ఈ ఆధునిక యుగంలో ప్రపంచ వ్యాప్తంగా మనుష్యూల్లో అధిక
బరువు, స్థూలకాయం ప్రధాన ఆరోగ్య సమస్యలుగా ఉన్నాయి. అధిక బరువున్న వారు 1.2
బిలియన్లుండగా, వారిలో 300 మిలియన్లు మంది స్థూలకాయులుగా ఉన్నారు. ఈ సమస్య
ప్రమాదకరమైన అనారోగ్యాలకు దారితీస్తుంది.
బరువు ఏ వయసులో ఎలా పెరుగుతుంది?
మన శరీరంలో కొవ్వు ఎక్కువగా చేరితే అధిక బరువవుతాం. దీనినే ఊబకాయం అంటాం. ప్రపంచం మొత్తంలో ఈ అధిక బరువు వల్ల ఎంతమందో ఎన్నో విధాలుగా బాధపడుతున్నారు. కాబట్టి మనం బరువు పెరగకుండా చూసుకోవడం చాలా అవసరం. అందుకు అవగాహన ముఖ్యం. ముందుగా బరువు పెరగడానికి కారణాల్ని చూద్దాం.
ముఖ్యంగా మధ్యవయసులో ఎక్కువమంది బరువు పెరుగుతుంటారు. కొందరు చిన్నప్పటి నుంచి అధిక బరువు తో ఉండవచ్చు. ఏ వయసు లోనైనా బరువు ఎక్కువగా కనిపించవచ్చు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్థికంగా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళలో ఈ అధిక బరువు తక్కువగా కనిపిస్తోంది. వంశపారంపర్యంగా కూడా అధిక బరువు వస్తుంటుంది. తల్లిదండ్రులు ఇద్దరూ అధిక బరువున్న వాళ్ళయితే వాళ్ల పిల్లల్లో 80 శాతం మందికి జీన్స్ ద్వారా అధిక బరువుండే లక్షణం రావచ్చు. ఎండో క్రైన్‌గ్లాండ్స్ సిక్రీషన్స్ ఇంబాలన్స్ వల్ల అధిక బరువు కలుగవచ్చు.
మహిళలు - అధిక బరువు
పెద్ద మనిషి అయినప్పుడు, గర్బవతులైనప్పుడు, ముట్లుడిగిన తర్వాత సాధారణంగా కలుగుతుంటుంది. స్టిరాయిడ్స్, నోటి ద్వారా కాంట్రాసెప్టివ్, ఇన్సులిన్ వంటివి తీసుకోవడం వల్ల బరువు పెరగవచ్చు. అధిక బరువున్నప్పుడు లావుగా తయారై, మన దైనందిన కార్యక్రమాల్ని నిర్వహించడమే కష్టమవుతుంటుంది. బద్ధకం పెరుగుతోంది. త్వరగా కదల బుద్దికాదు. శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుంది.
అధిక బరువు తెలుసుకోవడం ఎలా?

0 Comments