Full Style

>

Thyroid cancer Awareness,థైరాయిడ్‌ కాన్సర్స్ అవగాహన



Thyroid cancer Awareness,థైరాయిడ్‌ కాన్సర్స్ అవగాహన- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



థైరాయిడ్‌ గ్రంథి సీతాకోక చిలుక ఆకారంలో మెడలో విండ్‌పైప్‌ ప్రాంతంలో ఉంటుంది. మన శరీరం శక్తిని ఎలా ఉపయోగించుకుంటుంది, ఎలా నిలువ ఉంచుకుంటుంది లాంటి వాటిని సరిచూస్తూ ఉంటుంది. మన శరీరంలోని కణాలన్నింటి పని తీరుని పరీక్షిస్తుంటుంది థైరాయిడ్‌ గ్రంథి.

థైరాయిడ్‌ గ్రంథి సమస్యలు, పాంక్రియాజ్‌ గ్రంథి సమస్యలు మనకి ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొదటిది ఆడవాళ్ళలో, రెండవది మగవాళ్ళలో ఎక్కువగా కనిపించడం విశేషం.థైరాయిడ్‌ సమస్యలు ఇప్పుడు ఎక్కువకాలేదు. కాకపోతే కొన్ని అనారోగ్యాల అను మానంతో పరీక్షలు జరిపి థైరాయిడ్‌
సమస్యల్ని ఎక్కువగా కనుక్కొంటున్నారు. ప్రధానంగా థైరియిడ్‌కి వచ్చే సమస్యలు - హైపోథైరాయిడిజమ్‌, హైపర్‌ థైరాయి డిజమ్‌, థైరాయిడ్‌ కాన్సర్స్‌..హార్మోన్ ఉత్పత్తి సంబంధిత సమస్యలే కాకుండా థైరాయిడ్ ఒక్కోసారి క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉంది. కాకపోతే, హైపోథైరాయిడిజం, లేదా హైపర్ థైరాయిడ్ సమస్యలకూ, థైరాయిడ్ క్యాన్సర్ రావడానికీ ఏ సంబంధమూ లేదు.

మగవాళ్ళలో కంటే ఆడవాళ్ళలో థైరాయిడ్‌ క్యాన్సర్‌ ఎక్కువ. గొంతు దగ్గర వాపు కనిపించడం థైరాయిడ్‌ లక్షణం దానికి నొప్పి ఉండదు. ఇతర క్యాన్సర్స్‌లాగే దీనికి చికిత్స ఉంది. కాకపోతే ప్రాథమిక దశలోనే ఇబ్బందుల్ని కనుక్కోవడం చాలా అవసరం.చాలా మందికి అవయవాల మీద, సిస్టమ్స్‌మీద అవగాహన ఉండవచ్చు. గ్రంథుల మీద అవగాహన ఉండదు. కాబట్టి గ్రంథుల నిర్మాణం, ఎక్కడుంటాయి, ఎలా ఉన్నాయి, ఏ స్థాయిలో హార్మోన్లని విడుదల చేస్తున్నాయి లాంటి విషయాల మీద అందరికీ అవగాహన ఉండాలి.

    ఒక అంచనా ప్రకారం మన దేశంలో 4.2 కోట్ల మంది (2012) థైరాయిడ్‌ క్యాన్సర్‌ బారినపడ్డారు. మహిళల్లో వచ్చే రొమ్ము, పిత్తాశయం క్యాన్సర్‌తో పాటు థైరాయిడ్‌ క్యాన్సర్‌ కూడా పెరుగుతోంది. ఈ క్యాన్సర్‌ ఎలా వృద్ధి చెందుతుంది? లక్షణాలు ఎలా ఉంటాయి? చికిత్స, నివారణ మార్గాలు తెలుసుకుందాం....

థైరాయిడ్‌ గ్రంథి శ్వాసనాళం ముందు భాగంలో, స్వరపేటికకు కింద ఉంటుంది. మనం తీసుకునే ఆహారంలోని అయోడిన్‌ నుంచి థైరాయిడ్‌ హార్మోనులు తయారవుతాయి. గ్రంథిలోని సాధారణ కణాలు అసాధారణ కణాలుగా మారి, నియంత్రణ లేకుండా పెరిగి, ఇతర అవయవానికి వ్యాప్తి చెందినప్పుడు థైరాయిడ్‌ క్యాన్సర్‌ వస్తుంది. ఇది అసాధారణ క్యాన్సర్‌ రూపం అయినప్పటికీ థైరాయిడ్‌ క్యాన్సర్‌లో రకాలుంటాయి. పాపిలరీ థైరాయిడ్‌ క్యాన్సర్‌, పొలిక్యులర్‌ థైరాయిడ్‌ క్యాన్సర్‌, మెడ్యులరీ థైరాయిడ్‌ క్యాన్సర్‌, అనప్లాస్టిక్‌ కార్సినొమా, థైరాయిడ్‌ లింఫొమా అనే రకాలుంటాయి.

లక్షణాలు

మొదట క్యాన్సర్‌ తొలిదశల్లో దీని లక్షణాలను గుర్తించలేరు. క్యాన్సర్‌ పెరిగి, వృద్ధి చెందుతున్నకొద్దీ లక్షణాలు బయటపడతాయి. అవి....

మాట్లాడలేకపోవడం లేదా గొంతు బొంగురుపోవడం,
మెడలో ముద్దలాగా కనిపించడం,
మెడ విస్తరించినట్లు అనిపించడం,
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది,
మింగడం కష్టంగా ఉండటం,
దగ్గినప్పుడు రక్తం పడటం,

ఈ లక్షణాలుంటేనే థైరాయిడ్‌ క్యాన్సర్‌ అని భావించకూడదు. ఇతర కారణాల వల్ల కూడా ఇవి బయటపడొచ్చు.

కారణాలు

రేడియేషన్‌ : చిన్నతనంలో రేడియేషన్‌ ప్రభావానికి గురవడం వల్ల క్యాన్సర్‌ వృద్ధి చెందే అవకాశముంది. వైద్యం చేసే సమయంలో కలిగే రేడియేషన్‌ ఒకటైతే, అణుబాంబులు వేయడం వల్ల వాతావరణంలో కలిగే పర్యావరణమార్పులు (జపాన్‌లోని నాగసాకి, హిరోషిమా) లేదా అణు విద్యుత్‌ ప్లాంట్లలో జరిగే ప్రమాదాల (చెర్నోబిల్‌ వంటివి) వల్ల రేడియేషన్‌ ప్రభావానికి గురవుతారు.

కుటుంబ చరిత్ర : కుటుంబంలో ఎవరికైనా థైరాయిడ్‌ క్యాన్సర్‌ ఉంటే తర్వాతి తరం వారిలో క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

ఇవేకాక థైరాయిడ్‌ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదాలు చాలా ఉన్నాయి.
వృత్తిపరమైన, పర్యావరణ ప్రభావాలు,
హెపటైటిస్‌-సి సంబంధ దీర్ఘకాల హెపటైటిస్‌,
ఆలస్యంగా తొలిసారిగా గర్భం రావడం.

చికిత్స :
థైరాయిడ్ క్యాన్‌సర్ టైపు , స్టేజ్ లను బట్టి ట్రీట్మెంట్ చేసేపద్దతులుంటాయి.

సర్జరీ : థైరాయిడ్‌ క్యాన్సర్‌ను తొలగించడానికి చాలా కేసులకు సర్జరీ చేస్తారు. శస్త్రచికిత్సలో భాగంగా థైరాయిడ్‌ గ్రంథిలోని కొంతభాగం లేదా థైరాయిడ్‌ గ్రంథి మొత్తం తొలగిస్తారు. కొన్నిసార్లు వీటికి దగ్గర్లో ఉన్న లింఫ్‌నోడ్లను కూడా తొలగిస్తారు.

రేడియో యాక్టివ్‌ అయోడిన్‌ : రేడియో యాక్టివ్‌ అయోడిన్‌ను బిళ్ల రూపంలో లేదా ద్రవరూపంలో తీసుకోవాలి.

మందులు : థైరాయిడ్‌ సర్జరీ లేదా రేడియో యాక్టివ్‌ అయోడిన్‌ చికిత్స తర్వాత థైరాయిడ్‌ హార్మోన్‌ మందులు తీసుకోవాలని సూచిస్తారు. వీటివల్ల శరీరానికి అవసరమైన హార్మోన్లు సరైన మోతాదులో అందుతాయి.

ఎక్స్‌టర్నల్‌ బీమ్‌ రేడియేషన్‌ థెరపీ : క్యాన్సర్‌ కణాలను చంపడానికి ఎక్కువ డోసు ఎక్స్‌రే కిరణాలను ఈ చికిత్సలో ఉపయోగిస్తారు.

కీమోథెరపీ : ఈ పద్ధతిలో మందుల్లోని రసాయనాల ద్వారా క్యాన్సర్‌ కణాలను చంపుతారు. చేతి సిరల ద్వారా కీమోథెరపి వైద్యం చేస్తారు. ఇతర చికిత్సలకు స్పందించనివాళ్లకు ఈ చికిత్స సూచిస్తారు.

చికిత్స తర్వాత మళ్లీ థైరాయిడ్‌ క్యాన్సర్‌ రాకుండా డాక్టర్‌ సలహా మేరకు క్రమం తప్పకుండా అవసరమైన పరీక్షలు, రక్తపరీక్షలు, స్కానింగ్‌లు చేయించుకోవడం తప్పనిసరి. 

Post a Comment

0 Comments