* ప్రతిరోజూ మనం తీసుకునే ఆహారంలో మెగ్నీషియం, జింక్ లోపాలు ఎక్కువగా ఉన్నట్లయితే శరీరంలో చెమట ఎక్కువగా పట్టడం, దుర్వాసన వెలువటం లాంటివి సంభవిస్తాయి. కాబట్టి దైనందిన ఆహారంలో మెగ్నీషియం, జింక్ అధికంగా ఉండే పదార్థాలను తీసుకోవాలి. ఇలాంటి ఆహారం స్వేద సంబంధిత సమస్యల నుంచి దూరంగా ఉంచుతుంది. దానితోపాటు పరిశుభ్రమైన మంచినీటిని సాధ్యమైనంత ఎక్కువగా తాగుతుండాలి.
* బాదం పప్
పులు,
సోయాబీన్లు, తాజా ఆకుకూరలు, ఓట్స్, గోధుమ గడ్డి.. తదితర పదార్థాల నుంచి
మెగ్నీషియం సమృద్ధిగా లభిస్తుంది. కోడిగుడ్లు, తాజాగా మటన్, కోడి మాంసం,
గోధుమలు, సోయాబీన్స్, మొక్క జొన్నలు, నువ్వులు, గోధుమ గడ్డిల నుంచి జింక్
ఎక్కువగా లభిస్తుంది. కాబట్టి పైన చెప్పుకున్న ఆహార పదార్థాలను ప్రతిరోజూ
సాధ్యమైనంత ఎక్కువగా స్వీకరిస్తుండాలి.
* చెమట దుర్వాసనకు చెక్ పెట్టాలంటే.. ముందుగా బజార్లో దొరికే ఫాస్ట్‌ఫుడ్‌లకు గుడ్‌బై చెప్పాల్సిందే. ఫాస్ట్‌పుడ్‌లో పీచు పదార్థాలు ఉండవు, అలాగే వాటిల్లోని రీఫైండ్ పదార్థాలు, పలు రకాల నూనెలు చెమట దుర్వాసనను అధికం చేస్తాయే తప్ప, తగ్గించవు. అందుకనే ఫాస్ట్‌ఫుడ్‌కు బదులుగా తృణధాన్యాలతో చేసిన ఆహార పదార్థాలు, తాజా ఆకు కూరలు, పండ్లు, సోయా ఉత్పత్తులు, మెలకెత్తిన విత్తనాలు, ఆరోగ్యకరమైన నూనెలు తీసుకోవాలి.
* వేసవిలో వెల్లుల్లితో తయారైన వంటకాలు.. చేపలు, మెంతి ఆకులు, ఉల్లిపాయలు, ఘాటైన మసాలా పదార్థాలు అధిక చెమటకు, శరీరం దుర్వాసనకు కారణాలుగా చెప్పవచ్చు. అందుకనే ఈ కాలంలో వీటి వాడకాన్ని, మితిమీరిన మాంసాహారాన్ని కూడా తగ్గించాలి. వీటితోపాటు ప్రతిఒక్కరికీ వ్యక్తిగత పరిశుభ్రత అనేది చాలా అవసరం. బాహుమూలల్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవటంవల్ల బ్యాక్టీరియా దూరం చేయవచ్చు, తద్వారా దుర్వాసనకు దూరమవ్వచ్చు.

0 Comments