ఆహార పానీయాల లోపము , జీవన విధాన తీరుతెన్నులు రోగనిరోధక వ్యవస్థను బలహీనం చేయగలవని అందరికీ తెలుసు కాని సామాజిక సంబంధిత ఒత్తిడులూ అందుకు కారణం కాగవని అనేక మందికి తెలియదు . ఉద్యోగ ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు కలిగే నెర్వస్నెస్ ఏవిధంగా ప్రభావం చూపుతుందో, పార్టీలలో ఇతర వ్యక్తుల్ని కలవడలో క్లిష్టత , వేదీకపై మాట్లాడల్సి వచ్చినప్పుడు కలిగే ఒత్తిడి రోగనిరోధక వ్యవస్థను ఏ విధంగాప్రభావితం చేస్తాయో తెలుసుకుంటే ఆశ్చర్యము కలుగుకమానదు . సామాజిక విషయాలకు మెదడు ప్రతిస్పందించే తీరు శారీరక రోగనిరోధక వ్యవస్థ ను ప్రతికూలము గా ప్రభావితం చేస్తుందని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధనలో తెలిపారు . సామాజిక తిరస్కారము వల్ల కలిగే ఒత్తిడి ఇన్‌ఫ్లమేటరీ యాక్టివిటీని పెంచుతుందని కూడా పేర్కొన్నారు .
దీర్ఘకాలిక ఇన్‌ఫ్లమేషన్ ఆస్మా, రుమటాయిడ్ ఆర్త్రైటిస్ , కార్డియోవ్యాస్కులార్ రుగ్మతలు , కొన్ని రకాల క్యాన్‌సర్లు , డ్రిప్రషన్ జబ్బులు మొదలగు వాటికి దారితీస్తుంది . మానసిక , శారీరక్ అంశాలు ఎంతో సన్నిహిత సంబంధం కలిగి ఉంటాయనడానికి ఇదో ఉదాహరణ. తరచూ తేదా దీర్ఘకాలిక ఒత్తిడి యాక్టివేషన్ వల్ల రోగనిరోధక వ్యవస్థ ప్రభావితమై విభిన్న రుగ్మతలు కలిగే అవకాశం ఉంది .

0 Comments