Full Style

>

క్యాన్సర్:



సూర్యరశ్మి లోపంతో వివిధ క్యాన్సర్లు
సూర్యరశ్మి లోపం వివిధ క్యాన్సర్లకు దారితీస్తోందని లండన్ శాస్త్రవేత్తల అధ్యయనం వెల్లడించింది. చర్మ క్యాన్సర్ సహా 15 రకాల క్యాన్సర్లు సూర్యరశ్మి లోపంతోనే వస్తాయని తెలిపింది....

క్యాన్సర్ వ్యాధికి ఔషధంలా వివాహం:

వివాహం అనేది కొన్ని రకాల క్యాన్సర్లకు చక్కటి ఔషధంలా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. మేరీలాండ్ మెర్లిన్ విశ్వవిద్యాలయానికి చెందిన శ

ాస్త్రవేత్తలు దీనిపై అధ్యయనం చేశారు. ఊపిరితిత్తుల క్యాన్సరు బాగా తీవ్రస్థాయిలో ఉన్న వారికి.. ప్రోస్టేట్, మెడ క్యాన్సర్లున్న వారికి కూడా వివాహం అనేది ఇంచుమించు మంచి మందులా పనిచేస్తుందని తమ పరిశోధనల్లో రుజువైనట్లు పేర్కొన్నారు.

వివాహం చేసుకున్నవారి విషయంలో మగవారి కంటే స్త్రీలే ఎక్కువ కాలం జీవించినట్లు వారి పరిశోధనలో స్పష్టమైంది. వివిధ రకాల క్యాన్సర్లతో బాధపడుతున్న 170 మంది రోగులను వీరు తమ అధ్యయనం నిమిత్తం ఎంచుకున్నారు. వారి వైద్య నివేదికలను క్షుణ్ణంగా పరిశీలించారు.

వీరిలో ఒక రకమైన ఊపిరితిత్తుల క్యాన్సర్ తీవ్రస్థాయిలో ఉన్న రోగులూ ఉన్నారు. వారిలో చాలామంది పదేళ్లకు పైగా కీమెథెరఫీ, రేడియేషన్ వంటి వాటిని తీసుకున్నారు. అయితే, ఇందులో వివాహిత మహిళలు, పురుషులు కూడా ఎక్కువ కాలం చికిత్సను తట్టుకుని జీవించగలిగినట్లు వారి వైద్య రికార్డులు తెలిపాయి. దీన్నిబట్టి క్యాన్సర్ వ్యాధికి వివాహం విరుగుడుగా పనిచేస్తుంది.

Post a Comment

0 Comments