వయసు తో నిమిత్తము లేకుండాఆ వచ్చే వ్యాధుల్లో కీళ్ళా నొప్పులు (Osteoarthritis ) ప్రధానమైనది . కాకపోతే వయసు పైబడిన వారిలో ఈ సమస్య కాస్త ఎక్కువగానే ఉంటది . మొత్తం గా చూస్తే నూటికి 90 శాతము ఏదో ఒక దశలో కీళ్ళనొప్పులతో బాధపడేవారే . జన్యుపరమైన వ్యాధుల్లో ఇదొకటి . శరీరములో ఉన్న కొన్ని ఇన్‌ఫెక్షన్‌ల వల్ల వచ్చే -- ఇన్‌ఫెక్టివ్ ఆర్థరైటిస్ , సోరియాటిక్ అర్థ్రైటిస్ , ప్రమాదలవలన వ్చ్చే - పోస్టు ట్రమాటిక్ ఆర్థరైటిస్ లు ఈ కీళ్ళ నొప్పులకు కారణమవుతాయి .
లక్షణాలు :
కీళ్ళు బిగుసుకు పోవడం ,
నొప్పి ,
కదలలేకపోవడం ,
కీళ్ళ వాపు ,
నేడు రుమాటాయిడ్ ఆర్థరైటిస్ అధికంగా భారతీయులను బాధిస్తుంది. ఇది కీళ్లలో మంటను ప్రేరేపిస్తుంది. కండరాల మధ్య జిగు రుపదార్థాన్ని హరించేస్తుంది. ఈ జిగురుకు ప్రత్యామ్నాయం లేదు. కీళ్ల నొప్పి క్రమేపీ మిగతా శరీర అవయవాలైన హృద యం, ఊపిరితిత్తులు, కళ్లపై ప్రభావాన్ని చూపిస్తుందని కలకత్తా లోని అపోలో హాస్పి టల్ సిీనియర్ కన్సల్టెంట్ డా. బుద్ధదేవ్ ఛటర్జీ తెలియజేశారు.
బైయాలజీస్, ఎంబ్రెల్ మందులు
గీతాషా ఢిల్లిలో సొంతంగా వ్యాపారం చేస్తుంది. గత ముప్ఫై సంవత్సరాలుగా కీళ్ల రోగంతో బాధపడుతుంది. ఒక్కోసారి తలుపు గెడకూడా తీయలేదు. సీసామూత తీయాలన్నా కష్టమే. చివరికి ఢిల్లిలోని ఇంద్రప్రస్థ వైద్యులు డా.ఎస్.జె. గుప్తా సలహా మేరకు 'నాన్ స్టీరో డియల్ ఏంటి ఇన్‌ఫ్లమ్మేటరీ' మందులను వాడు తుంది. ఇవేకాక, 'డిసీజ్ మాడిఫైయింగ్ ఏంటీ రుమాటిక్ మందులను వేసుకుంటుంది. ఇవి శ్వాశత పరిష్కారం కావు. తాత్కాలికంగా బాధ ను నివారిస్తాయి. బైయాలజీస్, ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్‌ను టార్గెట్ చేస్తుంది. ఎంబ్రెల్ అనే మందుతో కొంత ఉపశమనం కలుగుతుంది. ఇది ఇంజెక్షన్‌లో కూడా లభిస్తుంది. ఇప్పుడు ఈ ఇంజెక్షన్ల కారణాన గీతాషా తన పనులు కీళ్ల బాధలేకుండా చేసుకుంటుంది. వీటిని వాడితే పెయిన్ కిల్లర్స్ వాడనవసరం లేదు.
కాదెవరూ ఈ బాధకు అనర్హులు!
రుమాటైయిడ్ ఆర్థరైటిస్ బాధితులు వ్యాధి వచ్చిన రెండు సంవత్సరాలలోపే బైయాలజీస్ వాడాలి. లేకపోతే జాయింట్స్‌ను విపరీతంగా బాధకు గురిచేస్తుంది. 'ఆర్థరైటిస్ ఫౌండే షన్ ఆఫ్ ఇండియా' చైర్మన్ డా. సుశీల్ శర్మ, ''భారత్‌లో జనాభాలో ఒక శాతం ఆర్థరై టిస్ బాధితులే'' అంటారు. ఇది కేవలం వృద్ధు లనే బాధిస్తుందనేది అపోహ. ఢిల్లిలోని ప్రకాష్ మాధూర్ 16, బాస్కెట్ బాల్ క్రీడాకారుడు కీళ్లనొప్పుల బాధితుడే. ముందు తనకు ఆటలో గాయం అయివుంటుందని అశ్రద్ధ చేశాడు. క్రీడా మైదానికి నడిచి వెళ్లలేక పోయేవాడు. చివరికి రక్త పరీక్ష ఎక్స్‌రేలలో 'ఏంకీలోసింగ్ స్పాండిలైటిస్' గానిర్థారించారు. ఇది 20-40 వయస్సులోని పురుషులలనే ఎక్కువగా బాధిస్తుంది. పిల్లలకు తక్కువ నొప్పులు కలుగుతాయి.
రుమాటాయిడ్ ఆర్థరైటిస్‌ను అశ్రద్ధ చేస్తే స్త్రీలలో 10 సంవత్సరాలు పురుషులలో ఏడు సంవత్సరాలు జీవనకాలం తగ్గుతుంది. ఆధు నిక వైద్యం కారణాన వంద రకాల ఆర్థరైటిస్‌కు నేడు డాక్టర్లు చికిత్స కనుగొన్నారు.
ముంబైలోని గృహిణి కావేరీకి ఎడమ కాలు కీళ్లు రెండు సంవత్సరాలుగా బాధిస్తుంది. ఆమె తల్లికి ఆస్టియో ఆర్థరైటిస్. కావేరీ తల్లి బాధితురాలు కనుక, ఆమె ముందు జాగ్ర త్తలు తీసుకొంది. న్యూ ఢిల్లిలోని మ్యాక్స్ హెల్త్ కేర్ లోని డా. ఎస్.కె. ఎస్. మార్య, చీఫ్ ఆర్థో పెడిక్స్, జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జరీ ఏమంటారంటే, 'వృద్ధాప్యం, ఊబకాయం, కుటుంబ చరిత్ర ఆర్థరైటిస్‌కు దారి తీస్తాయి. పురుషులలో ఆల్కహాల్, ధూమ పానం, స్త్రీలలో ముందుగానే మెనోపాజ్, అమెనోరియా వస్తే ఆర్థరైటిస్ బాధకు లోనవుతారు.''
నివారణ
జీవనసరళిని మార్చుకోవాలి. స్త్రీలు వంట గదిలో ఎక్కువసేపు నిలబడరాదు. కీళ్లకు నొప్పి కల్గించే పనులు చేయరాదు. ఫిజియో ధెరపీ, ఆహారంలో మార్పుకొంత వరకు నొప్పి నివా రణకు తోడ్పడ తాయి. రోజూ తేలి కపాటి వ్యాయా మం చేస్తే మంచి దంటారు. ... ముంబైలోని హిందూజా నేష నల్ హాస్పిటల్ వైద్యులు డా. సి. బాలకృష్ణన్.
మందులు
కీళ్ల నొప్పికి అనాల్జసిక్స్‌ను వాడాలి. ఎన్‌ఎస్ ఎయిడ్(NSAIDS) పిల్స్ వల్ల రోగ నివారణ కలగకపోతే క్రీమ్‌ను వాడాలి. మాంట్రియల్ లోని ఆర్థరైటిస్ సెంటర్ ప్రొఫెసర్ డా. జీన్ పీర్రే పెల్లెటైర్ ఎంజైమ్స్ పై శ్రద్ధ వహించారు. హిప్‌ను మార్చటం ద్వారా నొప్పినివారణ కలుగుతుందని ముంబై ఆర్థోపెడిక్ సర్జన్ డా. నిరాద్ వెంగ్ సర్కార్ తెలియజేస్తున్నారు. వృద్ధులలో హిప్ మార్చితే 10 నుండి 12 సం త్సరాల దాకా ఫరవాలేదు. యువతకు 'ఆర్టిక్యులర్ సర్ఫేస్ రీప్లేస్‌మెంట్' మంచిది. ఈ చికిత్సలో కేవలం హిప్ సాకెట్, ఫెమూర్ నిర్మూలిస్తారు.
ఆస్టియోనెక్రోసిస్
ఎముకకు రక్త ప్రసారణ ఆగిపోతే ఆస్టియోనె క్రోసిస్ వస్తుంది. క్రమేపీ ఆర్థరైటిస్ కు దారితీస్తుంది. యోగ, హైడ్రోధెరపీ తాత్కా లికంగా ఉపశమనాన్ని కలుగజేస్తాయి.
మెటల్ -ఆన్-మెటల్ చికిత్స
ముఖ్యంగా క్రీడాకారులు యువతకు ఈ చికిత్స సరైనది. గర్భిణీలకు ఇది వాంఛ నీయం కాదు. పుట్టబోయే బిడ్డకు ఈ చికిత్స హాని చేస్తుంది. వీరికి సిరమిక్ -ఆన్-సిరమిక్ చికిత్స మేలు. అయితే ఇది ఖర్చుతో కూడు కున్నది. నాగపూర్‌లోని వ్యాపారి బల్చీర్‌సింగ్ రేణుకు 2004లో ఆస్టియో ఆర్థరైటిస్ అని డాక్టర్లు గుర్తించారు. ఆపరేషన్‌కు భయపడి, చికిత్స చేయించుకోలేదు. చివరికి నొప్పి తీవ్రమై నించోలేకపోయాడు. ఆపరేషన్ గత్యం తరమై ఇప్పుడు కోలుకున్నాడు. అయితే బ్యాడ్‌మింటన్ ఆటకు గుడ్ బై చెప్పాడు. కలకత్తాలోని ప్రొ. చక్రవర్తికి కీళ్ల నొప్పులు షడ్ష్థŠీఙ పోలీధైపాన్, కోబాల్డ్ క్రోమ్ ఎల్లాయ్ చికిత్సతో నొప్పినివారణ కల్గింది.
కంప్యూటర్ చికిత్స
టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుచున్న ఈ రోజుల్లో కంప్యూటర్ నేవిగేషన్ ద్వారా, రోటే టింగ్ ప్లాట్‌ఫాం హైప్లెక్స్ డిజై న్ల కారణాన నేడు చికిత్స కష్టంకాదు. నొప్పి లేకుండా మేడమెట్లు ఎక్కగలరు, తమ పనులను వారు యధావిధిగా నిర్వహించుకుంటున్నారు. బస్‌లలో ్ఘŸిలి ఉ్శ చేయగలుగుచున్నారు.
ఆయుర్వేద చికిత్స
శిరోధార చికిత్సలో మెడికేటెడ్ ఆయిల్‌ను చుక్కలు, చుక్కలుగా తలపై ధారవిడుస్తారు. కీళ్లకు ప్యాక్‌లు, హెర్బల్ పేస్ట్ ఉపయోగిస్తారు. మషాలాలు, నూనె, ఉప్పు తక్కువగా ఆహా రం తీసుకోవాలి. కీళ్ల వ్యాధిని బట్టి, హెర్బల్ మందులు, నూనెలు మారతాయి. వీటి ద్వారా కూడా బాధితులకు ఉప శమనం కలుగుతుంది.
రుమటాయిడ్ ఆర్త్థ్రెటిస్‌తో క్యాన్సర్ ముప్పు(Eenadu sukhibhava)
లింఫ్ గ్రంథుల్లో ఏర్పడే క్యాన్సర్లకు (లింఫోమా) రుమటాయిడ్ కీళ్లనొప్పులకూ సంబంధం ఉందా? అవుననే అంటున్నారు స్వీడన్ పరిశోధకులు. ముఖ్యంగా తీవ్రమైన రుమటాయిడ్ ఆర్త్థ్రెటిస్ కీళ్లనొప్పులతో బాధపడేవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుందని చెబుతున్నారు. పైకి కనిపించని వాపు లక్షణాలు, రోగ నిరోధక శక్తిని అణచేందుకు ఇచ్చే మందులు, జన్యు, పర్యావరణ సంబంధ అంశాల వంటివన్నీ ఈ క్యాన్సర్లకు దోహదం చేస్తున్నాయని వివరిస్తున్నారు. రుమాటాయిడ్ కీళ్లనొప్పుల వల్లనే లింఫోమా ముప్పు ముంచుకొస్తుందా? ఇతరేతర అంశాలేవైనా కారణమవుతున్నాయా? అనేది తెలుసుకోవటానికి 6,745 మంది వివరాలను ఇతరులతో పోల్చి చూశారు. రుమటాయిడ్ కీళ్లనొప్పులు ఉన్నట్టు గుర్తించిన తర్వాతనే లింఫోమా బారిన పడుతున్నవారి సంఖ్య మిగతావారిలో కన్నా అధికమని గుర్తించారు.
0 Comments