Full Style

>

మీరు కాంటాక్ట్ లెన్స్ వాడుతున్నారా...!



"సర్వేంద్రియాణాం నయనం ప్రధానం" అన్నారు. మరి ఆ నయనాలను జాగ్రత్తగా కాపాడుకోవాలిగదా మరి...
ముఖానికి కళ్ళజోడు అందంగానే వుంటుంది. కాని కొంతమంది తమ అందాన్ని ఇంకాస్త ద్విగుణీకృతం చేసుకోవడం కోసం వైద్యులు సూచించిన కళ్ళజోడును వాడకుండా దానికి బదులుగా వైద్యుల సలహా మేరకు కాంటాక్ట్‌లెన్స్ వాడుతున్నారు. ఇందులో తప్పేమీలేదు. కాని కొన్ని విషయాలను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతై

నా ఉంది.

* రాత్రి పడుకోబోయే ముందు లెన్స్‌లను తీసి పక్కన పెట్టాలి.
File FILE

* లెన్స్‌లను ప్రతి రోజు శుభ్రపరచుకోవాలి.

* ఒకవేళ మీరు మేకప్ వేసుకునేట్టయితే లెన్స్‌ను పెట్టుకున్నాక మేకప్ వేసుకోండి.

* మేకప్ తీసే ముందు లెన్స్‌ను తీసేయండి.

* మీరు లెన్స్‌ను శుభ్రపరచుకోవాలనుకుంటే ఎంగిలి, నీరు, సెలైన్ నీటితోగాని,లేదా మీ వైద్యులు సూచించని వేరే ఇతర సొల్యూషన్‌ను వాడకూడదు.

* మీరు ఎంతవరకు లెన్స్‌ను వాడాలో మీ వైద్యులు మీకు సూచించే ఉంటారు, అంతకన్నా ఎక్కువ సమయం వాడకూడదని వైద్యులు పేర్కొన్నారు.

* వైద్యులు సూచించిన సమయం పూర్తయిన తర్వాత ఆ లెన్స్‌ను ఎట్టిపరిస్థితుల్లోను వాడకూడదు.

* లెన్స్‌ను పెట్టుకునేటప్పుడు, లేదా తొలగించేటప్పుడు మీ చేతులను శుభ్రంగా కడుక్కోండి.

* వైద్యులు మీకు సూచించిన సొల్యుషన్‌నే వాడండి.

* లెన్స్‌ను భద్రపరచే కేస్( పెట్టె ) ప్రతి రోజు శుభ్రపరచుకోండి.

* లెన్స్‌ను భద్రపరచే కేస్( పెట్టె ) ప్రతి మూడు నెలలకోసారి మార్చండి.

* ఎప్పుడైనా కంట్లో దుమ్ము..ధూళి పడితే లెన్స్‌ను తొలగించి కళ్లు శుభ్రపరచుకోండి.

* లెన్స్‌ పాడైపోతే వెంటనే దాన్ని మార్చేయండి.

* మీరు హేర్ స్ప్రే వాడేటప్పుడు కళ్ళు మూసుకోండి. లేకుంటే ప్రమాదమేనంటున్నారు వైద్యులు.

Post a Comment

0 Comments