Full Style

>

యాంటి బయాటిక్స్ అంటే ఏమిటి ? ఎలా ఉపయోగించాలి..


వివిధ రకాల వ్యాధుల నివారణకు యాంటి బయాటిక్స్ వాడడం సర్వ సాధారణం. ఈ యాంటీ బయాటిక్స్ ను సాధారణంగా ఇంజక్షన్ల రూపంలో , టాబ్లెట్ల రూపంలో ఉంటాయి. చిన్న పిల్లలకు సిరప్ ల రూపంలో ఉంటాయి. టాబ్లెట్ల రూపంలో ఉండే యాంటి బయాటిక్స్ లలో సల్ఫర్ ఉంటుంది. ఇది మోతాదు ఎక్కువైతే చర్మం మీద నల్లటి మచ్చలు వస్తాయి. ఆ మచ్చల వద్ద దురద కూడ వస్తుంది. ఇలా మచ్చలు వచ్చిన వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. డాక్టర్లు రోగిని పరిక్షించి యాంటి బయోటిక్స్ కు రియాక్షన్ కలగకుండా మందిలిస్తారు. కొన్ని రకాల యాంటి బయోటిక్స్ తో వాంతులు, వికారాలే కాకుండా కడుపులో మంట కూడా వస్తుంది. ఈ తరహా మందులతో కొన్ని సార్లు విరేచనాలు అయ్యే అవకాశం ఉంది. ఈ స్థితిలో విరేచనాలు తగ్గడానికి వేరే మందులు వాడకుండా యాంటి బయోటిక్స్ వాడడం ఆపేస్తే సరిపోతుంది.
యాంటిబయోటిక్స్ తో దీర్ఘకాలిక దుష్ర్పభావాలు: ఏ మందులనైనా డాక్టర్ సూచించిన పరిమిత కాలం వరకే వాడాలి. కానీ, చాలా మంది ఒకసారి సూచించిన మందులను ఏళ్ల తరబడి వాడేస్తుంటారు. ఇలా డాక్టర్ ప్రమేయం లేకుండా మందులు వాడుతున్నప్పుడు వెంటనే ఏ ప్రభావం చూపించక పోవచ్చు కానీ దీర్ఘకాలంలో వాటి ప్రభావం దేహంపై తప్పక పడుతుంది. శరీరంలోని కాలేయం వంటి అవయవాల మీద ఈ యాంటి బయోటిక్స్ ప్రభావం పడి, అది జాండిస్ వంటి వ్యాధులకు దారితీసే ప్రమాదం ఉంది. అనాల్జిన్, బెరాల్గన్, అవిల్ వంటి ఇంజక్షన్లు ఎక్కువ కాలం పాటు తీసుకుంటే అవి కిడ్నీల మీద ప్రభావం చూపే ప్రమాదం ఉంది. అందుకనే ఏ మందులనైనా డాక్టర్ల సలహా సూచనలను అనుసరించే వాడాలి.
ఏదైనా వ్యాధి సోకినప్పుడు అవసరమైన రక్త మూత్ర పరిక్షలన్నీ చేయించుకోవడం అవసరం. దీనివల్ల వ్యాధికి తగిన మందులు రాసే అవకాశం డాక్టర్ కు దొరుకుతుంది. వ్యాధిని బట్టే యాంటీ బయాటిక్స్ వాడే కాలవ్యవధి ఉంటుంది. కొన్ని సార్లు డాక్టర్లు సూచించిన గడువుకన్నా ముందే వ్యాధి నుండి ఉపశమనం లభించవచ్చు. అలా ఉపశమనం లభించగానే మందులు వాడడం ఆపేస్తారు. అలా ఆపేయడం కూడా మంచిది కాదు. సమస్య తగ్గినా డాక్టర్ చెప్పే వరకు మందుల వాడకాన్ని కొనసాగిస్తునే ఉండాలి.

 

 

Post a Comment

0 Comments