Full Style

>

బహిష్ట లో నొప్పి , Dysmenorrhoea

స్త్రీ లలో బహిష్ట సమయం లో నొప్పి రావడాన్ని డిస్మెనోరియా (పెయిన్ ఫుల్ మెన్సెస్) అంటారు . సుమారు 50 శాతం మంది స్త్రీలు బహిష్ట సమయం లో నొప్పి తో బాధపడుతుంటారు . యుక్త వయస్సు అంటే 18 సం .ల నుండి 24 సం. ల వయసు వరకు బహిష్ట సమయం లో నొప్పితీవ్రత ఎక్కువగా ఉంటుంది . వయసు పెరుగుతున్న కొద్దీ , వివాహానంతరం నొప్పి తీవ్రత తగ్గుతుంది .


ఆడపిల్లలకు రుతుక్రమం సాధారణంగా 11 నుండి 14 సంవత్సరాల మధ్య వయసులో ప్రారంభమవుతుంది. అయితే మొదట్లో ఇవి అంత క్రమబద్ధంగా రాకపోవచ్చు. 18 సంవత్సరాల వయస్సుకు చేరుకునేసరికి చాలావరకూ క్రమబద్ధత సంతరించుకుంటాయి. అయితే తిరిగి 45-50 సంవత్సరాల వయస్సులో - అనగా ముట్లుడిగిపోయే దశలో ఇవి క్రమబద్ధంగా రావు.

రుతుచక్రం సాధారణంగా 28 రోజులకు ఒకసారి పునరావృతమవుతుంటుంది. రుతుస్రావం 3 రోజుల నుండి 7 రోజులపాటు కన్పిస్తుంది. జీవకార్యాలన్నింటినీ మనస్సు, మెదడు, హార్మోను గ్రంధులు, అవయవాలు ప్రభావితం చేస్తుంటాయి. వీటన్నింటి సమన్వయ కార్యక్రమమే జీవితం అన్న విషయం గమనార్హం. ఈ బాటలోనే రుతుక్రమాన్నీ, రుతుస్రావాలనూ కూడా- మనసు, మెదడులోని హైపోథాలమస్‌, పిట్యూటరీ గ్రంథి, అండాశయంలో ఉత్పత్తయ్యే ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టీరాన్‌ హార్మోన్లు, గర్భసంచిలో ఉత్పత్తి అయ్యే ప్రోస్టాగ్లాండిన్‌లు కలిసికట్టుగా ప్రభావితం చేస్తుంటాయి.

ముఖ్యంగా మానసిక ఒత్తిళ్ళు హార్మోను వ్యవస్థపై బలమైన ప్రభావం చూపి, రుతుచక్రాలు, రుతుస్రావాలను ప్రభావితం చేస్తుంటాయి. ఒక్కమాటలో రుతుస్రావాలు స్త్రీల మానసిక స్థితికి అద్దంపడుతుంటాయని చెప్పుకోవచ్చు.

బహిష్టు సమయంలో నొప్పిని 'డిస్మెనోరియా' అంటారు. ఈ రుతుక్రమ బాధలకు గర్భకోశం లోపలి పొరలలో ఉత్పత్తి అయ్యే ప్రోస్టాగ్లాండిన్స్‌ కారణంగా గుర్తించడం జరిగింది. గర్భకోశ కండర సంకోచాలకు ఈ రసాయనాలు సాయపడతాయి. చాలావరకూ ఈ రసాయనాలు అధికంగా ఉత్పత్తిగావటం వల్లనే బహిష్టులలో నొప్పులు, బాధలు కన్పిస్తుంటాయి.

వయస్సు మీరిన కొద్దీ ఈ బాధలు తగ్గుతుంటాయి. గర్భకోశ కండరాల సంకోచాల్లో సమన్వయం మెరుగుపడడం మూలంగా నొప్పులు తగ్గవచ్చు. అలాగే గర్భకోశ ముఖద్వారం (సర్విక్స్‌) పెద్దదిగా మారి, తేలికగా రక్తం బయటపడుతుండటం వల్ల కూడా నొప్పులు తగ్గుతుండవచ్చు.

బహిష్టు నొప్పులు ఎండోమెట్రియోసిస్‌, ఫైబ్రాయిడ్స్‌ వంటి వ్యాధుల్లో కూడా కన్పిస్తాయి. కారణం నిర్ధారణ కోసం వైద్యులను సంప్రదించడం సముచితం.

రకాలు : డిస్మెనోరియను ప్రధానం గా రెండు రకాలు గా చెప్పవచ్చును. 1 .ప్రైమరీ, 2. సెకండరీ .
ప్రైమరీదిస్మేనోరియ-- యుక్త వయస్సులోని స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుంది . పొత్తికడుపు లో తీవ్రమైన నొప్పి కాస్తుంది ... దీనికి హార్మోనుల అసమతుల్యత కారణం .
సెకండరీదిస్మేనోరియ-- వయస్సు మీరిన స్త్రీ లలో ఎక్కువగా కనిపిస్తుంది ... దీనికి " పెల్విక్ ఇన్ఫెక్షన్ , గర్భాశయ కంతులు ఉండటం కారణం .

ముఖ్య కారణాలు :--
హార్మోనుల అసమతుల్యత ,
పెల్విక్ ఇన్ఫెక్షన్ ,
గర్భాశయ కంతులు (fibroids) ,
గర్భాశయ ముఖద్వారం వంగి ఉండటం , లేదా ఇరుకుగా ఉండటం ,
ఓవరియన్ సిస్థులు (Overian Cysts),
నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలు
హార్మోనుల సమతుల్యం కాపాడడానికి పౌస్తికహారము తీసుకోవాలి ... మొలకెత్తిన విత్తనాలు , పలు ,పండ్లుఆకుకూరలు తీసుకోవాలి .
ఆధిక బరువు ఉన్నవారు బరువు తగ్గడానికు ప్రయత్నించాలి ... ప్రతిరోజూ యోగ ,వ్యాయామకు చేయాలి.
మానసిక వత్తిడి లేకుండా చూసుకోవాలి ... ధ్యానం(మనస్సు ను అదుపు ) చేయాలి .
నొప్పి తీవ్రత , రక్తస్రావం ఎక్కువగా ఉన్నప్పుడు వైద్యులను సంప్రదించి సలహా తెసుకోవాలి .
ప్రధమ చికిస్త :
సొంతం గా హాట్ వాటర్ బాగ్ పొత్తి కడుపు పైన పెట్టిన నొప్పి తగ్గును .
ఏరోబిక్ వ్యాయామము రోజు చేయడం వలన ఈ నొప్పి రాకుండా పోవును .
నొప్పి తగ్గడానికి మందులు :
Dysmen tabs . ఉదయం , సాయంత్రం .. మెన్సెస్ అయిన వెంటనే 2-3 రోజులు తెసుకోవాలి,
oral contraceptives :-- choice tabs . రెగులర్గా 3-4 cycles (౩-4 మాసాలు) వాడాలి . ovulation stop చేయడం, prostaglandins level తగ్గిండం వలన క్రామ్ప్స్ తగ్గుతాయి .
secondary dysmenorrhoea :లో కారణాన్ని బట్టి మందులు వాడాలి , అవసరమైతే D&C చేయించుకోవాలి.
మంచి డాక్టర్ ని సంప్రదించి తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది .

Post a Comment

0 Comments