సుగంధ ద్రవ్యాలు-అవగాహన - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
Introduction :
మంచి వాసనను సువాసన, పరిమళము, సుగంధం అంటారు. పువ్వులు రకరకాలైన సువాసనలను వెదజల్లుతాయి. ఎనిమిది రకాల సువాసనలను అష్టగంధాలు అని పేర్కొంటారు.
అష్టగంధాలు:
కర్పూరం
కస్తూరి
పునుగు
జవ్వాజి
అగరు
పన్నీరు
అత్తరు
శ్రీగంధం
సుగంధ ద్రవ్యాల ఉపయోగం క్రమంగా పెరుగుతుంది. ధనిక, పేద అని తేడా లేకుండా పెర్‌ఫ్యూమ్స్ వాడుతున్నారు. ఏ పార్టీకి వెళ్ళినా, శుభకార్యాలకు వెళ్ళినా అక్కడి ఆవరణం అంతా పెర్ ఫ్యూమ్ వాసనతో నిండిపోతుంది. ఇకపోతే Lifts లో గాలికి బదులు సెంట్ వాసనలను ఆస్వాదిస్తుంది ముక్కు. ఒక పెర్‌ఫ్యూమ్ వలన అనేక వ్యాధులు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
Side effects :
సెంట్స్ కారణంగా కొన్ని రకాల అలర్జీలు, కాంటాక్ట్ డర్మటైటిస్, ఎగ్జిమా అనే చర్మ వ్యాధులు, మైగ్రేన్ తలనొప్పులు విపరీతంగా పెరుగుతున్నాయని వారు చెబుతున్నారు. ఇంగ్లాండ్‌లోని క్యాంటర్ బరీ కెంట్ ఛాసర్ హాస్పటల్‌కు చెందిన చర్మవైద్య నిపుణులు డాక్టర్ సుసానా బ్యారన్ సెంట్స్ ఉపయోగించే సమయంలో అవి చర్మానికి తగలడం, వాటి వాసనతో అలర్జీలు, మైగ్రేన్ తరహా తలనొప్పుల తో పాటు అనేక రకాల చర్మవ్యాధులు వస్తువులున్నాయని పేర్కొన్నారు.
కొందరు వ్యక్తులు తమ ప్రైవేట్ పార్ట్ వద్ద సుగంద ద్రవ్యాలను ఉపయోగిస్తుంటారు. వాళ్ళు తమ అండర్ గార్మెంట్స్ వద్ద టాల్కం పౌడర్ వంటివి జల్లుకుంటారు. అయితే ఆ ప్రదేశంలో సుగంధ ద్రవ్యాలను ఉపయోగించడం కంటే ప్రతిరోజూ శుభ్రంగా స్నానం చేయడం, ఎప్పటి కప్పుడు ఫ్రేష్ అండర్ గార్మెంట్స్ తొడుక్కోవడమే ఆరోగ్యకరం అంటున్నారు నిపుణులు.
Uses :
నిత్య జీవితంలో సువాసనలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా ఇవి మన నాడీ వ్యవస్థను ఉత్తేజితం చేస్తాయి. చిటికెలో మన మనస్సులోని ఆలోచనలు మార్చేస్థాయి. అప్పుడప్పుడు మనం ఒత్తిడికి గురౌతుంటాం. డిప్రెషన్ అవుతుంటాం అలాంటప్పుడు మంచి వాసనలు చూడడం వల్ల మన శరీరంలోని సువాసనలతో మనం చేసే పనుల్లో మనసును కేంద్రీకరించగలుగుతాం. మంచి సువాసనలు రెండు రకాలుగా ఉపయోగిస్తాం. మొదటి రకం శరీరంపై ఉపయోగిస్తే, రెండవది పరిసర ప్రాంతాలను వాతావరణాన్ని పరిమళ భరితం చేసేవి. శరీరం విషయంలో చాలా మంది ఒకే రకమైన సంట్ ను తరచూ వాడుతుంటారు. దీన్ని బట్టి వాళ్ల వ్యక్తిత్వాన్ని గుర్తించవచ్చు. వాళ్లు ఎలాంటి ఆశయాలు కలిగినవాళ్ళ?మొదలైన విషయాలను వాళ్లు ఉపయోగించి సుగంధాలతో తెలుసుకోవచ్చు. ఫ్లోరల్: ఇందులో మీకు రకరకాల సంప్రదాయ పుష్పాల సుగంధాలు వస్తాయి. ఇది మనషి మెదడులో స్త్రీ సంబంధ ఆలోచనలను కలిగిస్తాయి. వీటిలో గులాబీ, మల్లెపూల సువాసనలు ఎక్కువ జనాదరణ పొందాయి. గ్రీన్: రోజ్ మెరీ, చామోమిలీ, యూకలిప్టస్ ఎక్కువ ప్రజాదరణ పొందినవి, వీటిని ఉపయోగించి రిలాక్సింగ్, బాతింగ్ ఆనందాన్ని పొందవచ్చు. కాబట్టి గ్రీన్ సువాసనలు అందరికీ ఉపయోగకరంగా ఉంటాయి....
ఉపయోగించడంలో అవగాహన(Hints in use of Scents of perfumes) :
సాధారణంగా పెర్‌ఫ్యూమ్స్ సువాసనను మెచ్చని వారుండరు. శుభ కార్యాలు, ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే కొందరు మహిళలు పెర్‌ఫ్యూమ్స్ ఉపయోగిస్తారు. అయితే పెర్‌ఫ్యూమ్స్‌ను ఉపయోగించడంలో కూడా సరైన అవగాహన ఉండాలి. ముఖ్యంగా వేసవిలో పెర్ ఫ్యూమ్ స్పెల్ ఎక్కువ సేపు ఉండాలా జాగ్రత్తపడాలి. వేసవిలో మన శరీరం గురించి వ్యక్తిగతంగా జాగ్రత్త తీసుకోకపోతే చాలా ఇబ్బంది కరంగా ఉంటుంది. వేసవిలో రోజుకు కనీసం రెండు సార్లైనా స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత పెర్ ఫ్యూమ్ లేదా డియోడరెంట్ వంటివి రాసుకోవాలి. చాలా మంది నేచురల్ డియోడరెంట్స్ ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. నేచురల్ గా దొరికే ఎసెన్సియల్ ఆయిల్స్ లేదా ఎక్సాస్ట్ మంచి సువాసనలు కలిగి ఎక్కువ సేపు నిలిచి ఉంటాయి. ఇవి చెడువాసనలు రానీయకుండా కాపాడుతాయి.
సువాసనలు ఎక్కువ సేపు నిలిచి ఉండాంటే పాటించాల్చిన పద్దతులు(Hints for long sustainance of smell) :
1. పెర్ ఫ్యూమ్ కానీ, డియోడరెంట్స్ కానీ ఉపయోగించే ముందు బాటిల్ ను బాగా షేక్ చేయాల్సి ఉంటుంది.
2. పెర్ ఫ్యూమ్ ను డైరెక్ట్ గా చంకల క్రింద వాడకూడదు. మీరు డ్రెస్ ధరించిన తర్వాత స్పే చేసుకోవడం వల్ల ఎక్కువ సమయం తాజాగా సువాసనతో నిలిచి ఉంటుంది.
3. మీరు డియోడరెంట్ రోలర్ ను ఉపయోగించినట్లైతే, శరీరం మీద తేమ లేకుండా చేసుకోవాలి. తర్వాత దుస్తులను ధరించాలి.
4. డియోడరెంట్స్ ఇరవై నాలుగు గంటలు శరీరానికి రక్షణ కల్పిస్తుంది. .
పెర్ ఫ్యూమ్స్ ,సెంట్స్,సుగంధ ద్రవ్యాలు వాడేవారికి కొన్ని జాగ్రత్తలు(Precautios for users of Scents of Perfumes) :
1. శరీరంలో బ్యాక్టీరియాను తొలగించడానికి రోజుకు కనీసం రెండు సార్లైనా స్నానం చేయాల్సి ఉంటుంది. శరీరంపై పడే దుమ్ము ధూలి నుండి ఏర్పడ బ్యాక్టీరియా, క్రిములు దుర్వాసన ఏర్పడటానికి కారణం. ఆ దుర్వాసనను తొలగించడానికి వేడినీళ్ళతో స్నానం చేయడం కంటే గోరు వెచ్చని లేదా చల్లని నీటితో స్నానం చేయాలి. వేడి నీళ్ళతో స్నానం చేయడంతో ఆ వేడికి శరీరంలో మళ్ళీ చెమట పడుతుంది.
2. చెమటలు పట్టించేలా ఉండే దుస్తులను ధరించకపోవడమే మంచిది. పాలిస్టర్, థిక్ ఫ్యాబ్రిక్ దుస్తులు వేసుకోకూడదు. వీటి ద్వారా చెమట తొందరగా పడుతుంది.
3. వేసవిలో కాటన్ దుస్తులు ధరించడం ఉత్తమం. చెమట పట్టినా కూడా కాటన్ దుస్తులు చెమటను పీల్చుకొంటాయి.
4. డియోడరెంట్ రోలర్ ను ఉపయోగించేట్లైతే టాల్కమ్ పౌడర్ ను కూడా అప్లై చేస్తే సుగంధపరిమళాల వాసనలు ఎక్కువ సేపు నిలిచి ఉంటాయి.
5. చంక క్రింది ఎప్పటికప్పడు హెయిర్ ను తొలగిస్తుండాలి. లేదంటే చెమటకు బ్యాక్టీరియా చేరి దుర్వాసను పెంచుతుంది.
6. డియోడరెంట్ వాసనలు ఎక్కువ సేపు నిలిచి ఉండాలంటే స్నానానికి ముందే చంకల కింద టూత్ పేస్ట్ అప్లై చేసి, పది నిమిషాల తర్వాత స్నానం చేస్తే సరిపోతుంది.
7. ఫుల్ స్లీవ్స్ లేదా ఫుల్ షర్ట్స్ ధరిస్తున్నట్లైతే పెర్ ఫ్యూన్ దుస్తులపై పూర్తిగా అప్లై చేసుకోవాలి.
8. పన్నీటిలో సువాసన కలిగిన పెర్‌ఫ్యూమ్‌ను ఒకటి రెండు చుక్కలు కలిపి, శరీరం మీద చల్లుకోవచ్చు.
9. పెర్‌ఫ్యూమ్ కొనబోయేముందు ఆ పెర్‌ఫ్యూమ్‌ను చేతిమీద రాసుకుని, ఆ వాసన నచ్చిందా, అది తమ చర్మానికి పడిందా అని చెక్ చేసుకోవాలి. పెర్‌ఫ్యూమ్ వాసన మారకుండా అలాగే ఉంటే, ఆ పెర్‌ఫ్యూమ్‌ను ఉపయోగించవచ్చు.
10. పెర్‌ఫ్యూమ్ సువాసనలో తేడాలుంటాయి. రకరకాల మూలికలతోనూ, పరిమళాల పుష్పాలతోనూ, సుగంధాలు కలిగిన ఆకులతోనూ కూడా పెర్‌ఫ్యూమ్స్‌ను తయారుచేస్తారు. స్త్రీలకు, పురుషులకు ప్రత్యేకంగా తయారు చేయబడిన పెర్‌ఫ్యూమ్స్‌ను వాడటంవల్ల సువాసన కాకుండా దుర్వాసన కలుగుతుంది. అంతే కాకుండా చర్మానికి ఎలర్జీ కలుగుతుంది. ఎవరి శరీరతత్వాన్ని బట్టి వారు, చర్మానికి సరిపడే పెర్‌ఫ్యూమ్‌ను ఎన్నుకోవాలి. అంతే కానీ, తోటివారు ఉపయోగిస్తున్నారు కదాని, దాన్నే వాడకూడదు.
0 Comments