Full Style

>

నిద్రను అదిమిపట్టి ఆపేస్తే డయాబెటిస్ ప్రమాదం


నిద్ర సరిగా పోనివారికి డయాబెటిస్ త్వరగా సోకే ప్రమాదముంది. మూడురోజులు వరుసగా తగినన్ని గంటలు నిద్రపోలేకపోతే శరీరంలో వచ్చే మార్పులలో ముఖ్యమైనది రక్తంలో గ్లూకోజ్ నియంత్రణలో మార్పులు వస్తాయని పరిశోధకులు గుర్తించారు. ఆ నియంత్రణ వ్యవస్థలో లోపం ఏర్పడటంతో షుగర్ జబ్బు వస్తుంది. బలవంతంగా నిద్రను అదిమిపెట్టి రాత్రుళ్ళు ఎక్కువసేపు మెలకువతో వుండే విద్యార్థులు గుర్త

ించాల్సిన విషయం ఇది.

అయితే వయసులో వుండగా దీని ప్రభావం వెనువెంటనే కనిపించకపోవచ్చంటున్నారు. కానీ భవిష్యత్ జీవితంలో ఇది సమస్యలను తెచ్చిపెట్టే ప్రమాదముందంటున్నారు. ఇక డయాబెటిస్ లక్షణాలు ఇప్పటికే కనిపించిన వారు నిద్ర విషయంలో తగు జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.

నిద్రలేమి వారి కొంపముంచుతుంది. హఠాత్తుగా రక్తంలో చక్కెరలు తారాస్థాయికి చేరి రోగిని కోమాలోకి తీసుకువెళ్ళే ప్రమాదం సైతం ఉంటుంది. కాబట్టి డయాబెటిస్ రోగులు తగినంత వ్యాయామం, నిద్ర విషయంలో తగిన జాగ్రత్తలు వహించండం మరవకూడదంటున్నారు వైద్యులు.

Post a Comment

0 Comments