* మహిళల చేతివేళ్లలాగా సున్నితంగా, సుతారంగా ఉంటూ అందరిచేతా "లేడీస్ ఫింగర్స్" అనే ముద్దుపేరుతో పిలుచుకోబడే "బెండకాయలు" ఎన్నో రకాల లైంగిక సమస్యలకు ఉపశమనాన్ని కలిగిస్తాయని వైద్యులు పేర్కొంటున్నారు. కేవలం బెండకాయలు మాత్రమే కాకుండా, బెండ చెట్టుకు సంబంధించిన వివిధ భాగాలతో లైంగిక శక్తిని సైతం పెంచుకోవచ్చునని వారు సూచిస్తున్నారు.
* పండులా మారిన బెండకాయలను మంచినీటిలో క
ాసేపు
నానబెట్టి, వాటిని స్టవ్‌పై పెట్టి మరిగించి.. దించి చల్లార్చాలి. తరువాత
అందులో కాస్తంత చక్కెర కలుపుకుని తాగితే జననాంగాలవద్ద వచ్చే దురదలు, మంటలు
లాంటి సమస్యలు తగ్గుముఖం పడుతాయి. అలాగే గనేరియా వ్యాధితో బాధపడేవారికి
సైతం చక్కటి ఉపశమనం కలుగుతుంది.
* లేత బెండకాయలను ఉడికించిన నీటిని క్రమం తప్పకుండా సేవిస్తే మూత్రకోశంలో ఏర్పడే ఇన్‌ఫెక్షన్ల నుంచి తప్పించుకోవచ్చు. లైంగికపరమైన సమస్యలకే కాకుండా అనేక సాధారణ వ్యాధులకు కూడా బెండ చక్కటి ఔషధంగా పనిచేస్తుందని వైద్యులు చెబుతున్నారు.
* బెండకాయలను నీటిలో ఉడికించి ఆ నీటిని ఉదయం, సాయంత్రం వేళల్లో తీసుకోవటంవల్ల జలుబు, గొంతునొప్పి, గొంతు ఇన్‌ఫెక్షన్లకు చక్కటి ఉపశమనం లభిస్తుంది. పచ్చి బెండకాయలను ఉదయాన్నే పరగడుపున తిన్నట్లయితే మలబద్ధకంతో ఇబ్బందిపడేవారికి సులభంగా మలవిసర్జన జరుగుతుంది. అలాగే బెండకాయలను ప్రతిరోజూ ఆహారంలో క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితే పిల్లల్లో జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతుందని కూడా చాలామంది చెబుతుంటారు.

0 Comments