Full Style

>

Overian Cancer, అండాశయంలో కలిగే కాన్సర్ ,ఒవెరియన్ క్యాన్సర్



Overian Cancer, అండాశయంలో కలిగే కాన్సర్ ,ఒవెరియన్ క్యాన్సర్-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



అండాశయంలో కలిగే కాన్సర్ ను ఆంగ్లంలో “ఒవెరియన్ క్యాన్సర్” అంటారు. ఈ క్యాన్సర్ మహిళల్లో సంభవిస్తుంది. మహిళల్లో జనన అండాలను ఉత్పత్తి చేసే మరియు హార్మోన్లను ఉత్పత్తి చేసే అండాశయంలో కలుగుతుంది.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధునిక వైద్య సదుపాయాల మూలంగా ఈ క్యాన్సర్ ను ముందుగా కనిపెడితే సులభంగా నయం చేయవచ్చు. ఈ క్యాన్సర్ లక్షణాలు :

    కడుపులో ఒత్తిడి కలిగినట్లు అనిపించడం.
    పొత్తి కడుపులో నొప్పి మరియు ఉదరభాగం లో నొప్పిగా అనిపించడం.
    కొద్దిగా అన్నం తినగానే పొట్ట నిండుగా ఉన్నదనిపించడం.
    తరచుగా మూత్రానికి వెళ్ళడం.

ఈ పైన పేర్కొన్న లక్షణాలు అనేక కారణాల మూలంగా కలగవచ్చు. కానీ ఈ లక్షణాలు తరచూ ఒక వారం రోజులకు పైగా రావడం జరుగుతుంటే మీ డాక్టర్ ను సంప్రదించాలి .

ముఖ్యంగా మీ కుటుంబంలో అంటే రక్త సంబంధీకుల్లో ఎవరికైనా వక్షాల క్యాన్సర్ (బ్రెస్ట్ క్యాన్సర్), అండాశయ క్యాన్సర్ (ఒవెరియన్ క్యాన్సర్) మరియు గుదము క్యాన్సర్ (కొలోన్ క్యాన్సర్) లాంటివి ఉంటే ఈ క్యాన్సర్ మీకు వచ్చే అవకాశం ఉంది.

మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే వయస్సు కూడా అండాశయ క్యాన్సర్ వచ్చేందుకు ప్రధాన కారణం అని నిపుణులు తెలిపారు. మహిళలు రుతువిరతి (మెనోపాస్) దశలో కూడా ఈ క్యాన్సర్ బారిన పడే అవకాశాలున్నాయి. రుతుక్రమం ఆగిపోయే సమయంలో శరీరంలో కలిగే హార్మోన్ల మార్పులకారణంగా కూడా అండాశయ క్యాన్సర్ కలిగే అవకాశం ఉంది. రుతుక్రమం నియంత్రించేందుకు వాడే మందుల మూలంగా కూడా ఈ క్యాన్సర్ కలిగే అవకాశం ఉంది. మహిళల్లో ఊబకాయం కూడా ఈ క్యాన్సర్ బారినపడేందుకు ఒక ముఖ్య కారణం అవుతుంది.

అండాశయ క్యాన్సర్ తెలుసుకోవడానికి ప్రత్యేక క్యాన్సర్ పరీక్షలేమీ లేవు. లక్షణాలుండవు కాబట్టి బాగా పెరిగిన తర్వాతే ఈ క్యాన్సర్ తెలుస్తుంది. ఇక ఈ అండాశయ క్యాన్సర్ ను నిర్ధారించేందుకు రక్త పరీక్ష, సి‌టి స్కాన్ మరియు అల్ట్రాసౌండ్ పరీక్ష ద్వారా నిర్ధారించవచ్చు. ఈ క్యాన్సర్ ముదిరిన తరువాత రక్షణ అవకాశాలు తక్కువ. కనుక దీనిని ముందుగానే గుర్తించడం ముఖ్యం. ఈ క్యాన్సర్ వస్తే ఆపరేషన్ చేసి టిస్యూస్ ను తొలగించడం ఒక్కటే మార్గం.

అండాశయం క్యాన్సర్ ముఖ్యంగా అండాశయం పై భాగంలో ఏర్పడుతుంది. ఎక్కువశాతం ఈ విధమైన క్యాన్సర్ సోకుతుంది. 1988 నుండి 2001 వరకూ గణాంకాల ప్రకారం ఈ క్యాన్సర్ బారిన పడి చికిత్స పొంది రక్షింపబడిన వారు కేవలం 89 శాతం మాత్రమే. ఈ క్యాన్సర్ కు ఆపరేషన్ జరిగిన అనంతరం తిరిగి ఈ క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా కేమో థెరపీ నిర్వహించి నియంత్రించవచ్చు. ఈ క్యాన్సర్ ఆపరేషన్ నిర్వహించి రెండు అండాశయాలను తొలగిస్తే ఆ మహిళల్లో ఋతుస్రావం వెంటనే నిలిచిపోయే అవకాశం ఉంది.

అదే విధంగా పిల్లలు లేని మహిళల్లో ఈ క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు తెలియజేశారు. పిల్లలు పుట్టకుండా నియంత్రించే మందులను వాడే మహిళల్లో కూడా ఈ క్యాన్సర్ రావచ్చని నిపుణులు తేల్చారు. తక్కువ కేలరీస్ ఉన్న ఆహారం తీసుకున్న మహిళలు ఈ క్యాన్సర్ బారినుండి బయటపడవచ్చు.

అండాశయ క్యాన్సర్‌ నిర్ధారణకు కొత్త పరీక్ష

ఇక మనదేశంలో అండాశయ క్యాన్సర్‌ నిర్ధారణ సులభతరం కానున్నది. తక్కువ ఖర్చుతో, సర్జరీ అవసరం లేని కొత్త పద్ధతిని ప్రయోగశాలల్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ పరీక్ష పేరు 'ఓవిఎ1'. ఇది ఒక రకమైన రక్తపరీక్ష. దీనికి యుఎస్‌ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ గ్రీన్‌సిగల్‌ ఇచ్చింది. క్వెస్ట్‌ డయాగటస్టిక్స్‌ ఈ పరీక్షను పరిచయం చేయనుంది. శస్త్ర చికిత్సకు ముందు అండాశయాలు పెద్దగా మారే (ఒవేరియన్‌ మాస్‌) క్యాన్సర్‌ను అంచనా వేసే వీలుంది. అండాశయ క్యాన్సర్‌ సైలెంట్‌ కిల్లర్‌ వంటిది. దీనికి సంబంధించిన లక్షణాలను వివరించడం వీలుకాదు. సాధారణ పరిస్థితుల్లో వైద్యుడు ఒవేరియన్‌ మాస్‌కు కారణం క్యాన్సర్‌ అని గుర్తించడం సాధ్యం కాదు. శస్త్ర చికిత్స ద్వారా దాన్ని తీసి పరీక్షిస్తే తప్ప. ' పొత్తి కడుపులో పెద్ద ముద్ద ఉంటే మేం అల్ట్రాసౌండ్‌, సిటి స్కాన్‌ చేయించుకోవాలని సూచిస్తాం. ఇది క్యాన్సరా? కాదా? అని నిర్ణయించడానికి ఆ ముద్ద నుంచి చిన్న ముక్కను సేకరించి టిష్యు కల్చర్‌ పరీక్ష చేస్తాం' అని సప్ధర్‌జంగ్‌ ఆసుపత్రికి చెందిన క్యాన్సర్‌ నిపుణుడు చెప్పారు. ' ఇప్పుడు శస్త్రచికిత్సకు ముందు, రక్త నమూనా ఆధారంగా ఓవిఎ1 పరీక్ష ఒవేరియన్‌ మాస్‌లో క్యాన్సర్‌ సంభ్యావతను గుర్తిస్తుంది. రెండు సార్లు సర్జరీ చేసే అవకాశాన్ని ఈ పరీక్ష నిలువరిస్తుంది. ఫలితంగా నొప్పి, శస్త్రచికిత్స ఖర్చు తగ్గడమే కాక రోగి మానసిక భావోద్వేగాలు కూడా తగ్గుముఖం పడతాయి' అని క్వెస్ట్‌ డయాగస్టిక్స్‌ ఇండియాకు చెందిన మెడికల్‌, క్లినికల్‌ ట్రయల్స్‌ సీనియర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పలట్‌ మీనన్‌ అంటారు.

    అండాశయ క్యాన్సర్‌ నివారణకు కొత్త ఔషదం

ఇటీవల కాలంలో అండాశయ క్యాన్సర్ అధికమవుతోంది. దీని నివారణకు ఔషదాలు కనుగొనే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. దీనిని 33వ యూరోపియన్ సొసైటీ ఆఫ్ మెడికల్ ఓనకాలజీలో వీటి ఫలితాలను ప్రకటించారు. దీనిపై కెనడా పరిశోధకుడు డాక్టర్ బ్రాడ్లీ మంక్ మాట్లాడుతూ, ఇప్పటికే మూడవ దశ క్లినికల్ ట్రయల్ జరుగుతోందన్నారు. ఈ వ్యాధికి ఇప్పటి వరకూ ట్రాబెక్టెడిన్ తాజా ఔషదం అవుతుంది. తాము జరుపుతున్న పరిశోధనలో ప్రయత్నాలన్నీ మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉందన్నారు. ఈ చికిత్సను అమెరికా ఫుడ్ సంస్థ చాలా జాగ్రత్తగా ఎవాల్యూట్ చేయనున్నట్లు వివరించారు. మూడోదశలో చాలా మంది రోగులపై పరీక్షలు చేస్తున్నట్లు వివరించారు. త్వరలో ఈ మందు మార్కెట్‌లోకి వస్తుందని చెప్పారు.

    అండాశయ క్యాన్సర్‌ను నివారించే మధుమేహ మాత్ర..........

టైప్‌-2 మధుమేహ చికిత్సలో వాడే మాత్ర అండాశ క్యాన్సర్‌ను నివారిస్తుందని కొత్త అధ్యయనం వెల్లడించింది. ఒక మాత్ర ఖరీదు రోజూ 8 పైసలు మాత్రమే. చాలా కాలంపాటు మెట్ఫార్మిన్‌ (Metformin)‌ మాత్రను తీసుకున్న 1600 మంది బ్రిటన్‌ మహిళల్లో అండాశయ క్యాన్సర్‌ 40 శాతం తగ్గింది. స్విట్జర్‌లాండ్‌లోని బాసెల్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఈ విషయాన్ని కనుగొన్నారు.

Post a Comment

0 Comments