Full Style

>

Self Medication , సొంత వైద్యము



సకృత్తులు లభిస్తాయి. కానీ రోజుకి మహిళలకు 55 గ్రా., పురుషులకు 65 గ్రా. ప్రోటీన్లు అవసరమని ప్రపంచ ఆరోగ్యసంస్థ సిఫారసు చేస్తోంది. ఒకవేళ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుంటే మరిన్ని అంటే.. శరీర బరువులో ప్రతికిలోకి 1 గ్రా. అదనపు ప్రోటీన్లు అవసరం. రోగనిరోధకశక్తి తక్కువగా ఉండటం, వెంట్రుకలు రాలిపోతుండటం, గోళ్లు పెళుసుబారటం, నిద్ర సరిగా పట్టకపోవటం, వ్యాయామం చేయాలంటే భారంగా అనిపించటం వంటి లక్షణాలు కనిపిస్తుంటే ప్రోటీన్లు ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉందని గ్రహించాలి. ఇలాంటి సమయాల్లో ముందుగా ప్రోటీన్లు దండిగా ఉండే గుడ్లు, పనీర్‌, సోయాతో చేసిన పదార్థాలు తీసుకోవాలి. అప్పటికీ ఈ లక్షణాలు తగ్గకపోతేనే ప్రోటీన్లు అందించే మాత్రల వైపు దృష్టి సారించాలి.

విటమిన్‌ సి రక్షణ
పొగ తాగే అలవాటు, తీవ్రమైన మానసిక ఒత్తిడి, వాతావరణ కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నివాసం, తరచుగా జలుబు చేస్తుండటం, తేలికగా చర్మం కమిలిపోవటం, పొడి చర్మం, కొలెస్ట్రాల్‌ మోతాదు ఎక్కువగా ఉండటం, మధుమేహం, గుండెజబ్బు.. ఇలాంటివి ఉన్నవారికి రోజుకి 500 మి.గ్రా. విటమిన్‌ సి కావాలి. విటమిన్‌ సి ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలతో పాటు దీనిని అదనంగా తీసుకోవాలి.

విటమిన్‌ బి తోడు
స్వీట్లు ఎక్కువగా కూరగాయలు తక్కువగా తినటం, మరీ మెత్తగా ఉడికించిన కూరగాయలు, నిద్రమాత్రలు, ఆస్ప్రిన్‌, యాంటీ బయాటిక్స్‌, టీ, కాఫీలు, బిస్కట్లు, త్వరగా ఉడికే నూడిల్స్‌ వంటివి తీసుకోవటం వల్ల ఒంట్లో బి విటమిన్లు తగ్గిపోతాయి. విటమిన్‌ బి లోపం ఉన్నట్టు గుర్తిస్తే ముందు పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. టీ, కాఫీ, బిస్కట్లను తగ్గించాలి. అయినప్పటికీ అలసట, చిరాకు, ఏకాగ్రత లోపించటం, ఆకలి తగ్గిపోవటం.. చర్మం, వెంట్రుకల నిగారింపు తగ్గటం, కీళ్ల నొప్పుల వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యుల సలహా మేరకు విటమిన్‌ బి కాంప్లెక్స్‌ మాత్రలు వేసుకోవాల్సి ఉంటుంది.

క్యాల్షియం బాసట
ఎముకలు పెళుసుగా ఉన్నవారికి, బరువు పెరగాలని అనుకుంటున్నవారికి, 40 ఏళ్లు దాటిన మహిళలకు, అధిక రక్తపోటు గలవారికి, థైరాయిడ్‌ సమస్యలతో బాధపడేవారికి అదనపు క్యాల్షియం అవసరమవుతుంది. ఇలాంటివారు పాలు, బాదంపప్పు, పొద్దు తిరుగుడు గింజలు, నువ్వులు ఎక్కువగా తీసుకోవాలి. అప్పటికీ ఫలితం కనిపించకపోతే రోజుకి 500 మి.గ్రా. క్యాల్షియం మాత్రలు వేసుకోవచ్చు. అయితే వీటిని పాలతో పాటు తీసుకోవాలి. ఎందుకంటే క్యాల్షియాన్ని శరీరం బాగా గ్రహించాలంటే కొంత కొవ్వు కూడా కావాలి మరి.

Post a Comment

0 Comments