Full Style

>

చిన్నపిల్లల్లో కడుపు నొప్పి,Pain Abdomen in children



చిన్నపిల్లల్లో కడుపు నొప్పి- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...




పెద్దవారిలో సంభవించే కడుపు నొప్పులతో పాటు చిన్న పిల్లలో మాత్రమే తరచుగా సంభవించే వ్యాధుల గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లల విషయంలో ఒక సమస్య ఎదురవుతుంది. వారు పెద్దవారిలాగా తమ బాధను, వ్యాధి లక్షణా లను వివరించలేరు. దీని వలన వ్యాధి నిర్ధారణ, తీవ్రతలను గుర్తించడంలో ఇబ్బందులు ఎదురవడమే కాకుండా, జాప్యం కూడా జరుగే అవకాశం ఉంటుంది. ఇది ఒక్కొక్క సారి వైద్యుని దక్షతకు సవాల్‌గా పరిణమిస్తుంది.
నులిపురుగులు :
కడపులో నులిపురుగుల వల్ల తరచు కడుపునొప్పి, ఇతర సమస్యలతో బాధపడుతుంటారని, ఈ విషయంలో డాక్టర్ల సలహాపై మెబెండాజోల్‌ టాబ్లెట్లు అందించడానికి తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

అపెండిసైటిస్‌
అపెండిసైటిస్‌ నొప్పి పెద్దవారిలో వచ్చినట్లే అకస్మాత్తుగా నాభి చుట్టూ మొదలై కుడివైపు పొత్తి కడుపు భాగంలో స్థిరపడుతుంది. కడుపులో ఉండే ఒమెంటమ్‌ అనే పొర పెద్దవారిలో వ్యాధి ఇతర భాగాలకు వ్యాపించకుండా నిరోధిస్తుంది. అయితే ఈ పొర చిన్న పిల్లల్లో వృద్ధి చెందనందున వ్యాధి ఇతర భాగాలకు కూడా వ్యాపించి, వ్యాధి మరింత తీవ్రమవుతుంది. నొప్పితోపాటు వాంతులు, కొద్దిపాటి జ్వరం ఉంటాయి. ఈ కారణంగా వ్యాధి నిర్ధారణను త్వరగా చేసి శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుంది.

ఇంటస్‌ ససెప్షన్‌
సాధారణంగా ఇది చిన్న పేగుల్లో సంభవి స్తుంది. దీనిలో పేగుల్లోని ఒక భాగం మరొక భాగంలోకి టెలిస్కోప్‌ మాదిరిగా చొచ్చుకునిపోతుంది.

వ్యాధి లక్షణాలు
దీనిలో ఆహారం వెళ్లే భాగంలో మడతలుగా ఏర్పడటంతోవిపరీతమైనకడుపునొప్పి, వాంతులు అవుతాయి. వీటితోపాటు మలం రక్తంతో కూడి వెలు వడవచ్చు.బేరియం ఎనీమా అనే ఎక్స్‌రే ద్వారా వ్యాధి నిర్ధా రణ చేసి ఆపరేషన్‌ ద్వారా ఈ సమస్యను అధిగమిం చాల్సి ఉంటుంది. కొన్ని సార్లు ఎనీమా ద్వారా కూడా ఈ వ్యాధిని నయం చేయవచ్చును.

పేగుల్లో మడతలు
క్రిముల వలన పేగుల్లో మడతలు ఏర్పడే స్థితిని సాధారణంగా కడుపులో నట్టలని వ్యవహరిస్తారు. ఈ నట్టలు విపరీతంగా వృద్ధి చెంది, చిన్న పేగుల్లో అడుపడి కడుపు నొప్పికి కారణమవుతాయి. ఈ స్థితిలో కడుపు ఉబ్బటం, వాంతులు కావడం జరుగుతాయి. ఒక్కొక్కసారి వాంతిలో నట్టలు బైటికి రావడం జరుగుతుంది. రోగి వయస్సుకు అనుగుణంగా ఎదగ కుండా, నీరసంగా ఉండి, రక్తక్షీణతతో బాధపడుతుం టాడు. ఈ వ్యాధిని మల పరీక్షలు, ఎక్స్‌రేల ద్వారా నిర్ధారించి, నట్టలుపరిమిత సంఖ్యలో ఉంటే మందుల ద్వారా నయం చేయవచ్చు. వీటి సంఖ్య ఎక్కువగా ఉండి, పేగులకు అడ్డుపడుతున్నట్లయితే ఆపరేషన్‌ అవసరమవుతుంది.

మెకల్స్‌ డైవర్టికులైటిస్‌
మెకల్స్‌డైవర్టికులమ్‌ అనేది 2 శాతం మందిలో చిన్న ప్రేవులపై ఉంటుంది. ఇది అపెండిక్స్‌కు సుమారు రెండు అడుగుల దూరంలో ఉంటుంది. దీనికి ఇన్‌ఫెక్షన్‌ సోకినప్పుడు నొప్పి అపెండిక్స్‌ నొప్పి లక్షణాలనే ప్రదర్శిస్తుంది. ఏ పరీక్ష ద్వారా కూడా దీనిని గుర్తించలేము. అన్ని కేసుల్లోనూ అపెండిక్స్‌ నొప్పిఅనుకుని ఆపరేషన్‌ చేసినప్పుడు ఈ వ్యాధి బైటపడుతుంది. శస్త్రచికిత్స ద్వారా అపెండిక్స్‌ మాదిరిగానే దీనిని కూడా తొలగించాల్సి ఉంటుంది.

Post a Comment

0 Comments