రుమటాయిడ్ హార్ట్ డిసీజ్, Rhematoid heart disease- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
-గుండె జబ్బులు అనేక రకాలు. కొన్ని ఆకస్మి కంగా ప్రాణాంతకంగా పరిణమిచేవి. మరికొన్ని దీర్ఘకాలం రోగిని అంటిపెట్టుకుని ఉండేవి. ఇలా అనేక రకాలు మనకు సాధారణంగా కనిపించేవి పుట్టుకతో వచ్చే గుండెజబ్బులు, కౌమార దశలో వచ్చేవి,గుండెలో ఏర్పడే రంధ్రాలు, వాల్వ్ మరమ్మ తులు, రుమటాయిడ్ హార్డ్ డిసీజ్‌లు, కరొనరీ హార్డ్ డిసీజ్, హార్ట్ ఎటాక్, మొదలైనవి ఉన్నాయి. వీటి చికిత్సలు సంప్రదాయ పద్ధతు లతోపాటు అత్యాధునికమైన విధానాలు కూడా అనుసరిస్తున్నారు.
వీటిలో ఆర్‌హెచ్‌డి గురించి, మరికొన్ని రకాల గుండెజబ్బులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం.
రుమటాయిడ్ హార్ట్ డిసీజ్
గుండెను దెబ్బ తీసే జబ్బుల్లో ఇది ఒకటి. ఇది ఒక బాక్టీరియా ద్వారా గుండెకు వ్యాపి స్తుంది. బి-హీమోలి టిక్ స్ట్రెప్టోకోనస్(Beta haemolytic streptococus) అనే ఒక ఆర్గానిజం ద్వారా గొంతులో కలిగే బాక్టీరియా వ్యాధుల శ్రేణులలో ఒకటి. శరీరంలోకి ఈ బాక్టీరియా ప్రవేశించినప్పుడు అధికజ్వరం, గొంతు ఎరుపురంగుకు మారడం, మెడ గ్రంథులు వాపునకు గురి కావడం, మింగ లేకపోవడం వంటి లక్షణాలు గోచరిస్తాయి. రోగి కొంతకాలం దీనిని నిర్లక్ష్యం చేస్తే ఆ ఆర్గానిజం ఏదో ఒక మెకానిజం అంటే మనకు తెలియని ప్రక్రియ ద్వారా గుండెను దెబ్బ తీస్తుంది.
వైద్యుని సరైన సమయానికి సంప్రదించకపో వడం దీనికి కారణం. గొంతులో ఈ బాక్టీరియా ప్రవేశించినప్పుడు జ్వరం రెండు లేదా మూడు వారాలకు రావడం, కీళ్ల మధ్య కదలికలు వాటి రాపిడికి నొప్పి కలగడం, వాపులు, కొన్నిసార్లు బైటపడి అవి నాడి వేగం పెంచుతాయి.
తద్వారా రోగి గుండె నొప్పి, మర్మర్లు, మరి కొన్ని ఇతర వ్యాధులకు దారి తీస్తాయి. సరైన వైద్యుని వెంటనే సంప్రదించాలి. స్పెషలిస్టు దగ్గరకి ఫిజిషియన్ పంపవలసి ఉంటుంది. ఎందుకంటే సక్రమమైన వైద్యం లేకపోతే మళ్లీ అవే లక్షణాలు రోగికి వస్తూ ఉంటాయి.
మొదటిసారి వ్యాధికి గురైనప్పుడు అది ప్రాణాంతకం కాదు. కానీ మళ్లీ మళ్లీ వ్యాధికి గురైతే రోగి పూర్తిగా దెబ్బ తింటాడు. సరైన చికిత్స చేయించుకోకపోతే గుండె కవాటాలు దెబ్బ తింటాయి.
ఇంకా గుండెలో అన్ని భాగాలు కవాటాలు, మయో కార్డియం, పెరికార్డియం వంటివి పని చేయలేని స్థితికి వస్తాయి. వీరికి చివరకు శస్త్ర చికిత్స అవసరమవుతుంది. ఈ శస్త్ర చికిత్సలో పని చేయని కవాటాలను తొలగించి కృత్రిమ కవాటాలు అమర్చాల్సి ఉంటుంది.
వ్యాధి మొదటి దశలో ఉన్నప్పుడు చికిత్స సులభంగా చేయవచ్చు. ఈ వ్యాధి మొదటిసారి గురైన వారు కనీసం అయిదు సంవత్సరాల వరకూ పెన్సిలిన్ ఇంజక్షన్లు తీసుకోవాలి. వీరు ఇతర బాక్టీరియా సంహారక వైద్యం కూడా చేయించుకోవాలి. వీరు సల్ఫా, క్లోరోంఫెనికాల్ వంటి కొన్ని మందులకు దూరంగా ఉండాలి.
అయితే ఈ చికిత్స గొంతులో మొదటగా వచ్చే ఇన్‌ఫెక్షన్లకు సంబంధించినది. కీళ్ల జ్వరానికి ఆస్పిరిన్ ప్రధానంగా ఇచ్చేమందు. ప్రాథమిక చికిత్స సక్రమంగా తీసుకుంటే గుండె జబ్బు అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కీళ్ల జ్వరం వల్ల హృద్రోగం రాకుండా ఈ వైద్యం నివారిస్తుంది.
శస్త్ర చికిత్స
వ్యాధితో అవలక్షణాలకు గురైన ధమని కవాటం, మైట్రల్‌వాల్వ్ వంటి వాటికి శస్త్ర చికిత్స చేయాలి. గుండె వాల్వ్ రిపేరు లేదా మార్చడం ద్వారా అంతకు ముందుఉన్న బాధలు తొలగించవచ్చు. జీవితం సమస్యలు లేకుండా నడిపించ వచ్చు.
ఈ సర్జరీలో ఫలితాల శాతం చాలా ఎక్కువ. వాల్వ్ సర్జరీ సాంకేతికంగా ఎంతో గొప్పది. ఎక్కువ శాతం మైట్రల్, అరోటిక్ వాల్వ్(Aortic valve)లతో ముడివడి ఉంటాయి. ఇవి గుండె ఎడమవైపు ఉంటాయి. మినిమల్లీ ఇన్‌వేసివ్ సర్జరీ కూడా వీటిలో ఒకటి. కవాటాలు వయస్సు నుబట్టి వాటిని కొనుక్కోవలసి ఉం టుంది.
స్వల్పమైన మైట్రల్ స్టెనోసిస్ సంద ర్భంలో క్లోజ్‌హార్ట్ పద్ధతిలో శస్త్ర చికిత్స అవసరమవు తుంది. ఈ పద్ధతిలో కవాటంలోని ఆటంకా లను తొలగించి మైట్రల్ వాల్వోటమీ శస్త్ర చికిత్స సరిపోతుంది.
వ్యాధి తీవ్రమయ్యే సందర్భాలలో కవాటం తొలగించడానికి ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరమ వుతుంది. ధమని కవాటం సరి చేయాలంటే ఓపెన్ హార్ట్ సర్జరీ తప్పనిసరి. దానిని హీమో గ్రాఫ్ట్ ద్వారా కానీ, కృత్రిమ కవాటాన్ని అమర్చి కాని సరి చేస్తారు.కాబట్టి ప్రాథమికంగా చేయ వలసిన చికిత్స ముఖ్యం.
సరైన సమయంలో చికిత్స చేసి కీళ్ల జ్వరం రాకుండా నివారించి బాక్టీరియాను వైద్యుడు గుర్తించి వెంటనే నయం చేయాలి. కల్చర్ టెస్ట్‌లు ముందుగా చేయించాలి. ఎలాంటి గుండె జబ్బులైనా సరైన సమయానికి ఆసు పత్రికి చేరుకుంటే చికిత్స తేలిక అవుతుంది.
0 Comments