గర్భస్థ శిశువుల్లోని గుండెలో రంధ్రాలు(Septal Defects in Babies)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
చిన్న పిల్ల గుండెలో ఏర్పడే రంధ్రాలను సెప్టల్ డిఫెక్ట్స్ అంటారు. పైన ఉండే కర్నికల మధ్య ఉండే రంధ్రాల్ని ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్స్ అని, కింద ఉండే రెండు గదులను జఠిరికలు అంటారు. వీటిలో ఉండే రంధ్రాలను వెంట్రిక్యులార్ సెప్టల్ డిఫెక్ట్స్ అంటారు. గర్భంలో ఉన్నప్పుడు గుండె మొదటి నాలుగు నుంచి ఎనిమిది వారాల్లో తయారవుతుంది. నాలుగు గదులు ఏర్పడటం.. రక్తనాళాలు అభివృద్ధి చెందడం.. గదుల మధ్య గోడలు ఏర్పడటం ..అన్నీ నాలుగు నుంచి ఎనిమిది వారాల్లో జరుగుతుంది. ఎనిమిది నుంచి 12 వారాల్లో మిగిలిన రక్తనాళాల విభజన పూర్తిగా జరుగుతుంది. కవాటాల మధ్య గోడ పూర్తిగా కలిసి, నాలుగు గదులు ఏర్పడతాయి. ఈ సమయంలో గర్భిణి స్త్రీకి, గర్భస్థ శిశువుకు అనారోగ్య సమస్య, జన్యుపరమైన సమస్య కలిగినప్పుడు గుండెలో రంధ్రాలు ఏర్పడతాయి. జన్యులోపాలు కలగడం, మేనరికపు పెళ్లీల వల్ల కలిగే షేరింగ్ ఆఫ్ జీన్స్ వల్ల మ్యూటేషన్లు ఏర్పడతాయి. మొదటి శిశువు, 30 ఏళ్ల తర్వాత పుట్టే పిల్లల్లో ఒక్కోసారి 'డౌన్ సిండ్రోం' కనిపిస్తుంది. మనం తినే పోషక పదార్థాలలో ఫోలిక్ యాసిడ్, విటమిన్-బి12 చాలా ముఖ్యమైనవి. ఈ ఫోలిక్‌యాసిడ్, విటమిన్-బి12 మన రాష్ట్రంలో తీసుకోవడం చాలా తక్కువ. మనం తినే బియ్యాన్ని డబుల్ పాలిష్ చేస్తుంటారు. దీని వల్ల బియ్యంపైన ఉండే బి-కాంప్లెక్స్ కోటింగ్ వెళ్లిపోతుంది. కొన్ని పళ్లు, కూరగాయల్లో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. కానీ ఇప్పుడు పెరిగిన ధరల వల్ల పళ్లు కొనడానికి ఎవరూ సాహసించడం లేదు. ఈ పోషకాలు సరైన పద్ధతిలో అందక పిండం వృద్ధి చెందడం లేదు. దీని వల్ల గుండెలో రంధ్రాలు ఏర్పడుతున్నాయి. గర్భిణులు పొలాల్లో పనిచేసేటప్పుడు క్రిమి రసాయన మందులకు ప్రభావితం అవడం, వైరల్ ఇన్‌ఫెక్షన్ల వల్ల, రుబెల్ల వైరస్ వల్ల, పాసివ్ స్మోకింగ్ వల్ల గర్భస్థ శిశువుల్లోని గుండెలో రంధ్రాలు ఏర్పడతాయి.
ఎలా గుర్తిస్తారు ?
గుండెలో రంధ్రాలు ఉన్నాయని ఐదు లక్షణాల ద్వారా గుర్తించొచ్చు. అవి....వెంట్రిక్యులార్ సెప్టాల్ డిఫెక్ట్ ఉండే పిల్లలు ఎప్పుడూ రొప్పుతూ ఉంటారు. ఊపిరితిత్తుల్లో గాలి సరిగ్గా పోనట్టు డొక్కలు ఎగిరేస్తారు. దీన్నే రెస్పిరేటరీ డిస్‌ట్రస్ అంటాం. డొక్కలెగిరేయడం గుండెకు సంబంధించిన సమస్యగా ఉండొచ్చు. గుండెలో రంధ్రాలు ఉన్నప్పుడు ఊపిరితిత్తుల్లో చాలా ఎక్కువ రక్తం పోతుంది. ఒక డ్యాం తెగి వరదలు ఏ విధంగా వస్తాయో అలాగే ఊపిరితిత్తులకు ఎక్కువ రక్తం వెళ్లి ఊపిరితిత్తులు తడిగా అవుతాయి. అందువల్ల ఎక్కువ రొప్పుతారు. తల్లిపాలు తాగలేరు. మొదటి బిడ్డతో పోలిస్తే రెండో బిడ్డ చాలా ఎక్కువసేపు తాగడం, కొంచెం కొంచెం తాగడం, కొంచెం తాగగానే ఆయాసం రావడం, పాలు తాగలేకపోవడం, తాగేటప్పుడుపొరపోవడం, కొంచెం తాగగానే నిద్రపోవడం... వీటిన్నంటినీ కలిపి ఫీీడింగ్ డిఫికల్టీస్ అంటారు. బిడ్డ పాలు తాగకపోవడం వల్ల ఎదుగుదల సరిగ్గా ఉండదు. ఒక్కోసారి ఎన్ని పాలిచ్చినా పాపలో ఎదుగుదల ఉండదు. ఆరు నెలలు వయసులో ఉండాల్సిన బరువు మిగతా పిల్లలతో పోలిస్తే సగం కంటే ఇంకా తక్కువుంటుంది. కొన్నిసందర్భాల్లో పాలు తాగేటప్పుడు పాపకు చాలా విపరీతంగా చెమటలు పడతాయి. దీని అర్థం హార్ట్ ఫెయిల్యూర్ అని. ఒక్కోసారి అరుదుగా ఊపిరితిత్తుల్లో నెమ్ము రావడం జరుగుతుంది. నెలకు రెండు సార్లు, మూడు నెలలకు మూడు, నాలుగు సార్లు నిమోనియా రావడం. ఈ లక్షణాలన్నీ పోలిస్తే పాపకు గుండెలో రంధ్రాలున్నాయని తెలుస్తుంది.
రుబెల్లా ఒక కారణం మాత్రమే
రుబెల్లా ఎంఎంఆర్ అనే వ్యాక్సిన్ ప్రతి ఒక్కరికి చిన్న వయసులో వేస్తారు. 9 నెలల నుంచి వేస్తారు. అందరికీ వేయాలి. ఇవ్వకుంటే రుబెల్లా సిండ్రోంతో పుట్టే బేబీస్‌లో బ్లైండ్‌నెస్, మెంటల్ రిటార్డ్‌నెస్, గుండెలో రంధ్రాలు రావడం, వాల్వ్‌బ్లాక్స్ ఏర్పడే అవకాశముంది. అందుకని కచ్చితంగా అమ్మాయిలకు తప్పనిసరిగా రుబెల్లా వ్యాక్సిన్ ఇప్పించాలి. పిల్లల్లో గుండె రంధ్రాలకు రుబెల్లా ఒక కారణం మాత్రమే. చాలా వరకు తెలియని కారణాలు ఉంటాయి.
అన్ని రంధ్రాలు మూసుకుపోవు
గుండెలో రంధ్రం దానికదే మూసుకుపోతుంది, మందులతో నయం అవుతుందనే అపోహ చాలా మంది తల్లిదండ్రుల్లో ఉంది. అయితే అన్ని రంధ్రాలు మూసుకుపోవు. మీకో ఉదాహరణ చెబుతాను. వారం కిందట ఒక పాపను తీసుకొచ్చారు. పాప వయసు ఇప్పుడు ఎనిమిదేళ్లు. చిన్నప్పుడు గుండెలో రంధ్రాలున్నాయని డాక్టర్లు చెప్పారు. మందులిచ్చారు. ఆయాసం తగ్గింది గుండెలో రంధ్రాలు తగ్గాయని తల్లిదండ్రులు అనుకున్నారు. డాక్టర్ కూడా అనుకున్నారు. రంధ్రం మూసుకోలేదు. ఇప్పుడు చెడు రక్తం వచ్చి మంచి రక్తంలో కలుస్తోంది. పాప మూర్చ తిరిగి పడిపోతున్నది. దానికి కారణం ఊపిరితిత్తుల్లో ఒత్తిడి బాగా పెరిగి, కార్డియాక్ అవుట్‌పుట్ మెయింటేన్ కాకపోవడం. గుండెలో రంధ్రాలు సహజంగా మూసుకుంటాయని చాలావరకు అనుకుంటారు. కానీ కేవలం 60 శాతం మాత్రమే మూసుకుంటాయి. ఒక సారి గుండెలో రంధ్రం ఉందని తెలిస్తే కచ్చితంగా నిర్ధారణ చేయాలి. అది మూసుకునే వరకు డాక్టర్ పర్యవేక్షణలో ఉండాలి.
ఆధునిక చికిత్స
లక్షణాలు కనుక్కుని పాపను స్థానిక డాక్టర్ పరీక్షిస్తే గుండె నుంచి శబ్దాలు వస్తాయి. వీటిని మర్మర్స్ అంటారు. అప్పుడు పిల్లల హృద్రోగ నిపుణులను సంప్రదిస్తారు. మర్మర్స్‌ను బట్టి గుండెలో రంధ్రాలు ఉన్నాయని ఒక అవగాహనకు వస్తారు. తర్వాత ఎక్స్‌రే, ఇసిజి, స్కానింగ్ కచ్చితంగా తీస్తారు. స్కానింగ్ అల్ట్రాసౌండ్ తరంగాలు గుండెకు పంపించి ఆ గుండెను ఎకోమిషన్‌లో చూస్తారు. గుండె పనితీరు ఎలా ఉంది? గుండెలో ఎన్ని రంధ్రాలున్నాయి? అవి పెద్దవా? చిన్నవా? చిన్న రంధ్రాలు అయితే వాటికవే మూసుకుపోతాయా? మూసుకుపోయే శక్తి ఉందా? అనే అంశాలు గమనించి విశ్లేషిస్తాం. ఒక వేళ పుట్టగానే పెద్ద రంధ్రాలు ఉంటే ముందుగా కొన్ని మందులు ఇచ్చి హార్ట్‌ఫెయిల్యూర్‌ని నియంత్రిస్తారు. మందులిచ్చినా హార్ట్‌ఫెయిల్యూర్ నియంత్రణ కాకుండా, పాప పాలు తాగకున్నా ఊపిరితిత్తుల్లో నెమ్ము వస్తే మూడు నెలలు వయసులోనే రంధ్రాలను ఓపెన్ హార్ట్ సర్జరీ ద్వారా సరిచేస్తారు. దీని ద్వారా రంధ్రాలు మూస్తారు. ఒక్కోసారి రంధ్రాలు మధ్యస్థంగా ఉన్నప్పుడు 10, 12 నెలలు తర్వాత వీటిని గుర్తిస్తే ఆపరేషన్ లేకుండా తొడలోని రక్తనాళం నుంచి క్యాథటర్ ద్వారా రంధ్రాలను క్లోజ్ చేస్తారు. దీన్నే 'అంబ్రెల్లా థెరప'ీ అంటారు. ఇది గొడుగును పోలి ఉంటుంది.ఇది మన దేశంలో రెండేళ్లుగా చేస్తున్నారు. ఈ ప్రక్రియలో కొత్త మార్పులు వస్తున్నాయి. పరిశోధన ద్వారా కొత్త పరికరాలు కనుగొంటున్నారు. 6 నెలల వయసు నుంచి ఈ ప్రక్రియ ద్వారా గుండెలో రంధ్రాలు మూసెయ్యవచ్చు. 'అంబ్రెల్లా' పరికరాన్ని నిటినాల్ మెటిరీయల్‌తో తయారు చేస్తారు. క్యాథటర్ ద్వారా గుండెలోకి తీసుకెళ్లి రంధ్రం ఎక్కడుందో ఎకో కార్డియోగ్రాం, యాంజి కార్డియోగ్రాం ద్వారా చూస్తూ రంధ్రంలో అమరుస్తారు. అప్పుడు మంచి రక్తం వచ్చి చెడు రక్తంలో కలవడం తగ్గుతుంది. ఈ ప్రక్రియ గంట సమయంలో చేయచ్చు. ఉదయం అడ్మిట్ అయితే తర్వాత రోజు డిశ్చార్జి చేస్తారు. దీని వల్ల దుష్ఫ్రభావాలు చాలా తక్కువ. ఈ మధ్య కాలంలో అంబ్రెల్లా విధానం అభివృద్ధి వల్ల ఆపరేషన్‌కు ఎంత ఖర్చు అవుతుందో అంబ్రెల్లాకు కూడా అంతే ఖర్చు అవుతోంది. అంబ్రెల్లా పద్ధతిలో కాంప్లికేషన్ రేటు తక్కువ. ఆపరేషన్‌లో కాంప్లికేషన్ రేటు ఎక్కువ. ఎవరికైనా రంధ్రాలు ఉండి అంబ్రెల్లా పద్ధతి సరిపోతుందని నిర్ధారిస్తే ఈ పద్ధతే మేలని ప్రపంచ వ్యాప్తంగా వైద్యనిపుణులు సిఫార్సు చేస్తున్నారు.

0 Comments