ఆధునిక యుగంలో జీవనశైలి మార్పుతో స్థూలకాయం పెరగడంతో పాటు
మధు మేహం, కొలెస్ట్రాల్, రక్తపోటు సమస్యలు కూడా పెరిగి బ్రెరుున్
స్ట్రోక్‌తో మరణాలు ఎక్కువున్నారుు . మెదడులోని రక్తనాళాల్లో రక్తం
గడ్డకట్టడం, ఎంబలిజం, రక్తనాళాలు చిట్లడం వల్ల బ్రెరుున్ స్ట్రోక్
వస్తుంది . బ్రెరుున్ స్ట్రోక్ ఎక్కువగా వయసు మళ్ళిన వారిలో అధికంగా
వస్తుంది. బ్రెరుున్ స్ట్రోక్ కొంద రిలో పుట్టు కతోనే రక్తనాళాల్లోని
ఎన్యూరిజం వంటి లోపం ఉండి, అవి పగలడం వల్ల ప్రమాదం వాటిల్లుతుంది.
తుంది. మరికొందరిలో అతి తేలకపాటి బ్రెయిన్ స్ట్రోక్ పరిస్థితి ఏర్పడుతుందన్నారు.
ట్రాన్సియంట్ ఇష్కిమిక్ ఎటా క్ అనే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళలో తాత్కాలికంగాకాలు, చేయి బలహీన మవ్వడం, మూతి వంకరపోవడం, మాట స్పష్టత లేక పోవడం, కళ్ళు తిరిగి పడిపోవడం జరిగినప్పటికీ కొద్ది గంటల్లో తిరిగి పూర్తిగా కోలుకుంటారు. ఇటువంటి వారు బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి మూల కారణాన్ని గుర్తించి చికిత్స పొందకపోతే పూర్తి స్థాయిలో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి శాశ్వతంగా పక్షవాతంతో బాధపడే అవకాశం ఉంది. ఈ స్ట్రోక్ లక్షణాలు కలిగి ఉంటే ఆలస్యం చేయకుండా అత్యవసర వైద్య సదుపాయాన్ని తీసుకోవడం ఉత్తమం.
స్ట్రోక్ పరీక్షలు
స్ట్రోక్ అని అనుమాన కలిగినప్పుడు చిన్నపాటి పరీక్ష దీనిని నిర్థారించడానికి ఉపయోగపడుతుంది.
1. ముఖంపై చిరునవ్వుకు ప్రయత్నించటం. దీని ద్వారా ఒక వైపు ముఖంలో నువ్వు కనపడక శుష్కించుచూ ఉండటం.
2. రెండు చేతులు పైకి ఎత్తడం, ఒకవేళ ఒకవైపు చేయి పూర్తిగా పైకి లేవ లేక పోవటం.
3. ఒక వాక్యాన్ని చెప్పడం, ఈ ప్రయత్నంలో పదాలు సక్రమంగా పలకలేకపోవడం.
ఇందులో ఏ ఒక్క లక్షణం కనిపించినా, పరిస్థితి తీవ్రంగా ఉందని భావితీంచాలి.
స్ట్రోక్ సంభవించినప్పుడు ప్రతి సెకండ్గ సమయం చాలా విలువైనది. మెదడులో ఆక్సిజన్ క్షీణిస్తున్నపప్పుడు క్రమక్రమంగా కణాలు మరణించటం ఆరంభమవుతాయి. కణాల రక్తం గడ్డలను కరిగించేందుకు మందులు ఉన్నాయి. కానీ ఈ మందులు స్ట్రోక్ సంభవించిన 3 గంటల లోపు వాడాలి. ఒక్కసారి మెదడులో ఒక్క క్షణం మరణించినదో ఆ కణానికి సంబంధించిన అవయవాలు పనిచేయడం ఆగిపోతాయి.
దీనితో దీర్ఘకాలిక అంగవైకల్యం సంభవించే అవకాశం ఉంది. స్ట్రోక్ లక్షణాలు రెండు విధాలుగా ఉంటాయి. వీటికి ఒకే విధంగా చికిత్స అందించలేరు. సిటిస్కాన్ ద్వారా స్ట్రోక్ రక్తనాళాలు బ్లాక్ అవటం వలన లేదా రక్తనాళాలు చిట్లడం వలన సంభవించిందా అనేది కనుగొన వచ్చు. ఇతర పరీక్షల ద్వారా ఈ డామేజ్ శరీరంలో ఏ ప్రాంతంలో జరిగింది అనేది గుర్తించవచ్చు
స్ట్రోక్ లక్షణాలు
1. అకస్మాత్తుగా ఒకవైపు శరీరం మొద్దుబారుట లేదా శరీరంలో బలహీనత ఏర్పడుట.
2. అకస్మాత్తుగా కంటి చూపు ఒకవైపుగాని, లేదా రెండు కళ్ళలోగాని సన్నగిల్లుట.
3. ఆహారం లేదా మరేదైనా మింగటంలో బాధ కలుగుట.
4. ఆకస్మికంగా తీవ్రమైన తలనొప్పి సంభవించుట.
5. ఆకస్మికంగా గందరగోళం లేదా ఇతరుల మాటలను అర్థం చేసుకోలేకపోవడం.

0 Comments