడు తికమకపడుతుందని తాజాగా తేలింది. డిస్‌లెక్సియాతో బాధితులతో పాటు కొందరు ఆరోగ్యవంతులపైనా ఫ్రాన్స్ శాస్త్రవేత్తలు ఇటీవల ఒక అధ్యయనం చేశారు. వారి మెదడు ను స్కాన్ చేసి పరీక్షించారు. మామూలుగా మనం ఇతరుల మాటలను వింటున్నప్పుడు వాటిల్లోని శబ్దాల స్థాయికి (ఫ్రీకెన్సీ) అనుగుణంగా మెదడు కూడా సర్దుకుపోతుంది. అప్పుడే ఆ సంకేతాలను సరిగ్గా విభజించుకొని అందులోని సమాచారాన్ని గ్రహించటానికి వీలవుతుంది. లేకపోతే ఆయా మాటలను అర్థం చేసుకోవటం కష్టమవుతుంది. డిస్‌లెక్సియా బాధితుల మెదడులలో ఈ ప్రక్రియ సరిగా జరగటం లేదని.. సుమారు 30 హెర్ట్జ్స్ స్థాయిలోని శబ్దాలను గ్రహించటంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని పరిశోధకులు గుర్తించారు. మాటల్లోని సమాచారాన్ని విడమర్చి, అర్థం చేసుకోవటానికి ఈ స్థాయి శబ్దాలు చాలా కీలకం. డిస్‌లెక్సియా బాధితుల మెదదులు అధిక తీవ్రత శబ్దాలకు అతిగా స్పందిస్తున్నాయనీ తేలింది. వీరిలో జ్ఞాపకశక్తి సరిగా లేకపోవటానికి, అక్షరాలు.. మాటలను అవగతం చేసుకోలేకపోవటానికి గల కారణాలను విశ్లేషించటానికి ఈ పరిశోధన ఉపయోగపడగలదని పరిశోధకులు చెబుతున్నారు. మెదడులో శబ్దాలకు సంబంధించిన భాగంలో సమస్య మూలంగా మాటలను అక్షరాలను అర్థం చేసుకోవటంలో ఇబ్బంది కలుగుతున్నట్టు దీని ద్వారా బయటపడిందని వివరిస్తున్నారు. మున్ముందు ఈ దిశగా మరిన్ని అధ్యయనాలు జరిగితే కొత్త చికిత్స పద్ధతులు పుట్టుకురాగలవని నిపుణులు ఆశిస్తున్నారు.

0 Comments