నొప్పి (pain)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
ఎన్నో భిన్న రకాల గాయాల వల్ల శరీరం పొందే అనుభూతినే నొప్పి అని చెప్పవచ్చు. చాలా సందర్భాల్లో ఇదెంతో బాధాకరం గా ఉంటుంది. నిజానికి ఈ నొప్పి అనేది శరీరం అనుసరించే రక్షణాత్మక యంత్రాంగంలో భాగం. సమస్యపై సంబంధిత శరీర భాగాన్ని అప్రమత్తం చేసే ప్రక్రియ ఇది. ఏదైనా భాగంలో నొప్పి ఉందంటే అక్కడ ఏదో సమస్య నెలకొందని అర్థం. ఆ సమస్యను గుర్తించి సంబంధిత కణాజలం మరమ్మతు పూర్తయ్యే వరకు ఈ నొప్పి ఉంటుంది. నొప్పి పోయిందంటే అర్థం అక్కడ ఆ సమస్య పరిష్కారమైందని. కొన్ని సందర్భాల్లో మాత్రం సమస్య పరిష్కా రమైపోయినా నొప్పి అలానే కొనసాగే అవకాశం ఉంది. వెన్నె ముక సంబంధిత నొప్పులను ఇందుకు ఉదాహరణగా చెప్ప వచ్చు. కొన్ని సందర్భాల్లో కణజాల నష్టం లేకున్నా కూడా (మైగ్రేన్ తలనొప్పి, లో బ్యాక్ పెయిన్ లాంటివి) ఈ నొప్పులు ఉంటాయి.అందుకే నొప్పి అనేది కేవలం ఓ అనుభూతికి చెందిన ప్రక్రియ మాత్రమే కాదు. దాని వెనుక మరెన్నో కారణాలు, విశేషాలు ఉంటాయి.
-నొప్పి ఎన్నో రకాలుగా ఉంటుంది. ఏదో కారణం రీత్యా శరీరం గాయ పడిందనే అంశాన్ని ఈ నొప్పి వెల్లడిస్తుంది. చాలా సందర్భాల్లో ఈ నొప్పి రోజువారీ దినచర్యలను ప్రభావితం చేస్తుంది. వాటికి ఆటంకం కలిగిస్తుంది.
‘నొప్పి’ విశేషాలు
* ప్రపంచవ్యాప్తంగా కూడా 76.2 మిలియన్ల మంది ఏదో ఒక నొప్పితో బాధపడుతున్నారు.
* అమెరికాలో నొప్పి కారణంగా 42 మిలియన్ల మంది నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.
వివిధ రకాల నొప్పులతో బాధపడుతున్న వారిలో
* లో బ్యాక్ పెయిన్ - 27 శాతం
* తలనొప్పి / మైగ్రేన్ - 15 శాతం
* మెడనొప్పి - 15 శాతం
* ఫేసియల్ నొప్పి - 4 శాతంగా ఉన్నారు.
* తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న వారిలో అత్యధికులు 30-50 ఏళ్ళ లోపు వారే.
* తీవ్రమైన, దీర్ఘకాలిక నొప్పి కారణంగా తమ శారీరక, మాన సిక ఆరోగ్యం దె బ్బ తిన్నట్లు ఈ నొప్పులు ఉన్నవా రిలో అత్యధిక శా తం పేర్కొన్నారు.
* నొప్పి కారణం గా ప్రతీ ముగ్గురు అమెరికన్ల లో ఒకరు వారంలో 20 గంటల నిద్రను కోల్పోతున్నట్లు వెల్లడైంది.
* ఏటా ప్రపంచవ్యాప్తంగా 100 బిలియన్ ఆస్పిరిన్ మా త్రలు విక్రయం కావడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.
నొప్పి తగ్గించుకునేందుకు కొన్ని చిట్కాలు
* నొప్పిని నిర్లక్ష్యం చేయడం, విస్మరించడం సమస్యకు పరిష్కారం కాదు. దాన్ని గుర్తించి, అందుకు కారణాలేంటో తెలుసుకోవాలి. నొప్పిని తట్టుకునే, ని వారించే మార్గాలేంటో చూడాలి.
* చికిత్స కంటే కూడా నివారణే మేలు అనే సూత్రం ఇక్కడ కూడా వర్తిస్తుంది. తీవ్రమైన నొప్పులను నిర్లక్ష్యం చేయడం మునుముందు ఎంతో ప్రమాదకరం అవుతుంది. ఒకే రకమైన వ్యాధి/ లక్షణాలు ఉన్నప్పటికీ ఒక్కో వ్యక్తికి ఆ నొప్పి ఒక్కో విధంగా ఉంటుంది. అందరికీ ఒకే విధమైన చికిత్స పని చేయకపోవచ్చు. ఇంట్లో పాటించే చిట్కాలు పని చేయకపోతే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
ముఖ్యమైనచిట్కాలు
* కొన్ని రకాల దీర్ఘకాలిక, తీవ్రమైన నొప్పులకు శ్వాస వ్యాయామాలు, యో గా, ధ్యానం ఉపశమనం కలిగించగలుగుతాయి.
* ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. కుటుంబంలో, సమాజంలో ఒంటరి అని భావించవద్దు. అదే రకమైన నొప్పులతో బాధపడేవారితో స్నేహం పెంచుకోవాలి. వారి నుంచి మీకు అవసరమైన సమాచారం, చిట్కాలు పొందే అవకాశం కూడా ఉంటుంది.
* వివిధ రకాల హాబీలను అలవర్చుకోవాలి. సంగీతం, రిలాక్స్ కావడం, ఒత్తిడి తగ్గించుకునే విధానాలు లాంటివి మీ నొప్పిని సగం మేర తగ్గిస్తాయి.
* పీఎంఆర్: ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్: కండరాలను స్ట్రెచ్ చేయడం, రిలాక్స్ చేయ డానికి సంబంధించిన ప్రక్రియ. ఒత్తిడి తగ్గిన భావనను కలిగిస్తుంది.
* ‘విజువలైజేషన్’: మనస్సులో ఎంతో ఆహ్లా దాన్ని ఊహించుకోవడం ద్వారా నొప్పి నుంచి కొంత ఉపశమన భావన పొందవచ్చు. పూల తో నిండిన ఉద్యాన వనంలో పక్షుల ధ్వనులు వింటున్నట్లుగా, జలపాతం చూస్తున్నట్లుగా, చల్లటి గాలి తాకుతున్నట్లుగా ఊహించుకోవ డం కొంత ఉపశమనాన్ని అందిస్తుంది. మీకు బాగా నచ్చిన సందర్భాలను గుర్తు చేసుకోవ డం లాంటివన్నీ నొప్పి భావనని కొంతమేర తగ్గించుకునేందుకు తోడ్పడు తాయి.
* గైడెడ్ ఇమేజినరీ / మెంటల్ ఇమేజరీ రిలాక్సేషన్: ఒత్తిడిని తగ్గించేందుకు, నొప్పి నుంచి ఉపశమనం కలిగించేటందుకు తోడ్ప డే మరో చిట్కా ఇది. సానుకూల, ఒత్తిడిని త గ్గించుకునే రీతిలో ఊహించుకోవడం ఇందు లో ప్రధానం. ఇదో రకమైన మానసిక చికిత్స. ‘అంతా మనస్సులోనే ఉంది’ అని చెప్పే మాటలు ఇక్కడా వర్తిస్తాయి. నొప్పి అనే భావనను మనస్సులో నుంచి తొలగించుకోవాలి.
* జీవనశైలి: నొప్పిని తగ్గించుకునేందుకు తోడ్పడే, ఆరోగ్యదాయక జీవనశైలిని అను సరించాలి.
1. ఏ పనీ చేయకుండా ఉండడం లేదా కేవలం గంటల తరబడి కూర్చొని చేసే పనులనే చేయవద్దు. శారీరక వ్యాయామం శరీరానికి తగిన ఫిట్‌నెస్‌ను అంది స్తుంది. లిఫ్ట్ ఉపయోగించేందుకు బదులు మెట్లు ఎక్కడం, దిగడం అలవాటు చేసుకోవాలి. మార్నింగ్ / ఈవినింగ్ వాక్ చేయాలి. ఎక్కువ సేపు ఒకే పనిని చ ేస్తూ కూర్చోవద్దు. మధ్యమధ్యలో తిరగడం చేయాలి.
2. ఏ విషయంలోనైనా అతి మంచిది కాదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. వ్యాయామం మంచిదే అయినా అది కూడా ఓ పరిమితిలో నిపుణుల సలహా మేరకు ఉండాలి. దీర్ఘకాలిక, తీవ్ర నొప్పులు ఉన్నవారు తాము చేయాల్సిన వ్యా యామాల విషయంలో డాక్టర్ సలహా తీసుకోవాలి. వ్యాయామం చేయదల్చిన వారు మొదట చిన్న చిన్న వ్యాయామాలను చేస్తూ క్రమంగా చేసే సమయాన్ని, వ్యాయామాల స్థాయిని పెంచుకోవాలి.
3. మద్యానికి, ధూమపానానికి దూరం: చాలా మంది ఒత్తిడి తగ్గించుకుందా మని భావిస్తూ మద్యపానం, ధూమపానం చేస్తూ క్రమంగా వాటికి బానిసలుగా మారిపోతారు. ఫలితంగా కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఒత్తిళ్ళు మరింత పెరుగుతాయి. ధూమపానం రక్తప్రసరణను తగ్గిస్తుంది. అందువల్ల నొప్పి మ రింత పెరుగుతుంది. మద్యపానం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను కన బరుస్తుంది.
4. కూర్చొనే భంగిమ: వీపు వంచకుండా ని టారుగా కూర్చోవడం బ్యాకేక్ (వెన్నునొప్పి) ని తగ్గిస్తుందనేది అపోహ మాత్రమే. నిజానికి అ ది వెన్నునొప్పిని పెంచుతుంది. ‘వెన్నెముక త నదైన సొంత వంపును కలిగి ఉంటుంది’. మనకు తెలియకుండానే మనం ఆ భంగిమలో కి వెళ్ళిపోతాం. ఒకే విధంగా లేదా కదల కుం డా ఎక్కువ సేపు కూర్చోవద్దు. కుర్చీలో కూ ర్చొన్నప్పుడు రిలాక్స్‌డ్‌గా కూర్చోవాలి. మీ వెన్నెముక కుర్చీని పూర్తిగా తాకేలా ఉండాలి.
5. పరుపులు: పరుపుపై పడుకోవడం అనే అంశం కూడా పెయిన్ మేనేజ్ మెంట్‌లో ఎంతో కీలకమైంది. బాగా గట్టిగా ఉండేవి లేదా బాగా మెత్తగా ఉండేవి వెన్నెముకకు మంచివి కావు. కాస్తంత దృఢంగా ఉండే పరుపుపై, సరైన భంగిమలో నిద్రించడం ముఖ్యం.
6. బరువైన వస్తువులు లేపేటప్పుడు వెన్నె ముకను పూర్తిగా వంచవద్దు. దానికి బదు లుగా మోకాళ్ళను వంచడం మంచిది.
7. స్థూలకాయం కూడా తీవ్ర, దీర్ఘకాలిక నొప్పులకు కారణమవుతుంది. శరీరం ఫిట్ నెస్‌గా ఉండడం, సమతుల ఆహారం తీసు కోవడం కూడా ఎంతో ముఖ్యం.
8. కామోమైల్ టీ అనే మూలికా ఉత్పాదన మజిల్ రిలాక్సింగ్‌కు ఎంతో తోడ్పడుతుంది. నిద్ర బాగా పట్టేందుకు ఉప కరిస్తుంది. రోజుకు ఒక కప్పు కాఫీ మెదడును ఉల్లాసవంతంగా ఉంచేందుకు మంచిదే అయినా ఎక్కువ తాగితే మాత్రం నొప్పిని అధికం చేస్తుంది.
9. హాట్, కోల్డ్ ట్రీట్‌మెంట్స్: నొప్పి ఆరంభస్థాయిలో ఉన్నప్పుడు, 48 గం టల్లోగా, కోల్డ్ ప్యాక్ మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. అది వాపును తగ్గిస్తుంది. ఆ తరువాత మాత్రం మజిల్ రిలాక్సింగ్ ప్రక్రియల్లో హాట్ ప్యాక్స్ / హాట్ ప్లేట్స్ ప్రక్రియ మంచిది.
10. ఎర్గోనామిక్స్: నేడు ఆక్యుపేషనల్ పెయిన్ (వృత్తినిర్వహణపరంగా వచ్చే నొప్పులు) ఎంతో సాధారణమైపోయాయి. సరైన భంగిమలో కూర్చొని పని చేయడం ఎంతో ముఖ్యం. కంప్యూటర్‌ను సరైన విధంగా, సౌలభ్యంగా ఉండే విధంగా అమర్చుకోవాలి. ఎక్కువసేపు కూర్చొని పనిచేయకుండా కాస్తంత విరామం తీసుకొని లేచి నడవడం వంటివి చేయాలి.
11. వెన్నెముకను సరైన రీతిలో ఉంచుకునేందుకు, సపోర్ట్ ఇచ్చేందుకు వీలు గా బ్యాక్ సపోర్ట్ బెల్ట్‌లను ఉపయోగించవచ్చు.
-Dr.P.vijyanad ,Director Akshan pain management clinic -Hyderabad.(Surya news paper)
Allopathic Treatment :
Tab. Dolomed-MR (ibuprfen+paracetamol)-- or
Tab. Acelonac-p (Aceclofenac+paracetamol)-- or
Tab.Trim (Tramadol+paracetamol)--or
పై మాత్రలలో ఏదో ఒక రకము రోజుకు రెండు చొప్పున్న వాడాలి . తాత్కాలికము గా నొప్పి తగ్గును . తరువాత నొప్పికి కారణము తెలుసుకొని తగిన చికిత్స పొందాలి.

0 Comments