Full Style

>

యువత కోసం ఆరోగ్య చిట్కాలు



ఈ చలికాలంలో మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా...అయితే ముందుగా మీ ఉదరాన్ని శుభ్రం చేసుకోవాలి. కడుపులో మలం ఉంటే మీరు ఎంత తిన్నా, మంచి పౌష్టికాహారం తీసుకున్నా ఏమాత్రం ఫలితం లేదంటున్నారు వైద్యులు. భోజనం తినేటప్పుడు బాగా నమిలి తినాలి, దీంతో జీర్ణశక్తి పెరుగుతుంది. జీర్ణశక్తి సరిగా లేకపోతే మందులు వాడాల్సివస్తుంది. పురుషునిలో వీర్యం, స్త్రీలో తేజస్సు (కళ) ఉంటేనే వారు ఆరోగ్యంగా

ఉన్నట్టు ఆచార్య చరకుడు పేర్కొన్నారు. ఇక్కడ కిశోరావస్థ నుండి యువావస్థ వరకు తీసుకోవాల్సిన పౌష్టిక ఆహారం గురించి పేర్కొనడం జరిగింది. దీంతో ఆరోగ్యంగా బలంగా ఉండడానికి ఆస్కారముందని వైద్యులు తెలిపారు.

* పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో ఒకస్పూన్ నెయ్యి కలుపుకుని తాగాలి.

* పాల మీగడతోటి కలకండను కలుపుకుని తీసుకుంటే శరీరానికి మంచి బలాన్నిస్తుంది.

* బాదం పప్పును రాతిమీద అరగదీసి పాలల్లో కలుపుకుని తాగాలి. దీంతో అపారమైన శక్తి లభిస్తుంది.

* చిలగ్గొట్టిన మజ్జిగ నుంచి వచ్చిన వెన్నతోబాటు కలకండ కలిపి తీసుకోవాలి. ఆ తర్వాత నీటిని తాగకూడదు.

* అరలీటరు పాలలో 50 గ్రాముల ఉద్దిపప్పు వేసి ఉడకబెట్టిం తర్వాత దానిని పాయసంలాగా త్రాగండి. దీనివలన శరీరానికి మంచి బలం చేకూరుతుంది.

* ఉదయం పూట 1/4 లీటరు పాలతోబాటు రెండు..మూడు అరటిపండ్లు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. ముఖంపై కాంతి కూడా బాగా పెరుగుతుంది.

* 1/4 లీటరు పాలలో ఒక స్పూను అశ్వగంధ చూర్ణం, ఒక స్పూను కలకండ కలిపి ఉదయం..రాత్రిపూట తీసుకుంటే మార్పు కనపడుతుంది. ఇలా 40 రోజులు తీసుకోవాలి. ఈ పదార్థాం తీసుకున్నతర్వాత రాత్రి నోరు పుక్కలించి పడుకోవాలి.

* ఉదయం..రాత్రి భోజనం తర్వాత ఆపిల్, దానిమ్మ, అరటి, లేక ఏదైనా ఒక పండు తుప్పనిసరిగా తీసుకోవాలి.

* ఉదయంపూట 1/4 లీటరు చల్లటి పాలలో ఒక స్పూన్ తేనె కలిపి తీసుకుంటే శరీరంలో రక్త శాతం వృద్ధి చెందుతుంది.

* రెండు స్పూన్ల ఎర్రగడ్డ రసం, ఒక స్పూన్ తేనె, కాసింత నెయ్యి కలిపి తీసుకుంటే యోని శక్తి వృద్ధి చెందుతుంది.

పైన పేర్కొనబడిన చిట్కాలు వైద్యుల సలహా మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని స్త్రీ, పురుషులిరువురు ఉదయం రాత్రి తీసుకుంటే మంచిదని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.

Post a Comment

0 Comments