Full Style

>

Tips for curly and brisht hair, అలల్లా మెరిసేలా జుట్టు కోసము కొన్ని చిట్కాలు

Tips for curly and brisht hair, అలల్లా మెరిసేలా జుట్టు కోసము కొన్ని చిట్కాలు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...




    మరీ నిదానంగా ఎక్కడా చిన్నపాటి వంకీ కూడా లేని జుట్టు అంటే చాలామందికి నచ్చదు. అలా కాకుండా చెప్పినమాట వింటూ

అక్కడక్కడా చివర్లలో కాస్త వంకీలు తిరిగితే ఎంత బాగుంటుంది! అయితే ఇలా చేసి చూడండి.

* అరకప్పు చొప్పున పాలూ, నీళ్లూ ఒక బాటిల్‌లో తీసుకోవాలి. తరవాత చిక్కుల్లేకుండా తల దువ్వుకోవాలి. ఇప్పుడు బాటిల్‌లోని

మిశ్రమాన్ని జుట్టుపై స్ప్రే చేసి మళ్లీ మృదువుగా దువ్వాలి. అరగంటయ్యాక నీటితో శుభ్రం చేసుకోవాలి. తడి జుట్టుని పెద్దపళ్లున్న

దువ్వెనతో దువ్వుకోవాలి. వారానికి రెండు మూడు సార్లు ఇలా చేస్తే వెంట్రుకలు అడుగు నుంచి వంకీల్లా తిరగడం మొదలవుతాయి.

* కప్పు ముల్తానీమట్టికి ఒక గుడ్డులోని తెల్లసొన, రెండు టీ స్పూనుల బియ్యప్పిండీ, నీళ్లూ కలిపి పేస్టులా చేయాలి. ఈ మిశ్రమాన్ని

తలకు రాసుకోవాలి. అరగంట తరవాత దువ్వుకుని రెండు గంటలయ్యాక తలస్నానం చేస్తే సరి వెంట్రుకలు వంకీల్లా తిరగడం

మొదలవుతాయి.

* ఒక కొబ్బరికాయ నుంచి తీసిన కొబ్బరి పాలూ, ఒక నిమ్మకాయ రసం కలిపి చిన్న డబ్బాలో తీసుకొని ఫ్రిజ్‌లో పెట్టాలి. మరుసటి రోజుకి

డబ్బాలోని మిశ్రమం క్రీమ్‌లా గట్టిగా అవుతుంది. ఆ క్రీమ్‌ని మాడుకీ, వెంట్రుకలకీ రాసుకుని వేణ్నీళ్లలో ముంచిన టవల్‌ని తలకు

చుట్టుకోవాలి. గంట తరవాత నీళ్లతో కడిగేసి పెద్ద పళ్లున్న దువ్వెనతో దువ్వాలి. ఇలా వారానికి మూడు సార్లు చేస్తే మంచి

ఫలితముంటుంది  వెంట్రుకలు వంకీల్లా తిరగడం మొదలవుతాయి..

* జుట్టుకి స్పూను తేనెని కప్పు నీళ్లలో కలిపి తలకి మసాజ్‌ చేయండి. అయిదు నిమిషాల పాటు అలా వదిలేసి తరువాత సాధారణ నీళ్లతో

స్నానం చేసేయండి. వారానికి రెండు మూడు సార్లు ఇలా చేస్తే వెంట్రుకలు అడుగు నుంచి వంకీల్లా తిరగడం మొదలవుతాయి.

Post a Comment

0 Comments