even events to prevent paralysis-పక్షవాతం ముప్పు తగ్గటానికి తోడ్పడే 7 అంశాలు.-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
పక్షవాతం చాలా తీవ్రమైన సమస్య. సకాలంలో చికిత్స అందకపోతే దీర్ఘకాలం వైకల్యం బారినపడే ప్రమాదముంది. కొన్నిసార్లు ప్రాణాలకూ ముప్పు ముంచుకు రావొచ్చు. అయితే మంచి విషయం ఏంటంటే.. జీవనశైలి మార్పులతో అసలు పక్షవాతం రాకుండా చూసుకునే వీలుండటం. ఆరోగ్యకరమైన ఆహారం తినటం, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం, రక్తపోటును నియంత్రణలో పెట్టుకోవటం, బరువు పెరగకుండా చూసుకోవటం, రక్తంలో గ్లూకోజును నియంత్రణలో ఉంచుకోవటం, పొగ తాగకపోవటం.. ఈ ఏడు అంశాలు పక్షవాతం ముప్పు తగ్గటానికి తోడ్పడతాయని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సూత్రీకరించింది. ఇవన్నీ పక్షవాతం ముప్పును తగ్గించటంలో గణనీయమైన పాత్ర పోషిస్తున్నట్టు తాజా అధ్యయనం కూడా బలపరుస్తోంది. పరిశోధకులు ఇటీవల 23వేల మందిపై ఐదేళ్ల పాటు అధ్యయనం చేసి, పక్షవాతం ముప్పుల ప్రభావాలను అంచనా వేశారు. వీటిల్లో అధిక రక్తపోటు అన్నింటికన్నా ముందు వరుసలో ఉంటున్నట్టు బయటపడింది. ''రక్తపోటు అదుపులో లేనివారితో పోలిస్తే రక్తపోటు బాగా అదుపులో ఉన్నవారికి పక్షవాతం ముప్పు 60% తక్కువగా ఉంటోంది'' అని వెర్మాంట్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ మేరీ కష్‌మన్ చెబుతున్నారు. అలాగే పొగ తాగనివారికి, పొగ అలవాటు మానేసిన వారికి కూడా పక్షవాతం ముప్పు 40% తగ్గినట్టు వెల్లడైంది. అందువల్ల తేలికైన జీవనశైలి మార్పులతో పక్షవాతాన్ని దూరంగా ఉంచుకునే అవకాశముందని గుర్తించాలని సూచిస్తున్నారు.
0 Comments